
వాళ్లిద్దరూ మళ్లీ ఒక్కటయ్యారా?
ముంబై: బాలీవుడ్ జంట మలైకా అరోరా, అర్బాజ్ ఖాన్ విడిపోతున్నారంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి. తామిద్దరూ విడిపోతున్నట్టు మలైకా, అర్బాజ్ ప్రకటించారు కూడా. మలైకా తన కొడుకును తీసుకుని అర్బాజ్ ఇంటి నుంచి అమ్మనాన్నల దగ్గరకు వెళ్లిపోయింది. కాగా ఇటీవల అర్బాజ్, మలైకా ఓ లేట్ నైట్ డిన్నర్లో కనిపించి షాకిచ్చారు.
అర్బాజ్.. మలైకా కుటుంబంతో కలసి బాంద్రాలోని ఓ రెస్టారెంట్కు వెళ్లాడు. వీళ్ల వెంట మలైకా తల్లి జాయ్సె, సోదరి అమృతా అరోరా, షకీల్ లడక్ దంపతులు ఉన్నారు. రెస్టారెంట్లో అర్బాజ్, మలైకా చాలాసేపు గడిపారట. అయితే డిన్నర్ అయ్యాక వీళ్లిద్దరూ వేర్వేరు కార్లలో వెళ్లిపోయారు. అమృత, షకీల్.. అర్బాజ్తో కలసి వెళ్లగా, మలైకా మరో కారులో వెళ్లింది.
మలైకా, అర్బాజ్ 17 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఓ కుమారుడు ఉన్నాడు. ఈ ఏడాది మొదట్లో విడిపోతామని ప్రకటించిన ఈ జంట విడాకుల వరకు వెళ్లకుండా రాజీపడినట్టు సన్నిహితులు చెబుతున్నారు. మనసు మార్చుకున్న మలైకా.. వివాహబంధానికి మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు.