
విడాకులన్నారు... విందు చేసుకున్నారు!
ముంబై: బాలీవుడ్ జంట అర్బాజ్ ఖాన్, మలైకా అరోరా జంట అభిమానులను సందిగ్దంలో పడేసింది. విడాకులు కావాలంటూ కోర్టు మెట్లు ఎక్కిన వీరిద్దరూ కలిసి కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవడంతో అభిమానులు అయోమయానికి గురవుతున్నారు. స్నేహితులతో కలిసి గోవాలో వీరు న్యూఇయర్ పార్టీని ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను మలైకా సోదరి అమృత అరోరా సోషల్ మీడియాలో షేర్ చేసింది. అర్బాజ్, మలైకా ఎంతో కలివిడిగా పార్టీలో కనిపించారు. అందరితో కలిసి విందును ఆస్వాదించారు.
చాలా రోజుల తర్వాత వీరిద్దరూ వేడుకల్లో కనిపించడంతో మళ్లీ కలిసిపోయారన్న ప్రచారం మొదలైంది. ఇద్దరికీవున్న కామన్ ఫ్రెండ్స్ కారణంగా పార్టీకి వచ్చారా, నిజంగానే కలిసిపోయారా అన్నది మున్ముందు తెలుస్తుంది. విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న వీరిద్దరికీ గత నవంబర్ లో ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు కౌన్సిలింగ్ నిర్వహించింది. దీంతో వీరిద్దరిలో మార్పు వచ్చివుండొచ్చని సన్నిహితులు అంటున్నారు.