విడాకుల కోసం కోర్టుకు వెళ్ళిన బాలీవుడ్‌ జంట! | Malaika Arora Khan And Arbaaz Khan File For Divorce: Reports | Sakshi
Sakshi News home page

విడాకుల కోసం కోర్టుకు వెళ్ళిన బాలీవుడ్‌ జంట!

Published Sat, Nov 19 2016 5:39 PM | Last Updated on Tue, Oct 2 2018 3:56 PM

విడాకుల కోసం కోర్టుకు వెళ్ళిన బాలీవుడ్‌ జంట! - Sakshi

విడాకుల కోసం కోర్టుకు వెళ్ళిన బాలీవుడ్‌ జంట!

ముంబై: విభేదాల కారణంగా విడిపోయారని, కొన్ని రోజుల తర్వాత మళ్లీ ఒక్కటయ్యారంటూ వార్తల్లో నిలిచిన బాలీవుడ్‌ జంట మలైకా అరోరా ఖాన్‌, అర్బాజ్‌ ఖాన్‌ వ్యవహారం చివరకు కోర్టుకు చేరింది. ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టులో వీరిద్దరూ విడాకులకు దరఖాస్తు చేసినట్టు సమాచారం.

సల్మాన్‌ ఖాన్‌ సోదరుడైన అర్బాజ్‌ (49), మలైకా (43) పరస్పర అంగీకారంతో విడాకుల కోసం గతవారం కోర్టును సంప్రదించినట్టు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. గత మార్చిలో విడిపోతున్నామంటూ ఇద్దరూ సంయుక్తంగా ఓ ప్రకటనలో తెలిపారు. ఇరు కుటుంబాల సభ్యుల జోక్యంతో ఈ జోడీ అప్పట్లో  కోర్టు వరకు వెళ్లలేదు. వీరిద్దరిని కలిపేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. అర్బాజ్, మలైకా డిన్నర్‌, పార్టీలకు హాజరవడంతో మళ్లీ కలసిపోయారని వార్తలు వచ్చాయి. అయితే వీరిద్దరూ విడిపోవాలనే నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. 1998లో అర్బాజ్, మలైకా వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఓ కుమారుడు ఉన్నాడు. అర్బాజ్‌, మలైకా పలు సినిమాల్లో నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement