'మా బ్రదర్స్ మధ్య కాంపిటిషనే లేదు' | No competition between me and Salman Khan in hosting shows, says Arbaaz Khan | Sakshi
Sakshi News home page

'మా బ్రదర్స్ మధ్య కాంపిటిషనే లేదు'

Published Sun, Dec 6 2015 3:56 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

'మా బ్రదర్స్ మధ్య కాంపిటిషనే లేదు' - Sakshi

'మా బ్రదర్స్ మధ్య కాంపిటిషనే లేదు'

'మా బ్రదర్స్ మధ్య ఎలాంటి కాంపిటేషన్ లేదు. సల్మాన్‌ ఎక్కడా? నేనెక్కడా? నిజాయితీగా చెప్తున్నా మా మధ్య పోటీ అన్న ముచ్చట లేదు' అంటున్నాడు నటుడు, నిర్మాత అర్బాజ్‌ఖాన్. ఆయన త్వరలోనే 'పవర్ కపుల్' టీవీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నారు. ఇప్పటికే ఆయన సోదరుడు సల్మాన్ ఖాన్ 'బిగ్‌బాస్‌' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో తాజా షోతో మీ అన్న సల్మాన్ 'బిగ్‌బాస్‌'కు పోటీగా వస్తున్నారా? అని ప్రశ్నిస్తే అర్బాజ్‌ అదేమీ లేదంటూ సమాధానమిచ్చాడు. టీవీ కార్యక్రమాల విషయంలో తమ మధ్య పోటీ అనే ప్రసక్తే ఉండదని చెప్పాడు. అర్బాజ్‌, ఆయన భార్య మలైకా అరోరా ఖాన్ కలిసి సోనీ ఎంటర్‌టైన్ టెలివిజన్‌లో 'పవర్ కపుల్‌' షోకు హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. టీవీ వ్యాఖ్యాతగా కూడా విజయం సాధిస్తే అంతకన్నా కావాల్సిందేమిటంటూ ఆయన ముక్తాయించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement