
సల్మాన్ గురించి కొత్తగా చెప్పేదేముంది?
ముంబై: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పై జీవిత చరిత్రను రూపొందిస్తున్నట్లు వచ్చిన వార్తలను దర్శకుడు అర్బాజ్ ఖాన్ ఖండించాడు. తాజాగా చోటు చేసుకున్న ఆ రూమర్లలో ఎటువంటి వాస్తవం లేదని తెలిపాడు.' నేను సల్మాన్ జీవిత చరిత్రను వెండి తెరకు పరిచయం చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. అయినా సల్మాన్ ఖాన్ గురించి కొత్తగా చూపించడానికి ఏముంది. ఒకవేళ సల్మాన్ అడిగితే మాత్రం అప్పుడు చూద్దాం'అని అర్భాజ్ స్సష్టం చేశాడు.
ఇప్పటికే అతను పాపులర్ నటుడని.. అతని గురించి ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. ఎవరి జీవిత చరిత్రలను తాను రూపొందించే ప్రయత్నాలు అయితే ఇప్పటివరకూ చేయలేదన్నాడు. కాగా, నీరజ్ పాండే తెరకెక్కిస్తున్న టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవిత చరిత్ర మాత్రం కచ్చితంగా సవాల్ లాంటిదన్నాడు. అసలు ధోనీ గురించి ఏమీ తీస్తురనే దానిపై తామంతా ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు అర్బాజ్ తెలిపాడు.