బిగ్‌బాస్ 8లో చాన్నాళ్లకు కాస్త కళ కనిపిస్తోంది. కొత్తగా ఎనిమిది మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా వచ్చారు. కాసేపు కామెడీ చేసి నవ్వుకున్నారు. కానీ ఇంతలోనే నామినేషన్స్ పుల్ల పెట్టేశాడు. దీంతో కొత్త వర్సెస్ పాత అన్నట్లు ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు వచ్చేసింది.
ఇకపోతే వ్యక్తి వ్యక్తికి రూల్స్ మారుతున్నాయని చెప్పి హరితేజ.. యష్మిని నామినేట్ చేసింది. తనకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేస్తానని యష్మి సమాధానమిచ్చింది. మీకు ఇష్టం లేదు అన్నచోట వేరే రూల్ అప్లై అవుతుందని హరితేజ చెప్పగా.. నా గేమ్, నాకు ఎవరు డిస్ట్రబింగ్‌గా ఉన్నారో వాళ్లని కదా చెయ్యాలి అని యష్మి కోపాన్ని కంట్రోల్ చేసుకుని మరీ మాట్లాడుతున్నట్లు అనిపించింది. పృథ్వీని కూడా నామినేట్ చేసింది.
(ఇదీ చదవండి: జానీ మాస్టర్ దగ్గర ఛాన్స్.. నా కూతురిని పంపొద్దన్నారు: నైనిక తల్లి)
అయితే ఈ నామినేషన్‌ని నేను అంగీకరించను అని పృథ్వీ అనేరికి.. ఈ నామినేషన్‌ని నేను అంగీకరించాను. ఎందుకంటే ఇది నా ఓపీనియన్ అని హరితేజ గట్టిగానే ఇచ్చేసింది.
ఇక గౌతమ్ కృష్మ.. విష్ణుప్రియని నామినేట్ చేశాడు. నీ గేమ్ పక్కనబెడ్డి వేరే వ్యక్తి మీద దృష్టి పెట్టినట్లు అనిపిస్తుందని గౌతమ్ కృష్ణ కారణం చెప్పాడు. నేనేంటి, నేనేం ఫీలయ్యాను, నా ఎమోషన్స్ ఏంటి అనేదే నేను చూపిస్తానని విష్ణు ఆన్సర్ చెప్పింది. నయని పావని కూడా ఈమెనే నామినేట్ చేసింది. సీరియస్‌నెస్ అస్సలు లేదనిపిస్తోందని రీజన్ చెప్పింది.
(ఇదీ చదవండి: బిగ్ బాస్ ఐదవ వారం విశ్లేషణ...'పాత బొమ్మలతో కొత్త పోస్టర్')
షోని అర్థం చేసుకోవడానికే టైమ్ కావాలని విష్ణుప్రియ చెప్పగా.. బిగ్‌బాస్ ఉండేది 15 వారాలే కదా అని నయని పావని సైలెంట్‌గా కౌంటర్ వేసింది. దీంతో విష్ణుప్రియ నోరు మూసేసుకుంది. అలానే ఎమోషన్స్ అంటే కేవలం ఏడుపు కాదు కదా అని నయని పావని.. సీతని నామినేట్ చేసింది.
యష్మి, విష్ణు, గంగవ్వ, సీత, పృథ్వీ, మెహబూబ్.. ఈసారి నామినేషన్స్‌లో ఉన్నారు. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌కి ఇమ్యూనిటీ పవర్ ఉన్నప్పటికీ కచ్చితంగా ఇద్దరూ లిస్టులో ఉండాలని బిగ్‌బాస్ చెప్పడంతో మెహబూబ్, గంగవ్వ వచ్చారు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నారు?
(ఇదీ చదవండి: 'నేనేమన్నా యుద్ధానికి పోతున్నానా?'.. మొదటి రోజే బుక్కైన అవినాశ్!)
Comments
Please login to add a commentAdd a comment