ఆ అబ్బాయిని నేను కొట్టలేదు.. ఏం జరిగిందంటే: నానా పటేకర్‌ | Nana Patekar Apologises For Selfie Boy Who He Slapped During Film Shoot In Varanasi, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Nana Patekar Apologizes Video: ఆ అబ్బాయిని నేను కొట్టలేదు.. ఏం జరిగిందంటే: నానా పటేకర్‌

Published Thu, Nov 16 2023 12:30 PM | Last Updated on Thu, Nov 16 2023 1:05 PM

Nana Patekar Says Apologize To Selfie Boy - Sakshi

బాలీవుడ్‌లో తన నటనతో ఎనలేని ప్రశంసలు దక్కించుకున్నాడు నానా పటేకర్‌.. కానీ ఆయన నిజ జీవితంలో అప్పుడప్పుడు వివాదంలో చిక్కుకుంటుంటాడు. కొద్దిరోజుల క్రితం ‘ది వ్యాక్సిన్‌ వార్‌’తో ప్రేక్షకులను అలరించాడు నానా పటేకర్‌.  సినిమా షూట్‌లో భాగంగా ఆయన వారణాసిలో తాజాగా పర్యటించాడు. వారణాసి వీధుల్లో షూటింగ్‌ జరుగుతోన్న సమయంలో ఓ అభిమాని నానా పటేకర్‌ కనిపించగానే ఫోన్‌ పట్టుకుని సెల్ఫీ కోసం ఆయన దగ్గరకు వెళ్లాడు. అంతే.. ఆ నటుడు కోపంతో గట్టిగా తల మీద ఒక్కటిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు నానా పటేకర్‌ దురుసు ప్రవర్తనను తప్పుపట్టారు. 

ఈ వివాదంపై ఆ చిత్ర  దర్శకనిర్మాత అనిల్‌ శర్మ ఇలా స్పందించాడు. 'సినిమాలో నానా పటేకర్‌ మానసిక స్థితి బాగలేని పాత్రలో కనిపిస్తారు. గుంపులో ఉన్న ఆ వ్యక్తితో సెల్ఫీకోసం ఒకరు రావడం. తనను ఆ వ్యక్తి కొట్టడం. ఇదంతా షూటింగ్‌లో భాగం మాత్రమే' అని అన్నారు.

క్షమించమని కోరిన నానా పటేకర్‌
'నేను ఒక అబ్బాయిని కొట్టిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సీక్వెన్స్ మా సినిమాలో భాగమే అయినప్పటికీ, మేము ఒక రిహార్సల్ చేశాము... మేము రెండవ రిహార్సల్ చేయడానికి షెడ్యూల్ చేశాము. దర్శకుడు స్టార్ట్‌ అనగానే. వీడియోలోని అబ్బాయి లోపలికి వచ్చాడు. అప్పుడు కెమెరా ముందు మేము నటించేందకు సిద్ధంగా ఉన్నాము. అతను ఎవరో నాకు తెలియదు, అతను మా సిబ్బందిలో ఒకడని భావించాను కాబట్టి నేను చెంపదెబ్బ కొట్టాను. సీన్ ప్రకారం అతన్ని వెళ్లిపొమ్మని కూడా అప్పుడు చెప్పాను. తర్వాత, అతను సిబ్బందిలో భాగం కాదని నాకు తెలిసింది.

(ఇదీ చదవండి: నితిన్‌ సినిమాను నాన్న ఎందుకు ఒప్పుకున్నారంటే: శివాని రాజశేఖర్‌)

కాబట్టి, నేను వెంటనే అతనిని తిరిగి పిలిచాను కూడా.. కానీ అతను అప్పటికే వెళ్లిపోయాడు. బహుశా అతని స్నేహితుడు ఈ వీడియో చిత్రీకరించి ఉంటాడు. నేను. ఫోటో కోసం ఎవ్వరితోనూ ఇప్పటి వరకు నో చెప్పలేదు. నేను ఇలా చేసే వ్యక్తిని కాదు. పొరపాటున ఇలా జరిగింది. నేను అర్థం చేసుకోవడంలో తప్పు జరిగింది. ఈ వీడియో ద్వారా నేను క్షమాపణ కోరుతున్నాను. నన్ను క్షమించండి. నేను ఇలాంటివి ఎప్పటికీ చేయను.' అని ఆయన అన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement