టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న లక్ష్మణ్ మీసాల ఈమధ్యే రిలీజైన మంగళవారం సినిమాతో మంచి మార్కులు కొట్టేశాడు. ఎన్నో నాటకాల్లో యాక్ట్ చేసిన లక్ష్మణ్.. కో అంటే కోటి సినిమాతో నటుడిగా ప్రయాణం ఆరంభించాడు. పాతికకు పైగా సినిమాలు చేసిన ఇతడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను పడ్డ కష్టాలను ఏకరువు పెట్టాడు.
ఏ పనిలోనూ తృప్తి దొరకలేదు
లక్ష్మణ్ మాట్లాడుతూ.. 'పదో తరగతికే చదువు ఆపేశాను. సినిమాల్లోకి రావడానికి ముందు ఎన్నో పనులు చేశాను. ఏ పని చేసినా అందులో తృప్తి దొరకలేదు. అందుకని కొన్నాళ్లకే ఆ పని మానేసి మరొకటి చేసుకుంటూ పోయాను. కానీ సినిమాలంటే ఇష్టం ఉండటంతో ఇక్కడ ఆగిపోయాను. నటుడిగానే కొనసాగుతున్నాను. అయితే ఇండస్ట్రీకి రావడానికి ముందు కూలీ పని కూడా చేశాను. నాకు తెలియకుండానే కొందరు ప్రముఖుల ఇంటి నిర్మాణానికి పని చేశాను.
తెలియకుండా వాళ్ల ఇంటికి పని చేశా
అందులో ఒకటి అల్లు అర్జున్ ఇంటి నిర్మాణానికి పని చేయడం! ఆయన ఇంటి నిర్మాణానికి కూలీ పని చేశాను. చేసినప్పుడు తెలియదు కానీ, తర్వాత అది అల్లు అర్జున్ గారి ఇల్లని తెలిసింది. కూలీ పని చేసేటప్పుడు చాలా దెబ్బలు తగులుతాయి. అలా అక్కడ కూడా పెద్ద దెబ్బ తగిలి రక్తం కారింది. ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ భవన నిర్మాణానికి సైతం పని చేశాను. దర్శకరచయిత ఎస్వీ కృష్ణారెడ్డి ఇంటికి కూడా కూలీగా పని చేశాను. ఎవరెవరి ఇంటికో తెలియకుండానే పని చేశాను' అని తెలిపాడు లక్ష్మణ్.
చదవండి: కానరాని లోకాలకు కరుప్పు ఎంజీఆర్.. ఎన్ని కష్టాలు వచ్చినా..
యాంకర్ సుమ కొడుకు ఫస్ట్ సినిమా ఎలా ఉందంటే?
Comments
Please login to add a commentAdd a comment