44 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోబోతున్న నటుడు? | Is Actor Premji Amaran Getting Married? Post Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Premji Amaran: ఈసారి పెళ్లి పక్కా అంటున్న నటుడు.. నిజమేనా మాస్టారు?

Published Wed, Jan 3 2024 12:11 PM | Last Updated on Wed, Jan 3 2024 1:05 PM

Is Actor Premji Amaran Getting Married? - Sakshi

కొత్త సంవత్సరం ప్రారంభంలో చాలామంది చాలా కలలు కంటుంటారు. వేకువజామునే నిద్ర లేవాలి, జిమ్‌కు వెళ్లాలి, డైట్‌ మెయింటైన్‌ చేయాలి, జంక్‌ ఫుడ్‌ మానేయాలి, ఖర్చులు తగ్గించుకోవాలి, ఉన్న అప్పులు తీర్చేయాలి.. ఇలా ఎన్నో అనుకుంటారు. కానీ కొందరే వాటిని విజయవంతంగా అమలు చేయడంలో సఫలీకృతులు అవుతారు. తాజాగా ఓ నటుడు ఈ ఏడాది ఓ ముఖ్యమైన పని పూర్తి చేయాలనుకుంటున్నాడు. ఇళయరాజా సోదరుడు జ్ఞాని అమరన్‌ చిన్న కుమారుడు, నటుడు ప్రేమ్‌జీ అమరన్‌ 2024లో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడట!

ఈ ఏడాదే పెళ్లి
ఈ విషయాన్ని ఆయనే సోషల్‌ మీడియాలో వెల్లడించాడు. 'హ్యాపీ న్యూయర్‌. ఈ ఏడాది నేను వైవాహిక జీవితాన్ని ప్రారంభిస్తాను' అని పోస్ట్‌ పెట్టాడు. ఇది చూసిన జనాలు.. ఈ ట్వీట్‌ చేసిన తర్వాతే జపాన్‌లో భారీ భూకంపం వచ్చి ఉంటుంది.. ఇంతకీ ఇది నిజమేనా మాస్టారు? అని నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. కాగా 44 ఏళ్ల వయసున్న ఈ నటుడు ఇంతవరకు పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గానే మిగిలిపోయాడు. మరి ఈసారైనా దీన్ని సీరియస్‌గా తీసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడో, లేదో చూడాలి!

ఆయన సినిమాలో కచ్చితంగా ఉండాల్సిందే!
అమరన్‌ కెరీర్‌ విషయానికి వస్తే.. పున్నగై పూవె సినిమాతో నటుడిగా సినీ ప్రయాణం మొదలుపెట్టాడు. శింబు హీరోగా నటించిన వల్లభ మూవీతో గుర్తింపు తెచ్చుకున్నాడు. గోవా, సరోజ, బిర్యానీ, మంగత తదితర చిత్రాలు చేశాడు. డైరెక్టర్‌ వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించిన ప్రతి సినిమాలో ప్రేమ్‌జీ నటించాడు. కస్టడీ, ప్రిన్స్‌ చిత్రాలతో తెలుగువారికీ దగ్గరయ్యాడు. ప్రస్తుతం విజయ్‌ నటిస్తున్న 68వ సినిమాలో అమరన్‌ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.

చదవండి: హీరోగా ఆట సందీప్‌.. బెస్ట్‌ సంచాలక్‌ అట! పోస్టర్‌పై నెట్టింట ట్రోల్స్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement