
బలగం సినిమాలో నటించిన అందరు నటీనటులకు మంచి గుర్తింపు వచ్చింది. వారిలో నటుడు మురళీధర్ కూడా ఉన్నాడు. ఈయన స్వస్థలం మెదక్ జిల్లా రామాయంపేట. సిద్దిపేటలో చదువుకున్నాడు. ఎలక్ట్రిసిటీ బోర్డులో 27 ఏళ్లు పని చేసి రిటైర్ అయిన ఈ పెద్దాయన విశ్రాంతి తీసుకునే సమయంలో నటనారంగంలో అడుగుపెట్టాడు. బలగంతో మంచి గుర్తింపు అందుకున్నాడు.
ఇటీవలే బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాలోనూ నటించాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'రిటైర్ అయ్యాక నటుడవ్వాలనే కోరికతో సినిమా రంగానికి వచ్చాను. ఈ వయసులో నాకు ఏమైనా సినిమా అవకాశాలు వస్తాయో లేదోనని మొదట సీరియల్స్ వైపు వెళ్లాను. అక్కడ గుర్తింపు వచ్చాక సినిమాల్లో ప్రయత్నించాను. బలగం, భగవంత్ కేసరి.. ఇలా సినిమాలు చేసుకుంటూ పోతున్నాను. భగవంత్ కేసరి మూవీలో మంచి పాత్ర ఇచ్చారు. ఇంత మంచి గుర్తింపు వస్తున్నందుకు సంతోషంగా ఉంది' అని ఆనంద భాష్పాలు రాల్చాడు మురళీధర్ గౌడ్.
చదవండి: ఓటీటీలోకి వచ్చేసి భయపెడుతున్న హారర్, సైకో థ్రిల్లర్ మూవీస్.. స్ట్రీమింగ్ అక్కడే!
Comments
Please login to add a commentAdd a comment