muralidhar
-
‘కాళేశ్వరం’ నిర్ణయాలు ఎవరివి?
సాక్షి, హైదరాబాద్: ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో అత్యున్నత స్థాయిలో నిర్ణయాలు తీసుకున్నది ఎవరు? ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు బదులు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాలనే నిర్ణయం ఎవరిది? కాళేశ్వరం డీపీఆర్‌ను కేంద్ర జలసంఘాని(సీడబ్ల్యూసీ)కి పంపిన తర్వాత మళ్లీ ఎందుకు మార్పులు చేశారు?’’అని రాష్ట్ర నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఈఎన్సీ (జనరల్) సి.మురళీధర్‌పై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది. నిర్ణయాలు ప్రభుత్వం స్థాయిలో జరిగాయని మురళీధర్ బదులివ్వగా.. ‘ప్రభుత్వం అంటే ఎవరు?’అని కమిషన్ తిరిగి ప్రశ్నించింది. ‘హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ (ప్రభుత్వ అధినేత)’అని మురళీధర్ బదులివ్వగా.. ప్రభుత్వఅధినేత అంటే ఎవరని కమిషన్ వివరణ కోరింది. దీంతో నీటిపారుదల శాఖ కార్యదర్శి అని మురళీధర్ బదులిచ్చినట్టు తెలిసింది. కాళేశ్వరం బరాజ్‌లపై విచారణలో భాగంగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ బుధవారం బీఆర్కేఆర్ భవన్‌లోని తమ కార్యాలయంలో క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియను ప్రారంభించి.. తొలిరోజున రిటైర్డ్ ఈఎన్సీ మురళీధర్‌ను ప్రశ్నించింది. నీటి లభ్యతపై వ్యాప్కోస్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రాణహిత ప్రాజెక్టును రీఇంజనీరింగ్ చేసి.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినట్టు మురళీధర్ తెలిపారు. క్షేత్రస్థాయి ఇంజనీర్ల ప్రతిపాదనల ప్రకారమే డీపీఆర్‌లో మార్పులు చేసినట్టు వెల్లడించారు. పలు అంశాల్లో కిందిస్థాయి ఇంజనీర్లు తప్పు చేశారని పేర్కొన్న మురళీధర్.. గత ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధుల పాత్రపై ఎలాంటి ప్రస్తావన చేయలేదు. కమిషన్ విచారణ తీరిది.. » బరాజ్‌ల నిర్మాణం పూర్తికాక ముందే కాంట్రాక్టర్లకు సబ్ స్టాన్షియల్ వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్లు ఎలా జారీ చేశారని కమిషన్ ప్రశ్నించగా.. జారీ చేసిన ఇంజనీర్లది వ్యక్తిగత స్థాయిలో తప్పేనని మురళీధర్ పేర్కొన్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సర్టిఫికెట్ జారీ చేస్తే సూపరింటెండింగ్ ఇంజనీర్, చీఫ్ ఇంజనీర్ కూడా సంతకాలు చేశారని కమిషన్ ఎత్తిచూపగా.. వారు తప్పుచేశారని బదులిచ్చారు. » బరాజ్‌ల నిర్మాణంలో పర్యవేక్షక ఇంజనీర్లతోపాటు క్వాలిటీ కంట్రోల్ విభాగం ఇంజనీర్లు బాధ్యతల నిర్వహణలో విఫలమయ్యారని కమిషన్ పేర్కొంది. 2016–20 మధ్య బరాజ్‌ల నిర్మాణం జరిగితే.. వరంగల్‌లోని క్వాలిటీ కంట్రోల్ విభాగం ఇంజనీర్లు ఒక్కసారి మాత్రమే తనిఖీ చేయడం ఏమిటని ప్రశ్నించింది. దీనితో సంబంధిత ఇంజనీర్లది తప్పేనని, పక్షం రోజులకోసారి పనుల్లో నాణ్యత పరీక్షించాల్సి ఉంటుందని మురళీధర్ బదులిచ్చారు. బరాజ్‌ల వైఫల్యానికి ఇది ప్రధాన కారణంగా పరిగణించాల్సి ఉంటుందని కమిషన్ తెలపగా.. ఒక కారణం కావచ్చని మురళీధర్ అన్నారు. » బరాజ్‌ల కాంక్రీట్ పనులకు నాణ్యత పరీక్షలు నిర్వహించకుండానే రూ.1,342.72 కోట్ల బిల్లులను ఏ విధంగా చెల్లించారు? బిల్లుల రికార్డుల్లో పాత తేదీలతో ఎంట్రీ ఎందుకు చేశారని కమిషన్ ప్రశ్నించగా.. సంబంధిత ఇంజనీర్లది తప్పేనని సమాధానమిచ్చారు. »డిజైన్ల ప్రకారం బరాజ్‌ల పునాదుల కింద షీట్‌పైల్స్ నిర్మించాల్సి ఉండగా.. సెకెంట్ పైల్స్‌కు ఎందుకు మారారు? నిర్మాణం ప్రారంభించాక డిజైన్లను మార్చవచ్చా? అని కమిషన్ ప్రశ్నించగా.. భూగర్భంలో ఇసుకతోపాటు భారీ రాళ్లు ఉండటంతో మార్చాల్సి వచ్చి0దని మురళీధర్ వివరించారు. నిర్మాణ దశలో డిజైన్లలో మార్పులు జరగడం సాధారణమేనని బదులిచ్చారు. » బరాజ్‌ల నిర్మాణం పూర్తయ్యాక లోపాలు బయటపడితే ఏం చర్యలు తీసుకున్నారని కమిషన్ ప్రశ్నించగా.. సరిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు మురళీధర్ వివరించారు. » కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చడం కోసం భవి ష్యత్తులో అంచనా వ్యయం పెంచుకోవడానికి వీలు కల్పిం చే రీతిలో డిజైన్లను రూ పొందించారా? అని కమిషన్ ప్రశ్నించగా.. లేదని మురళీధర్ బదులిచ్చారు. కాళేశ్వ రం డీపీఆర్‌ను సీడబ్ల్యూసీకి పంపకముందే పనులు ఎందుకు ప్రారంభించారని ప్రశ్నించగా.. ప్యాకేజీ–4 పనులు ప్రారంభించినట్టు మురళీధర్ అంగీకరించారు. -
బరాజ్‌లపై విచారణ స్పీడప్!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంపై న్యాయ విచారణ ప్రక్రియను జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ వేగిరం చేసింది. బరాజ్‌ల నిర్మాణానికి సంబంధించిన నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించిన నీటి పారుదల శాఖ మాజీ ఈఎన్సీ (జనరల్) సి.మురళీధర్, రామగుండం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, బరాజ్‌ల డిజైన్లను రూపొందించిన సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ) మాజీ చీఫ్ ఇంజనీర్/రిటైర్డ్ ఈఎన్సీ నరేందర్‌రెడ్డి, చీఫ్ ఇంజనీర్ చంద్రశేఖర్, ఎస్ఈ బస్వరాజ్.. అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా వాటి నిర్మాణాన్ని పర్యవేక్షించిన యాదగిరి, ఓంకార్ సింగ్‌లను సోమవారం జస్టిస్ చంద్రఘోష్ బీఆర్కేఆర్ భవన్‌లోని తన కార్యాలయానికి పిలిపించి విడివిడిగా విచారించారు. బరాజ్‌ల నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక అంశాలపై ప్రశ్నించారు. ‘బరాజ్‌ల నిర్మాణ స్థలాలను ఎవరు నిర్ణయించారు? స్థలాల ఎంపికకు ముందు భూ¿ౌతిక పరీక్షలు నిర్వహించారా? బరాజ్‌లకు డిజైన్లు, డ్రాయింగ్స్ ఎవరు రూపొందించారు? తర్వాత డిజైన్లలో ఏమైనా మార్పులు చేశారా? నిర్మాణ సమయంలో నాణ్యత పర్యవేక్షణ చేశారా? ఆ బాధ్యతను ఎవరు చూశారు? నిర్మాణం పూర్తయిన తర్వాత నిర్వహణ, పర్యవేక్షణ ఎవరు చూశారు? బరాజ్‌ల వైఫల్యానికి కారణాలేమిటి? డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ పూర్తికాక ముందే నిర్మాణ సంస్థలకు వర్క్ కంప్లీషన్ సరి్టఫికెట్లు ఎందుకు జారీ చేశారు?’ వంటి అంశాలపై ఆయన వివరణ కోరినట్టు తెలిసింది. నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, జాయింట్ సెక్రెటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ (జనరల్) అనిల్‌కుమార్, డిప్యూటీ ఈఎన్సీ కె.శ్రీనివాస్ తదితరులు విచారణకు హాజరై కమిషన్‌కు సహకరించారు. నేడు 18 మంది ఇంజనీర్ల విచారణ.. నీటిపారుదల శాఖలోని సీడీఓ, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, క్వాలిటీ కంట్రోల్, కన్స్ట్రక్షన్ విభాగాల్లో గతంలో పనిచేసిన/ప్రస్తుతం పనిచేస్తున్న మొత్తం 18 మంది ఇంజనీర్లను మంగళవారం జస్టిస్ పినాకి చంద్రఘోష్ విచారించనున్నారు. ఈఎన్సీ (ఓ అండ్ ఎం) బి.నాగేంద్రరావు, సీడీఓ చీఫ్ ఇంజనీర్ మోహన్‌కుమార్, మేడిగడ్డ బరాజ్ నిర్మాణాన్ని పర్యవేక్షించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతితోపాటు ఇతర కీలక ఇంజనీర్లు ఈ విచారణకు హాజరుకావాలంటూ కమిషన్ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఇక బుధవారం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణ సంస్థలైన ఎల్అండ్టీ, అఫ్కాన్స్, నవయుగ కంపెనీల ప్రతినిధులను కమిషన్ విచారించనుంది. త్వరలోఅసలు విషయాలు బయటికి..: జస్టిస్ చంద్రఘోష్ కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణం విషయంలో అసలు విషయాలు రానున్న రోజుల్లో బయటికి వస్తాయని జస్టిస్ పినాకి చంద్రఘోష్ తెలిపారు. సోమవారం బీఆర్కేఆర్ భవన్‌లోని తన కార్యాలయంలో తనను కలిసిన మీడియాతో ఆయన క్లుప్తంగా మాట్లాడారు. బరాజ్‌ల నిర్మాణంపై ఇప్పటివరకు కమిషన్‌కు 54 ఫిర్యాదులొచ్చాయని, వాటిని పరిశీలిస్తున్నామని చెప్పారు. విచారణ కమిషన్‌కు సమాచారం ఇవ్వడానికి వచ్చే ప్రతి ఒక్కరికి తనను కలిసే అవకాశం ఇస్తానని, వారి వాదన వింటానని తెలిపారు. ప్రస్తుతం సాంకేతిక లోపాలపై విచారణ సాగుతోందని.. తర్వాత ఆర్థిక, ఇతర అవకతవకలపై విచారణ ప్రారంభిస్తామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువు మేరకు జూన్ 30లోగా విచారణ పూర్తికాదని.. గడువు పొడిగింపుపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. సమగ్రంగా అన్ని విషయాలు, వాస్తవాలు తెలుసుకోకుండా నివేదిక ఇవ్వడం సాధ్యం కాదన్నారు. తమకు నష్టపరిహారం చెల్లించలేదంటూ కొందరు భూనిర్వాసితులు తమకు ఫిర్యాదు చేశారని తెలిపారు. బరాజ్‌లకు సంబంధించిన అన్ని ఫైళ్లను ప్రభుత్వం సమరి్పంచిందని, వాటిని పరిశీలిస్తున్నామని వెల్లడించారు. బరాజ్‌లపై విజిలెన్స్ జరిపిన విచారణ నివేదికను తమకు అందజేయాలని ఆ విభాగానికి లేఖ రాశామన్నారు. -
ఈఎన్సీలపై వేటు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సమర్పించిన ప్రాథమిక నివేదిక ఆధారంగా ఇద్దరు కీలక అధికారులపై వేటు వేసింది. నీటి పారుదల శాఖ ఇంజనీరింగ్ విభాగానికి అధిపతిగా ఉన్న ఈఎన్సీ (జనరల్) సి.మురళీధర్‌ను రాజీనామా చేయాలని ఆదేశించింది. మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి బాధ్యుడిగా గుర్తిస్తూ రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లును సర్వీస్ నుంచి తొలగించింది. నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు.. ఆ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. రిటైరైనా కొనసాగుతూ.. 2011 ఆగస్టు 1 నుంచి నీటి పారుదల శాఖ ఈఎన్సీగా పనిచేస్తున్న సి.మురళీధర్ వాస్తవానికి 2013లోనే పదవీ విరమణ చేయాల్సి ఉంది. కానీ నాటి ఉమ్మడి రాష్ట్ర సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆయన పదవీకాలాన్ని పొడిగించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక బీఆర్ఎస్ సర్కారు మురళీధర్‌రావును కొనసాగించింది. తదుపరి ఆదేశాలు జారీచేసే వరకు కూడా ఆయన ఈఎన్సీ పదవిలో కొనసాగుతారంటూ ఆదేశాలు ఇచ్చింది. ఇక రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు నాలుగేళ్ల కిందే రిటైరైనా అప్పటి బీఆర్ఎస్ సర్కారు తిరిగి అదే పోస్టులో నియమించింది. ఆయన పదవీకాలం వచ్చే నెలాఖరున ముగియాల్సి ఉంది. కానీ కాంగ్రెస్ సర్కారు ఆయనను ముందే తొలగించింది. తొలగించిన ఇద్దరు ఈఎన్సీల స్థానంలో.. ఇన్చార్జి అధికారులకు బాధ్యతలు అప్పగించాలని నీటిపారుదల శాఖ ఈఎన్సీ (అడ్మిన్) అనిల్‌కుమార్‌ను ఆదేశించింది. ‘వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్’తో గందరగోళం! గత ఏడాది అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీలో 7వ బ్లాకు కుంగిపోయింది. సొంత ఖర్చుతో దాని పునరుద్ధరణ పనులు చేపడతామని నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ అప్పట్లో ప్రకటించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించి.. డిజైన్, నిర్మాణం, నాణ్యత, పర్యవేక్షణ, నిర్వహణ లోపాలతోనే కుంగిందని నివేదిక సమర్పించింది. ఒప్పందం ప్రకారం బ్యారేజీ పనులన్నీ పూర్తికాలేదని, అంటే డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ పూర్తికాలేదని నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ పలుమార్లు పేర్కొన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే ఎల్అండ్టీ సంస్థ మాటమార్చింది. బ్యారేజీ పునరుద్ధరణ బాధ్యత తమది కాదని అంటోంది. 2020 జూన్ 29 నాటికి బ్యారేజీ నిర్మాణం పూర్తయిందని.. ఒప్పందం ప్రకారం పనిపూర్తయినట్టు (వర్క్ కంప్లీషన్) ధ్రువీకరిస్తూ 2021 మార్చి 25న ప్రాజెక్టు సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్ఈ) లేఖ సైతం ఇచ్చారని ఎల్అండ్టీ వాదిస్తోంది. నీటిపారుదల శాఖ అందించిన డిజైన్ల ప్రకారమే బ్యారేజీని నిర్మించామని పేర్కొంటోంది. దీంతో బ్యారేజీ పునరుద్ధరణ బాధ్యత ఎవరిదన్న దానిపై గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో కాంగ్రెస్ సర్కారు మేడిగడ్డ కుంగుబాటుపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. అంతేగాకుండా బ్యారేజీ వద్దకు మీడియా బృందాన్ని తీసుకెళ్లి చూపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పించారు. రూ.1.27 లక్షల కోట్ల వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారని.. కానీ ఇప్పటివరకు కేవలం 98,570 ఎకరాల ఆయకట్టు మాత్రమే అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. -
మేడిగడ్డ బ్యారేజీ.. వాటిని కూల్చాల్సిందే
సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి వరంగల్: కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీలో కుంగిపోయిన 7వ నంబర్ బ్లాక్‌లోని 18, 19, 20వ నంబర్ పియర్లు, వీటికి సంబంధించిన 3 రేడియల్ గేట్లు, 3 స్లాబులను పూర్తిగా కూల్చి వేయాల్సిందేనని నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ స్పష్టం చేశారు. కూల్చివేతకు డైమండ్ వైర్ కటింగ్, డ్రిల్ అండ్ బ్లాస్ట్, డ్రిల్ అండ్ వన్ టైం బ్లాస్ట్ అనే 3 ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు. బ్యారేజీ మిగతా స్ట్రక్చర్‌కు నష్టం జరగకుండా దెబ్బతిన్న బ్లాక్‌లోని వించ్, వాక్ వే –1, యాక్సెస్ లా డర్, గంట్రీ ట్రాక్ గ్రైడర్, గాంట్రీ బీమ్వంటి భాగాలను అ త్యంత జాగ్రత్తగా తొలగించాల్సి ఉంటుందన్నారు. నీటిపారుదల శాఖమంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలో శుక్రవారం కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనకు వచ్చిన మంత్రుల బృందానికి, మేడిగడ్డ బ్యారేజీ వద్ద పైన పేర్కొన్న అంశాలపై మురళీధర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రెండు నెలల్లోగా బుంగల పూడ్చివేత కొత్త బ్లాక్ కట్టడం కంటే కూల్చి వేతకు అధిక సమయం పడుతుందని ఈఎన్సీ చెప్పారు. డైమండ్ వైర్ కటింగ్ టెక్నాలజీతో కూల్చివేత పనులు చేపట్టాలని భావిస్తున్నా, ఇందుకు చాలా సమయం పడుతుందన్నారు. డ్రిల్ అండ్ బ్లాస్ట్ పద్ధతిని వినియోగిస్తే పక్కనే ఉన్న ఇతర బ్లాకులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలకు ఏర్పడిన బుంగలను రెండు నెలల్లోగా గ్రౌటింగ్ ద్వారా పూడ్చి వేస్తామని, నిర్మాణ సంస్థలే వ్యయాన్ని భరిస్తాయని ఈఎన్సీ చెప్పారు. బ్యారేజీకి త్వరలో పరీక్షలు మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనకు కారణాలను తెలుసుకోవడానికి త్వరలో గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ సర్వే, ఎలక్ట్రికల్ రెసెస్టివిటీ పరీక్షలను నిర్వహించనున్నట్లు మురళీధర్ తెలిపారు. బ్యారేజీ పునాదుల కింద జరిగిన మార్పులను, ఏర్పడిన లోపాలను తెలుసుకోవడానికి ఈ పరీక్షలతో వీలుంటుందన్నారు. ఏడవ బ్లాక్‌లోని పియర్ల పునరుద్ధరణ కోసం నిర్మిస్తున్న కాఫర్ డ్యామ్ పనులు వారం రోజుల్లో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఈఎన్సీ చెప్పిన మరికొన్ని ముఖ్యాంశాలు.. ♦ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ.1.28 లక్షల కోట్లు ♦ ఇప్పటివరకు చేసిన ఖర్చు రూ.93,800 కోట్లు ♦ 2 టీఎంసీల నీటి ఎత్తిపోతలకు ఐదు వేల మెగావాట్ల కరెంటు ♦ మూడో టీఎంసీ పనులు చేస్తే 8,450 మెగావాట్ల కరెంటు ♦ ఐదేళ్లలో కాళేశ్వరం నుంచి లిఫ్ట్ చేసింది 173 టీఎంసీలు ♦ ప్రాజెక్టు కింద సాగైంది 98,570 ఎకరాలు (నిర్మాణం పూర్తయ్యాక ఇచ్చిన నీరు స్థిరీకరణకు మాత్రమే) ♦ మూడో టీఎంసీ కోసం రూ.33,400 కోట్లతో ప్రతిపాదన ♦ ఏడాదిన్నరగా రూ.3 వేల కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి ♦ పాలమూరు ప్రాజెక్టుకు కాళేశ్వరం పేరుతో అప్పులు డైమండ్ వైర్ కటింగ్ అంటే.. మేడిగడ్డ ఏడవ బ్లాక్‌లోని మూడు పియర్లు, స్లాబులు తొలగించేందుకు డైమండ్ వైర్ కటింగ్ విధానాన్ని అవలంభించాలని ఇంజనీర్లు నిర్ణయించినట్లు తెలుస్తోంది. పక్కనున్న పియర్లు, పైనున్న ఇతర స్లాబులకు ఎలాంటి నష్టం జరగకుండా తొలగించేందుకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నట్టు సమాచారం. అయితే ఇది అధిక వ్యయంతో కూడిన, ఎక్కువ సమయం పట్టే విధానమని చెబుతున్నారు. ఈ విధానంలో.. వజ్రాల పొడి పొదిగిన లోహపు వైర్ రంపం వినియోగించి కాంక్రీట్ దిమ్మెలను కట్ చేస్తారు. దీనివల్ల ఎలాంటి ప్రకంపనలకు తావుండదు. ఎలాంటి పేలుడు పదార్థాలు ఉపయోగించరు. కాబట్టి పక్కన, పైన ఉన్న దిమ్మెలకు నష్టం వాటిల్లదు. -
ఏడ్చేసిన బలగం నటుడు!
బలగం సినిమాలో నటించిన అందరు నటీనటులకు మంచి గుర్తింపు వచ్చింది. వారిలో నటుడు మురళీధర్ కూడా ఉన్నాడు. ఈయన స్వస్థలం మెదక్ జిల్లా రామాయంపేట. సిద్దిపేటలో చదువుకున్నాడు. ఎలక్ట్రిసిటీ బోర్డులో 27 ఏళ్లు పని చేసి రిటైర్ అయిన ఈ పెద్దాయన విశ్రాంతి తీసుకునే సమయంలో నటనారంగంలో అడుగుపెట్టాడు. బలగంతో మంచి గుర్తింపు అందుకున్నాడు. ఇటీవలే బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాలోనూ నటించాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'రిటైర్ అయ్యాక నటుడవ్వాలనే కోరికతో సినిమా రంగానికి వచ్చాను. ఈ వయసులో నాకు ఏమైనా సినిమా అవకాశాలు వస్తాయో లేదోనని మొదట సీరియల్స్ వైపు వెళ్లాను. అక్కడ గుర్తింపు వచ్చాక సినిమాల్లో ప్రయత్నించాను. బలగం, భగవంత్ కేసరి.. ఇలా సినిమాలు చేసుకుంటూ పోతున్నాను. భగవంత్ కేసరి మూవీలో మంచి పాత్ర ఇచ్చారు. ఇంత మంచి గుర్తింపు వస్తున్నందుకు సంతోషంగా ఉంది' అని ఆనంద భాష్పాలు రాల్చాడు మురళీధర్ గౌడ్. చదవండి: ఓటీటీలోకి వచ్చేసి భయపెడుతున్న హారర్, సైకో థ్రిల్లర్ మూవీస్.. స్ట్రీమింగ్ అక్కడే! -
ఇసుక పక్కకు జరగడం వల్లే..
సాక్షి, హైదరాబాద్: ఫౌండేషన్ కింద ఇసుక పక్కకు జరగడంతోనే ఖాళీ ఏర్పడి మేడిగడ్డ బ్యారేజీ పియర్ కుంగిందని, పైనుంచి చూడడం ద్వారా ఈ మేరకు ప్రాథమిక అంచనాకు వచ్చామని రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) సి.మురళీధర్ తెలిపారు. బ్యారేజీని పూర్తిగా ఖాళీ చేసిన తర్వాత కిందికి దిగి ఫౌండేషన్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తేనే పూర్తిగా స్పష్టత వస్తుందని అన్నారు. ‘ఎక్కడో చిన్నలోపం జరిగి ఉండొచ్చు. ఇందులో సందేహం లేదు. లేకుంటే ఇలా ఎందుకు జరిగేది? ’అని వ్యాఖ్యానించారు. బ్యారేజీ డిజైన్లు, నాణ్యతలో ఎలాంటి లోపం లేదని స్పష్టం చేశారు. డిజైన్లలో లోపంతోనే బ్యారేజీ కుంగిందని వచ్చిన విమర్శలను కొట్టిపారేశారు. గతేడాది జూలైలో 25 లక్షల క్యూసెక్కుల భారీ వరద వచ్చినా బ్యారేజీ తట్టుకుని నిలబడిందని గుర్తు చేశారు. మేడిగడ్డ బ్యారేజీ పియర్లు కుంగిన ఘటనపై అధ్యయనం కోసం నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ బుధవారం హైదరాబాద్‌లోని జలసౌధలో ఈఎన్సీ మురళీధర్‌తో సమావేశమై విస్తృతంగా చర్చించింది. అనంతరం మురళీధర్ మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజీ పియర్ కుంగడంతో పగుళ్లు వచ్చాయని, ర్యాఫ్ట్కూ నష్టం జరిగిందని చెప్పారు. పూర్తి బాధ్యతతో బ్యారేజీ పునరుద్ధరణ పనులు చేస్తామని నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ హామీ ఇచ్చిందని తెలిపారు. బ్యారేజీలోని నీటి నిల్వలను ఖాళీ చేశామని, ఎగువ నుంచి వచ్చే వరదను దారి మళ్లిస్తామని వివరించారు. నెలాఖరులోగా గోదావరిలో ప్రవాహం తగ్గుతుందని, నవంబర్‌లో పనులు ప్రారంభించి వేసవిలోగా పూర్తి చేస్తామని అన్నారు. నిపుణుల కమిటీతో సమావేశమైనవారిలో నీటిపారుదల శాఖ ఈఎన్సీ (రామగుండం) నల్లా వెంకటేశ్వర్లు, ఈఎన్సీ (ఓఅండ్ఎం) నాగేంద్ర రావు, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే తదితరులున్నారు. -
ఓటమి నుంచే గాంధీ నేర్చుకున్నారు..
సాక్షి, హైదరాబాద్: ‘‘గెలుపు కన్నా ఓటమి నుంచే ఎక్కువగా నేర్చుకుంటాం.. గాంధీజీ సైతం అలాగే ఓటమి నుంచే నేర్చుకున్నారు.. అందుకని ఏ రంగంలోనైనా ఓడిపోతే కుంగిపోకూడదు ’’ అని ఒడిశా హైకోర్ట్ మాజీ చీఫ్ జస్టిస్ ఎస్.మురళీధర్ ఉద్బోధించారు. గాంధీ జయంతి నాడు ప్రముఖుల ప్రసంగాలకు పట్టం కట్టే మంథన్ సంవాద్ వార్షిక చర్చాగోష్టిని నగరంలోని శిల్పకళా వేదికలో సోమవారం నిర్వహించింది. కార్యక్రమంలో మాజీ చీఫ్ జస్టిస్ మురళీధర్ మాట్లాడుతూ రాజకీయా ల్లోకి రాక పూర్వం న్యాయవాదిగా గాంధీజీ ఎదుర్కొన్న వృత్తిపరమైన ఆటుపోట్లు, దక్షిణాఫ్రికా లో రెండు దశాబ్దాల పాటు న్యాయవాద వృత్తిలో పొందిన అనుభవాలను ప్రస్తావించారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ సహనం కోల్పోకుండా, నేర్చుకోవడాన్ని మానకుండా సత్యాన్ని వీడకుండా నిరుపేదలకు అండగా గాంధీజీ న్యాయవాదిగా తన ప్రస్థానాన్ని కొనసాగించారని గుర్తు చేశారు. నవతరం న్యాయవాదులు గాంధీజీ న్యాయవాద ప్రస్థానం నుంచి నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయని పేర్కొన్నారు. ఉపాధికి దోహదం చేయలేని ఆర్ధికాభివృద్ధి: యామినీ అయ్యర్ సిటిజన్ వర్సెస్ లాభార్థి? అంశంపై ఢిల్లీలోని సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ అధ్యక్షుడు యామినీ అయ్యర్ మాట్లాడారు. దేశంలో పేర్కొంటున్న ఆర్థికాభివృద్ధి లాభదాయకమైన ఉపాధి అవకా శాలకు, ఉద్యోగాలకు దోహదం చేయలేకపోతోందని అభిప్రాయపడ్డారు. నిజమైన సంక్షేమానికి ఇంకా సరైన నిర్వచనాన్ని వెదికే క్రమంలోనే ఉన్నామన్నారు. ది క్వశ్చన్ ఆఫ్ అకడమిక్ ఫ్రీడమ్ అనే అంశంపై లండన్‌లోని కింగ్స్ కాలేజ్‌కు చెందిన ప్రొఫెసర్ నీరజా గోపాల్ జయాల్ మాట్లాడుతూ విద్యా సంబంధ స్వేచ్ఛ (అకడమిక్ ఫ్రీడమ్) అనేది మన దేశంలో ఇంకా తగిన స్థాయిలో లేదన్నారు. సదస్సులో ‘‘వై ఇండిపెండెంట్ న్యూస్ మీడియా షుడ్ త్రైవ్’’ అనే అంశంపై ది న్యూస్ మినిట్ ఎడిటర్ ఇన్ ఛీఫ్ ధన్యా రాజేంద్రన్ మాట్లాడుతూ పారిశ్రామికవేత్త అదానీపై వచ్చిన ఆరోపణల విషయంలో మీడియా పూర్తిస్థాయిలో నిష్పక్షపాత్ర పోషించలేకపోయిందన్నారు. ఫైటింగ్ ది ఫేక్ న్యూస్ పాండమిక్ అనే అంశంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాటె మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ఆధ్వర్యంలో ఫేక్ న్యూస్ ప్రచారం సాగుతోందని ఆరోపించారు. విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ డైరెక్టర్ ఆర్ఘ్యాసేన్గుప్తా ‘ది గ్లోబల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా’ అనే అంశంపై మాట్లాడారు. సదస్సులో హిందీ కవి,వ్యంగ్యరచయిత సంపత్ సరళ్ పలు కవితలు,వ్యంగ్యరచనలు వినిపించారు. -
70 సీట్లలో వడపోత పూర్తి!
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కి వస్తోంది. అభ్యర్థుల ఎంపికపై కొన్నిరోజులుగా కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ.. భిన్నాభిప్రాయాలు, విభిన్న వాదనల మధ్య 70 నియోజకవర్గాలకు సంబంధించి వడపోతను పూర్తి చేసినట్టు తెలిసింది. ఇందులో నలభైకి పైగా సీట్లకు ఒక్కో అభ్యర్థి పేరును, మరో 30 సీట్లకు ఇద్దరి పేర్ల చొప్పున ఫైనల్ చేసినట్టు సమాచారం. ఇద్దరేసి పేర్లను ఎంపిక చేసిన నియోజకవర్గాలకు సంబంధించిన సర్వేల ఆధారంగా అభ్యర్థిని ఖరారు చేసే అధికారాన్ని పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి అప్పగించినట్టు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. మిగతా స్థానాల్లోనూ సర్వేల ప్రకారం పరిశీలన జరిపి షార్ట్ లి‹స్ట్ చేయడం కొలిక్కి వచ్చిందని అంటున్నాయి. నిర్ణయాధికారం కేంద్ర కమిటీకే.. అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ అధ్యక్షతన ఢిల్లీలో వరుసగా రెండోరోజూ నేతల భేటీ జరిగింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మధుయాష్కీగౌడ్, ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలుతోపాటు ఇతర సభ్యులు ఇందులో పాల్గొన్నారు. గురువారం భేటీలో 35 వరకు స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసిన కమిటీ... శుక్రవారం ఐదు గంటల పాటు చర్చించి మరో 5 స్థానాల్లో అభ్యర్థులను ఫైనల్ చేయడంతోపాటు, ఇంకో 30 సీట్లకు వడపోత పూర్తి చేసింది. రాజకీయ, కుల సమీకరణాలు, ప్రజాక్షేత్రంలో బలాబలాలు, సర్వే నివేదికల ఆధారంగా ఈ 30 స్థానాల్లో ఇద్దరేసి నేతలను ఎంపిక చేసినట్టు తెలిసింది. ఈ లిస్టులో ఎల్బీనగర్, చేవెళ్ల, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, ఉప్పల్, మేడ్చల్, శేరిలింగంపల్లి, బోథ్, ఖానాపూర్, కరీంనగర్, డోర్నకల్, మహబూబాబాద్, పరకాల, జనగాం, వర్ధన్నపేట, వనపర్తి, నారాయణపేట, నకిరేకల్, తుంగతుర్తి, నర్సాపూర్, దుబ్బాక, నారాయణఖేడ్, జుక్కల్, ఎల్లారెడ్డి, బాన్సువాడ, మునుగోడు, సికింద్రాబాద్, హుస్నాబాద్ తదితర నియోజకవర్గాలు ఉన్నట్టు తెలిసింది. వీటికి ఎంపిక చేసిన ఇద్దరు అభ్యర్థుల్లో ఒకరిని ఫైనల్ చేసే అధికారాన్ని కేంద్ర ఎన్నికల కమిటీకి అప్పగించాలని భేటీలో నిర్ణయించినట్టు సమాచారం. సునీల్ కనుగోలు బృందం చేసిన సర్వేలతోపాటు ఏఐసీసీ తరఫున చేయించిన ఇతర సర్వేల ఆధారంగా అభ్యర్థిని ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. మిగతా 50 స్థానాల్లో అభ్యర్థుల ఖరారు కోసం కమిటీ మరోమారు భేటీ కానుందని అంటున్నాయి. రేవంత్‌ను కలసిన రేఖానాయక్, వేముల వీరేశం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నేపథ్యంలో ఢిల్లీలోనే తిష్టవేసిన ఆశావహులు ఏఐసీసీ, పీసీసీ నేతల ఇళ్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్ శుక్రవారం ఉదయం రేవంత్‌తో భేటీ అయ్యారు. బీఆర్ఎస్కు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా రేవంత్‌ను కలిశారు. మరోవైపు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం ఢిల్లీకి వచ్చారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా ఢిల్లీలోనే ఉండటంతో షర్మిల పర్యటనపై ఆసక్తి నెలకొంది. అభ్యర్థుల ఎంపికపై నేతల మధ్య విభేదాలు ఢిల్లీ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు వాడీవేడిగా సాగినట్టు తెలిసింది. 40 స్థానాలు మినహా.. మిగతా సీట్లకు అభ్యర్థుల ఎంపికపై నేతల మధ్య తీవ్రస్థాయిలో భేదాభిప్రాయాలు వ్యక్తమైనట్టు సమాచారం. కొన్ని స్థానాలపై చర్చ సమయంలో తీవ్ర స్థాయిలో వాదనలు చేసుకున్నట్టు తెలిసింది. ‘అసలు కాంగ్రెస్, వలస నేతలు’ అన్న ప్రాతిపదికన ఈ వాగ్వాదం జరిగిందని.. ఎన్నారైలు, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల పేర్లను సీఈసీకి పంపే విషయంలో నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్టు సమాచారం. మెజార్టీ సభ్యులు ఒక్క పేరే సూచించిన పలు నియోజకవర్గాల్లోనూ అభ్యర్థి ఎంపిక ఫైనల్ కాలేదని.. అలాంటి స్థానాలను ప్రస్తుతానికి పక్కనపెట్టాలని కొందరు నేతలు పట్టు బట్టినట్టు తెలిసింది. ఈ విషయంపై టీపీసీసీ ముఖ్య నేత ఒకరు మాట్లాడుతూ.. ‘‘ఈ సమావేశంలో ఏం జరిగిందని తెలుసు కున్న తర్వాత చాలా స్థానాలౖపై ఏకాభిప్రాయం కుదిరే పరిస్థితే కనిపించడం లేదు. హైకమాండ్ కచ్చితంగా జోక్యం చేసుకోవాల్సిందే. చివరికి ఎవరి పేర్లు వాళ్లు పంపేలా ఉన్నారు. వచ్చే వారంలో జరిగే సమావేశంలో ఏం జరుగుతుందో చూద్దాం..’’ అని వ్యాఖ్యానించడం గమనార్హం. -
విడివిడిగా.. కూలంకషంగా
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రదేశ్ ఎన్నికల కమిటీ (పీఈసీ) సభ్యులతో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ సమావేశమయ్యారు. గాందీభవన్‌లో సోమవారం ఉదయం 11గంటల నుంచి రాత్రి వరకు ఈ భేటీలు కొనసాగాయి. ప్రతి నాయకుడితో వేర్వేరుగా 10 నిమిషాలకు పైగా మాట్లా డిన మురళీధరన్, రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖరారుతో పాటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై అభిప్రాయ సేకరణ చేశారు. నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, ఎమ్మె ల్సీ జీవన్‌రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, కోచైర్మన్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, సీతక్క, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నేను, మీ నాన్న ఫ్రెండ్స్: పొన్నాల మురళీధరన్‌ను కలిసిన సందర్భంగా ఆయన తండ్రి, కేరళ మాజీ సీఎం కరుణాకరన్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని పొన్నాల గుర్తు చేసుకున్నారు. తాను మత్స్యశాఖ మంత్రిగా ఉన్న సమయంలో కేరళతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచ బ్యాంకు రుణం తీసుకువచ్చామని, ఆ తర్వాతే రెండు రాష్ట్రాల్లో రొయ్యల పరిశ్రమ అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. పార్టీలో పరిస్థితులు, టికెట్ల ఖరారులో పాటించాల్సిన సామాజిక సమతుల్యత గురించి వారు చర్చించినట్టు సమాచారం. బీసీలకు టికెట్ల కేటాయింపులో ఇవ్వాల్సిన ప్రాధాన్యతపై వీహెచ్ చర్చించినట్టు తెలుస్తోంది. స్క్రీనింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్న సిద్దిఖీ కూడా సోమవారం మధ్యాహ్నం నుంచి ఈ భేటీల్లో పాల్గొనగా, మరో సభ్యుడు, గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ కోర్టు కేసుల కారణంగా రాలేకపోయారని, మంగళవారం వస్తారని గాం«దీభవన్ వర్గాలు తెలిపాయి. మంగళవారం ఉదయం డీసీసీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో స్క్రీనింగ్ కమిటీ భేటీ కానుంది. జగ్గారెడ్డి లేఖ: పీసీసీ మాజీ అధ్యక్షులకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కలి్పంచాలని, పార్టీ అనుబంధ సంఘాలకు టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యతనివ్వాలని మురళీధరన్‌ను జగ్గారెడ్డి కోరారు. టికెట్ల కేటాయింపు విషయంలోనూ పీసీసీ మాజీ అధ్యక్షుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ లేఖ ఇచ్చారు. నేడు పీసీసీ విస్తృతస్థాయి సమావేశం ఈనెల 16, 17 తేదీల్లో జరగనున్న సీడబ్ల్యూసీ సమావేశాల నిర్వహణపై చర్చించేందుకు మంగళవారం టీïపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి పీసీసీ సభ్యులందరూ విధిగా హాజరు కావాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నమ్మకం నిలబెట్టుకుంటాం: రేవంత్ ట్వీట్ సీడబ్ల్యూసీ తొలి సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించేందుకు అంగీకరించిన పార్టీ అధిష్టానానికి రేవంత్ ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, సమావేశాలను విజయవంతం చేస్తామంటూ సోమవారం ఆయన ట్వీట్ చేశారు. బీసీలు ఎందుకు గెలవడం లేదు? రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో పాటించాల్సిన సామాజిక సమతుల్యతపై ఈ భేటీల్లో ఆసక్తికర చర్చ జరిగినట్టు తెలిసింది. 1989 తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడుసార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా తెలంగాణలోని మొత్తం అసెంబ్లీ సీట్లలో 50 శాతం సీట్లు ఎప్పుడూ రాలేదని, ఇందుకు కాంగ్రెస్ పార్టీని వెనుకబడిన వర్గాలు అక్కున చేర్చుకోకపోవడమే కారణమని కొందరు వివరించారు. తొలుత తెలుగుదేశం, ఆ తర్వాత బీఆర్ఎస్ వైపు బీసీలు మొగ్గుచూపుతున్నారని, అత్యధిక సంఖ్యలో ఉండే బీసీల హృదయాల్లో చోటు సాధించని కారణంగానే కాంగ్రెస్ పార్టీకి ఓటమి ఎదురవుతోందని చెప్పారు. దీంతో ‘బీసీలకు సీట్లు ఇస్తే ఎందుకు గెలవడం లేదు?’అని మురళీధరన్ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. కాగా ఓ ముఖ్య నాయకుడు బదులిస్తూ.. కాంగ్రెస్ పార్టీలోనే అలా జరుగుతోందని, మిగిలిన పార్టీల నుంచి బీసీ నేతలు గెలుస్తున్నారని, ఇందుకు కారణం ఏంటనేది సమీక్షించుకోవాల్సింది పార్టీయేనని చెప్పినట్టు సమాచారం. ఇక రెడ్డి సామాజిక వర్గంలోని గ్రూపు గొడవలు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణమవుతున్నాయని ఓ నేత వివరించినట్టు సమాచారం. కర్ణాటకలోని లింగాయత్‌లు, గౌడ సామాజిక వర్గ నేతలు ఐక్యంగా ఉండి అక్కడ అధికారాన్ని దక్కించుకోవడాన్ని గుర్తు చేసినట్లు తెలిసింది. అన్ని విషయాలను విన్న మురళీధరన్ ‘ఏం జరుగుతుందో వేచి చూద్దాం.’అంటూ బదులివ్వడం గమనార్హం. -
ఏపీ బీజేపీలో బిగ్ ట్విస్ట్.. ఇన్‌ఛార్జ్‌గా తెలంగాణ కీలక నేత?
బీజేపీ ఏపీ ఇన్చార్జ్ తనను బాధ్యతలనుంచి తొలగించమని కోరుతున్నారా?. ఐదేళ్ళుగా ఇన్చార్జ్ పదవిలో కొనసాగుతున్న ఆ కేంద్ర మంత్రి ఏపీకి రావడం తగ్గించేశారు ఎందుకని?. ఆయన పనితీరు మెచ్చి కేంద్రం ఇచ్చిన అదనపు బాధ్యతను బరువుగా ఎందుకు భావిస్తున్నారు?. ప్రస్తుత ఇన్చార్జ్ని తప్పిస్తే.. కొత్త ఇన్చార్జ్గా ఎవరు రాబోతున్నారు?.. కేరళకు చెందిన కేంద్ర మంత్రి మురళీధరన్ 2018 నుంచి ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా ఉంటూనే ఇన్‌ఛార్జ్‌గా చురుగ్గానే వ్యవహరించేవారు. అప్పట్లో కన్నా లక్ష్మీనారాయణ, ఆ తర్వాత సోము వీర్రాజు రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా ఉన్నపుడు వారితో కలిసి పనిచేశారు. ఇపుడు పురంధేశ్వరి అధ్యక్షురాలిగా ఉన్నారు. ఏపీ ఇన్‌ఛార్జ్‌గా రెండేళ్లపాటు చురుగ్గానే వ్యవహరించిన కేంద్ర మంత్రి మురళీధరన్ ఆ తర్వాత ఏపీ రావడం తగ్గిస్తూ వచ్చారు. మొదట్లో నెలకొకసారి వచ్చిన మురళీధరన్ ఇపుడు మూడు నెలలకొకసారి కూడా ఏపీకి రావడంలేదు. కాగా ఏడాదిన్నరగా ఏపీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించమని పార్టీ హైకమాండ్‌ను మురళీధరన్ కోరుతున్నారట. ఏపీ బీజేపీలో వెన్నుపోటు రాజకీయాలు భరించలేకే ఆయన ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించమని కోరుతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. చంద్రబాబే కారణమా?.. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయాక.. తమ అవసరాల కోసం చంద్రబాబు సూచనల మేరకు బీజేపీలో చేరిన టీడీపీ కోవర్డు గ్యాంగ్ వల్లే మురళీధరన్ ఏపీకి రావడం తగ్గించేశారని టాక్ నడుస్తోంది. ఏపీ బీజేపీలో ఏం జరుగుతోందో మురళీధరన్ కంటే పచ్చ బ్యాచ్‌కే ముందుగా తెలుస్తోందట. అటు కేంద్రంలోని పెద్దలతో సన్నిహితంగా ఉంటూ, ఇటు ఎల్లో మీడియాకి లీకులిస్తూ ఎప్పటికపుడు తమ పాత బాసుకి అన్ని విషయాలు చేరవేస్తుండటం మురళీధరన్‌కి చాలా ఇబ్బందిగా మారిందట. దీనిపై ఢిల్లీలోని పెద్దలతో మాట్లాడిన మురళీధరన్ ఏపీ పార్టీలోని వెన్నుపోటు రాజకీయాలని కంట్రోల్ చేయాలని సూచించారట. అదే సమయంలో తనను ఏపీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించాలని కూడా అధిష్టానాన్ని కోరారట. అయితే, బీజేపీ కేంద్ర నాయకత్వం ఇవేమీ పట్టించుకోకపోవడం.. రాష్ట్ర పార్టీలో పచ్చ బ్యాచ్ హవా పెరుగుతుండటంతో ఇక మురళీధరన్ రాష్ట్రానికి రావడమే తగ్గించేశారని తెలుస్తోంది. తెర మీదకు బండి సంజయ్.. ఎన్నికలకు ఇంకా నెలల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో పలు రాష్ట్రాల్లో ఇన్ఛార్జ్లను సహ ఇన్‌ఛార్జ్‌లని కూడా మార్చడానికి బీజేపీ అధిష్టానం కసరత్తులు చేస్తోంది. ఏపీలో పార్టీ అధ్యక్షుడిని ఎలాగూ మార్చారు గనుక ఎన్నికల ముందు కొత్త టీంకి అవకాశమిచ్చి తనని తప్పించాలని మురళీధరన్ కోరుతున్నారట. అదే సమయంలో ఎల్లో బ్యాచ్ ఆట కట్టించడానికి.. లీకు వీరుల పని పట్టడానికి... కొత్త టీంని పరుగులు పెట్టించడానికి ఏపీ ఇన్‌ఛార్జ్‌గా తెలంగాణ రాష్ట్రానికి చెందిన బండి సంజయ్ పేరు పరిశీలనలో ఉందంటున్నారు. ఇటీవలే జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి కూడా దక్కించుకున్న బండి సంజయ్ ఏపీ ఇన్ఛార్జ్ రేసులో ఉన్నారంటున్నారు. అయితే, తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు బీజేపీకి ప్రతిష్టాత్మకం కావడంతో బండి సంజయ్‌ని తెలంగాణ ఎన్నికలు ముగిసే వరకు అక్కడ నుంచి కదపక పోవచ్చునని మరో టాక్. మరి ఏపీ బాధ్యతల నుంచి తప్పుకోవాలనుకుంటున్న మురళీధరన్ ఆశలు నెరవేరుతాయా?.. బీజేపీ అధిష్టానం ఒప్పుకుంటుందా? కొత్త ఇన్చార్జ్ని నియమిస్తుందా లేదా అన్నది చూడాలి. ఇది కూడా చదవండి: ఏపీలో నీకు కనీసం ఇల్లు కూడా లేదు.. కోర్టు కంటే గొప్పోడివా?: రోజా ఫైర్ -
కాళేశ్వరం కింద 97,170 ఎకరాలకు సాగునీరు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత వానాకాలంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కింద 97,170 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి సాగునీటి విడుదల ప్రణాళిక కమిటీ సమావేశమై వానాకాలంలో వివిధ ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీటి విడుదలపై నిర్ణయం తీసుకుంది. గోదావరి పరీవాహక ప్రాంతంలోని జలాశయాలన్నీ నిండి ఉన్న నేపథ్యంలో వాటి కింద పూర్తి స్థాయి ఆయకట్టుకు సాగునీరు అందించాలని నిర్ణయించింది. కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులు ఇంకా నిండకపోవడంతో ఎగువ నుంచి వస్తున్న వరదలను పరిగణనలోకి తీసుకుని ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయనున్నారు. రాష్ట్రంలోని భారీ ప్రాజెక్టుల కింద 36.81లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించనున్నారు. రాష్ట్రంలో 13,16,557 ఎకరాల ఆరుతడి, 23,64,530 ఎకరాల వరి పంటకు కలిపి మొత్తం 342.43 టీఎంసీలు సరఫరా చేయనున్నారు. కాళేశ్వరం కింద 71600 ఎకరాల వరి, 25570 ఎకరాల ఆరుతడి పంటలు కలిపి మొత్తం 97,170 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని కమిటీ ప్రతిపాదించింది. -
చిరిగిన బట్టలు వేసుకునేవాడిని, ఎన్నో అవమానాలు: బలగం నటుడు
బంధాల్ని నిలుపుకోవడం, వాటిని కలకాలం కాపాడుకోవడమే బలం అని నిరూపించాడు దర్శకుడు వేణు. బలగం సినిమాతో కుటుంబ బాంధవ్యాలను కళ్లకు కట్టినట్లు చక్కగా చూపించాడు. ఈ సినిమాలో నారాయణ పాత్రలో మెప్పించాడు మురళీధర్ గౌడ్. తాజాగా ఆయన తన జీవితంలో ఎదురుచూసిన చేదు సంఘటనలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. 'మెదక్ జిల్లా రామాయంపేట నా స్వస్థలం. సిద్దిపేటలో చదువుకున్నాను. ఎలక్ట్రిసిటీ బోర్డులో 27 ఏళ్లు పనిచేసి రిటైరయ్యాను. మేము నలుగురం అన్నదమ్ములం, ఒక చెల్లె. నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో మా ఇంట్లో పది రూపాయలు ఉండేవి కాదు. మా కోసం అమ్మానాన్న పడ్డ కష్టాలు కళ్లారా చూశాను. ఓసారి పది రూపాయలు అవసరమయ్యాయి. అమ్మ ఎవరినీ అడగలేక మా బంధువుల్లో కొంత ధనవంతుల ఇంటికి నన్ను రూ.10 అప్పు తీసుకురమ్మని పంపించింది. నాకేమో వాళ్లు ఇస్తారో, ఇవ్వరోనని భయపడుతూనే వెళ్లి అడిగేవాడిని. మా నాన్న మాకు దూరంలో పని చేసేవాడు. ఆయన ఇంటికి వచ్చినప్పుడు ఆ పది రూపాయలు వాళ్లకు తిరిగి ఇచ్చేవాడిని. చిరిగిపోయిన బట్టలు వేసుకునేవాడిని. ఎగతాళి చేసేవారు. దారుణంగా అవమానించేవారు. నేను ఉద్యోగం చేసేటప్పుడు కూడా మా పరిస్థితి అంతంతమాత్రమే! నేను రిటైర్మెంట్ తీసుకున్నప్పుడు నా బ్యాంకు బ్యాలెన్స్ జీరో' అంటూ కంటతడి పెట్టుకున్నాడు. -
మంచి సినిమా చేశాం : దిల్ రాజు
ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన తారాగణంగా నటించిన చిత్రం ‘బలగం’. వేణు ఎల్దండి దర్శకత్వం వహించారు. ‘దిల్’ రాజు ప్రొడక్షన్స్ , శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించిన ఈ చిత్రం మార్చి 3న రిలీజ్ కానుంది. ఈ మూవీలోని ‘బలరామ నర్సయ్యో..’ అనే పాటను తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ రిలీజ్ చేసి, మాట్లాడుతూ–‘‘చావు అనే అశుభ అంశాన్ని తీసుకుని శుభాలవైపు తీసుకువెళ్లే గొప్ప ప్రయోగమే ‘బలగం’’ అన్నారు. ‘‘బలగం’ చాలా మంచి సినిమా’’ అన్నారు ‘దిల్’ రాజు.‘‘మరిన్ని ప్రయోగాత్మక సినిమాలు రావాలంటే ఈ సినిమాను థియేటర్స్‌లో చూడండి’’ అన్నారు ప్రియదర్శి. -
యావజ్జీవ శిక్ష అంటే జీవిత శేషభాగం
గుజరాత్‌లోని గోద్రా పేరు వినగానే మనకు స్ఫురణకు వచ్చేది సబర్మతి రైలు దుర్ఘటన, రెండోది రాష్ట్రమంతటా చెలరేగిన హింస. తద్వారా బిల్కిస్ బానో అనే మహిళపై సామూహిక మానభంగం, హత్యలు! ఈ ఘటనల పూర్వా పరాలను అవలోకిద్దాం. విశ్వహిందూ పరిషత్ పిలుపు మేరకు వేలాదిమంది రామ సేవకులు, కరసేవకులు ‘పూర్ణాహుతి’ అనే మహా యజ్ఞంలో పాల్గొని అయోధ్య నుండి గుజరాత్ రాష్ట్రానికి 2002 ఫిబ్రవరి 26న సబర్మతి రైలులో తిరిగి వస్తుండగా గోద్రా రైల్వేస్టేషన్ దగ్గర కొందరు దుండగులు రైలుకు నిప్పు అంటించటంతో దాదాపు 60 మంది రామ భక్తులు మంటలకు ఆహుతయ్యారు. దానితో గుజరాత్ రాష్ట్రం మత కల్లోలాలతో అట్టుడికి దాదాపు 2,000 మంది హిందూ ముస్లింలు అసువులు బాశారు. 2002 మార్చి 3 నాడు ఐదు నెలల గర్భవతియైన 19 ఏళ్ల మహిళ బిల్కిస్ బానోపై మూకుమ్మడి అత్యాచారం, ఆమె కుటుంబానికి చెందిన మరి కొంత మంది మహిళలపై అత్యాచారం, మూడున్నర సంవత్సరాల కూతురు హత్య జరిగింది. ఆ సంఘటనలో మొత్తంగా 7 మంది హతులయ్యారు. బిల్కిస్ బానో ఇచ్చిన ఫిర్యాదును సంబంధిత పోలీసు అధికారి సక్రమంగా నమోదు చేయలేదు. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు కేసు పరిశోధన సీబీఐకి అప్పచెప్పబడింది. అప్పటికి గుజరాత్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సరియైన న్యాయం చేసే అవకాశం లేదని బాధితుల కోరిక మేరకు అత్యున్నత న్యాయస్థానం కేసును మహారాష్ట్రకు బదిలీ చేసింది. ముంబై లోని ప్రత్యేక సెషన్స్ న్యాయస్థానం ముందు 19 మందిపై నేరారోపణ పత్రం సీబీఐ దాఖలు చేసింది. అందులో ఆరుగురు పోలీసు అధికారులూ, ఒక డాక్టర్ కూడ ఉన్నారు. సాక్షుల విచారణ పిదప 11 మంది ముద్దాయిలపై సామూహిక మానభంగం, కుట్ర, హత్య వంటి నేరాలకు గాను జీవిత ఖైదు విధిస్తూ జనవరి 2008లో తీర్పు చెప్పింది. ఏడుగురు ముద్దాయిలపై కేసు కొట్టివేయగా ఒకరు విచారణ మధ్యలో చనిపోయారు. శిక్ష విధింపబడ్డ ముద్దాయిలు బొంబాయి ఉన్నత న్యాయ స్థానానికి అప్పీలు చేసుకోగా... 2017 మేలో అప్పీలును కొట్టివేస్తూ కింది కోర్టు తీర్పును ధ్రువీకరించింది. బిల్కిస్ బానోకి 50 లక్షల రూపాయల నష్ట పరిహారం, ఉద్యోగం, ఇల్లు సుప్రీం ఆదేశాల కనుగుణంగా ఇవ్వాల్సి ఉండగా ఉద్యోగం, ఇల్లు ఇప్పటిదాకా ప్రభుత్వం ఇచ్చిన దాఖలా లేదు. ఇదిలా ఉండగా యావజ్జీవ శిక్షను అనుభవిస్తున్న 11 మందిలో ఒకరైన రాధే శ్యామ్ భగవాన్ దాస్ షా అనే దోషి... జీవితఖైదు నుండి విముక్తి కలిగిస్తూ ముందస్తు విడుదల ఉత్తర్వులు జారీ చేసే విధంగా గుజరాత్ ప్రభు త్వాన్ని ఆదేశించాలని కోరుతూ 2022 మార్చిలో సుప్రీం కోర్టును ఆశ్రయిం చాడు. అప్పటికే తాము 14 సంవత్సరాల పైచిలుకు శిక్షను అనుభవించినట్లు, కావున 1992 రాష్ట్ర ప్రభుత్వ పాలసీ ప్రకారం జీవిత ఖైదును రద్దు చేస్తూ ముందస్తు విడుదలకు ఆదేశాలు ఇవ్వాలని కోరటం జరి గింది. దోషి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొని సరియైన ఉత్తర్వులు జారీ చేయమని గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీం ధర్మాసనం 2022 మే 13న ఆదేశాలిచ్చింది. జిల్లా మేజిస్ట్రేట్ ఆధ్వ ర్యంలోని 8 మందితో కూడిన జైలు అడ్వైజరీ కమిటీ 11 మంది దోషుల ముందస్తు విడుదలకు సిఫారసు చేసింది. 2022 ఆగస్టు పదిహేను నాడు 11 మంది దోషులనూ రాష్ట్ర ప్రభుత్వం 1992 పాలసీని అనుసరించి ముందస్తు విడుదల చేసింది. సుప్రీం ఆదేశాల మేరకు శిక్ష విధింపబడ్డ నాటికి అమల్లో ఉన్న 1992 జులై నాటి రాష్ట్ర ప్రభుత్వ ఉపశమన విధాన పద్ధతి ఉత్తర్వుల ప్రామాణికతగా దోషులను విడుదల చేసి నట్లు న్యాయవర్గాలు పేర్కొంటున్నాయి. 2014లో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పాలసీ విధానం ప్రకారం జీవిత ఖైదీలూ, అత్యాచార దోషులూ, సీబీఐ విచారించిన కేసుల్లో ముందస్తు విడుదలకు అనర్హులు. 1992 పాలసీ ప్రకారం 14 సంవత్సరాల జైలు జీవితం గడిపిన జీవిత ఖైదీలను నిబంధనలకు లోబడి ముందస్తు విడుదల చేయవచ్చు. ముందస్తు విడుదలను సవాలు చేస్తూ బాధితుల పరంగా ఇది అన్యాయమంటూ బిల్కిస్ బానో సుప్రీంకోర్టును ఆశ్ర యించింది. దీనిపై తీర్పు రావలసి ఉంది. రైలుకు నిప్పు అంటించిన కేసులో 31 మంది ముస్లింలకు కోర్టు శిక్ష విధించింది. మామూలుగా యావజ్జీవ ఖైదు అంటే తుది శ్వాస దాకా ఖైదు అని అర్థం. ‘శంబా జీ కృష్ణన్ జీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర’ కేసులో 1974 లో సుప్రీం కోర్టు ఇదే తీర్పిచ్చింది. అయితే రాష్ట్రపతి, గవర్నర్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు శిక్షాకాలాన్ని నిబంధనలకు లోబడి తగ్గించే అధికారముంది. భారత రాజ్యాంగంలోని 161వ అధికరణ రాష్ట్ర ప్రభుత్వ సిఫారసుతో రాష్ట్ర గవర్నర్‌కు కనీస శిక్షాకాలం, రాష్ట్ర ప్రభుత్వ పాలసీతో ప్రమేయం లేకుండా శిక్షాకాలాన్ని తగ్గించే అధికారం ఇచ్చింది. నేర విచారణ స్మృతి లోని 432, 433, 433అ సెక్షన్ల ప్రకారం... యావజ్జీవ ఖైదును ఎదుర్కొనే వారు కనీసంగా 14 సంవత్సరాల జైలు జీవితాన్ని గడిపిన వారిని మాత్రమే గవర్నరు ప్రమేయం లేకుండా ముందస్తు విడుదల చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. శిక్ష విధింపబడ్డ తేదీ నాడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ పాలసీ అమలులో ఉంటుందో ముందస్తు విడుదలకు దానినే ప్రామాణికంగా తీసుకోవాలని చట్టం చెబుతోంది. ఇవే విషయాలను ‘స్టేట్ ఆఫ్ రాజస్థాన్ వర్సెస్ రాజ్ కుమార్ ఎట్ బిట్టు’ కేసులో సుప్రీం ధర్మాసనం 2021 ఆగస్టు మూడు నాడు పేర్కొంది. కొంత కాలం క్రితం రాజీవ్ గాంధీ హత్య కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న దోషులను కూడా నిబంధన లను అనుసరించి మూడు దశాబ్దాల తర్వాత ముందస్తు విడుదల చేయటం జరిగింది. కొందరు ఊహించుకున్నట్లు యావజ్జీవ శిక్ష అంటే 14 లేదా 20 సంవత్సరాల ఖైదు మాత్రం కాదు. తడకమళ్ళ మురళీధర్ వ్యాసకర్త విశ్రాంత జిల్లా జడ్జి ‘ 98485 45970 -
వ్యాక్సిన్ తీసుకుంటేనే జీతం
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ తీసుకుంటేనే డిసెంబర్ నెల నుంచి జీతం ఇస్తామని తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) నిర్ణయించింది. ఈ మేరకు టెస్కాబ్ ఎం.డి డాక్టర్ నేతి మురళీధర్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. కరోనా తగ్గుముఖం పడుతుందనుకున్న నేపథ్యంలో దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియెంట్ వివిధ దేశాలకు విస్తరిస్తూ ఆందోళన కలిగిస్తోందన్నారు. అందువల్ల వైరస్‌ను కట్టడి చేసే చర్యల్లో భాగంగా వ్యాక్సిన్ తీసుకుంటేనే డిసెంబర్ నెల నుంచి ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. ఈ మేరకు ఉద్యోగులంతా వ్యాక్సిన్ తీసుకొని సంబంధిత సర్టిఫికెట్ సమర్పించాలని చెప్పారు. ఒకవేళ ఏదైనా వైద్య సంబంధిత కారణాల వల్ల వ్యాక్సిన్ తీసుకోవడం వీలుకాని వారు దానికి గల కారణాలు తెలుపుతూ డాక్టర్ నుంచి ధ్రువీకరణ పత్రాలు అందజేయాలన్నారు. టెస్కాబ్‌లో ఉద్యోగుల కోసం బ్యాంకు ఆవరణలో ఇప్పటికే రెండుసార్లు వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించామని, అయినప్పటికీ కొంతమంది ఉద్యోగులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. -
చెరిసగం పంచాలి..
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలను ప్రస్తుత వాటర్ ఇయర్లో రెండు తెలుగు రాష్ట్రాలకు చెరి సగం పంచాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును తెలంగాణ కోరింది. 2021–22 వాటర్ ఇయర్లో తాత్కాలిక పద్ధతిలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు 50ః50 నిష్పత్తిలో నీటి పంపకాలు చేయాలని విన్నవించింది. ఈ మేరకు కృష్ణా బోర్డుకు తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ మంగళవారం లేఖ రాశారు. ప్రాజెక్టుల వారీగా ట్రిబ్యునల్ నీటి పంపకాలు చేయలేదని, ఉమ్మడి ఏపీకి కేటాయించిన నీటినే రెండు తెలుగు రాష్ట్రాలు పంచుకున్నాయని గుర్తుచేసిన ఆయన.. బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–2) ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులను చేసేవరకు తాత్కాలిక పద్ధతిలోనే నీటి పంపకాలు చేయాలని లేఖలో పేర్కొన్నారు. లేఖలో పేర్కొన్న విషయాలు..: కృష్ణా బోర్డు 12వ భేటీలో తెలంగాణ, ఏపీల మధ్య 34ః66 నిష్పత్తిలో ఏడాదికి నీటి పంపకాలు చేయడానికి అంగీకరించాం. మైనర్ ఇరిగేషన్ వినియోగం, పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించే గోదావరి నీళ్లు, ఆవిరి నష్టాలను ఈ నిష్పత్తిలో లెక్కించకూడదని నిర్ణయించాం. ►పరీవాహకం, సాగు యోగ్యమైన భూమి, కరువు పీడిత ప్రాంతాలు, జనాభా ఆధారంగా చూస్తే కృష్ణా జలాల్లో తెలంగాణ, ఏపీల వాటా 70.9ః 29.2 శాతంగా ఉండాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ తన అవసరాలను 771 టీఎంసీలుగా పేర్కొంటూ బ్రిజేశ్ ట్రిబ్యునల్ ముందు డిమాండ్ పెట్టాం. 1976లోని బచావత్, 2013 బ్రిజేశ్ ట్రిబ్యునల్స్ బేసిన్ అవతలి ప్రాంతాలకు అనుమతించడానికి ముందు బేసిన్ లోపలి ప్రాంతాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించాయి. ►బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పు అవార్డులోకి వచ్చేవరకు కృష్ణా జలాల్లో లభ్యతగా ఉండే నీటిని 50ః50 నిష్పత్తిన పంచాలి. ►ఆమోదం, గుర్తింపు లేని ప్రాజెక్టుల ద్వారా శ్రీశైలం నుంచి ఏపీ రోజుకు 4.7 టీఎంసీల మేర నీటిని మళ్లించుకుంటోంది. మళ్లించిన కృష్ణా నీటిని నిల్వ చేసుకునేందుకు పెన్నా, ఇతర బేసిన్లలో 300 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్లు ఉన్నాయి. తెలంగాణకు మాత్రం రోజుకు 0.28 టీఎంసీల నీటిని మాత్రమే ఎత్తిపోతల ద్వారా తీసుకునే సామర్థ్యం ఉంది. ►బేసిన్ అవతలికి కృష్ణా నీటి తరలింపును రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ సీఎం వ్యతిరేకించారు. మొదట బేసిన్‌లోని బీడు భూములకు నీళ్లిచ్చాకే బేసిన్ బయటకు తరలించాలని డిమాండ్ చేశారు. ►తెలంగాణ ఆవిర్భవించిన ఏడేళ్లు గడిచినా కృష్ణా బేసిన్‌లోని తెలంగాణ భూములకు నీరు రాలేదు. కృష్ణా నీళ్లను ఏపీ వేరే బేసిన్‌కు తరలిస్తోంది. -
‘48 గంటల్లో ఆ కేసును ఛేదించాం’
-
‘48 గంటల్లో ఆ కేసును ఛేదించాం’
సాక్షి, విజయవాడ : సంచలనం సృష్టించిన మొగల్రాజపురం దోపీడీ కేసును పోలీసులు ఛేదించారు. 48 గంటల వ్యవధిలోనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీపీ శ్రీనివాస్ గురువారం మీడియాకు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ తమ ఇంట్లో 48.50 లక్షల రూపాయల నగదు చోరీ జరిగిందని డాక్టర్ మురళీధర్ ఫిర్యాదు ఇచ్చారు. ఈ చోరీలో మొత్తం ఎనిమిది మంది సూత్రధారులు, పాత్రధారులు ఉన్నారు. కేటరింగ్ పని చేసే నాగేంద్ర, ఆసుపత్రి పీఆర్ఓ మెండెం విజయ్ తాడేపల్లికి చెందిన నేరగాళ్లతో కలిసి దోపిడీ చేయించారు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశాం. 34.75 లక్షల రూపాయల నగదు, 48 గ్రాముల బంగారం రికవరీ చేశాం. ఏ2 నిందితుడు జోహాన్ వెస్లీకి నేర చరిత్ర ఉంది. డాక్టర్ మురళీధర్ దగ్గర విజయ్ అనే వ్యక్తి పీఆర్ఓగా పని చేస్తున్నాడు. దోపిడీకి ముందే డాక్టర్ భార్య స్వరూపరాణికి పీఆర్ఓ ఫోన్ చేశాడు. ( తాగుబోతు తల్లి వేధింపులు భరించలేక..) బయట అనుమానాస్పదంగా వ్యక్తులు తిరుగుతున్నారని అలర్ట్ చేశాడు. పీఆర్ఓ విజయ్‌పై అనుమానంతో విచారిస్తే వాస్తవాలు బయటకు వచ్చాయి. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నాం. దుర్గగుడి సింహాల దొంగతనంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నాం. దాని అధారంగా దర్యాప్తు చేస్తాం. దుర్గగుడి సింహాల దొంగతనం కేసులో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశాం. నిందితులను త్వరలోనే పట్టుకుంటాం. నగరంలో అన్ని దేవాలయాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాం. దేవాలయాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోమని కమిటీ సభ్యులకు చెప్పామ’’న్నారు. -
వచ్చే ఎన్నికల్లో బీజేపీదే గెలుపు
దోమకొండ : వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ గెలుపు కోసం కార్యకర్తలు తీవ్రంగా కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అభివృద్ధి కమిటీ చైర్మన్ మురళీధర్‌గౌడ్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని పైడి మర్రి ఫంక్షన్ హాల్లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రతి రాష్ట్రంలో విజయం సాధిస్తుందని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ గెలుపు కోసం బూత్ స్థాయిలో కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాలు ఉంటాయన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ఇంటింటికీ తిరిగి ప్రజలకు వివరిస్తామని పేర్కొన్నారు. కామారెడ్డి అభ్యర్థిగా వెంకటరమణారెడ్డి కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థిగా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ వెంకటరమణారెడ్డిని ఎన్నికల్లో పోటీకి నిలుపుతున్నట్లు మురళీధర్‌గౌడ్ వెల్లడించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా ఎర్పడిన బీజేపీని కాదని.. కాంగ్రెస్, జేడీఎస్ పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చాయన్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేయగా జేడీఎస్‌తో పోత్తుతో తిరిగి అధికారంలోకి రావడానికి ప్రయత్నించడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. బీజేపీ నేతలు వెంకటరమణారెడ్డి, అసెంబ్లీ ఇన్చార్జి తేలు శ్రీను, ప్రభాకర్‌యాదవ్, పార్టీ మండల అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి చింతల రాజేష్, బీజేవై ఎం జిల్లా ప్రధాన కార్యదర్శి బుర్రి రవికుమార్, నాయకులు గంగాజమున, నేతుల శ్రీనివాస్, బత్తిని సిద్దరాములు, అనుమాల శ్రీనివాస్, లక్ష్మణ్, బాపురెడ్డి, రవీందర్‌రెడ్డి, శేఖర్, నవీన్, సజ్జన్, బాల్‌రాజ్ పాల్గొన్నారు. -
యూపీ ప్రచారానికి మురళీధర్, కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు, బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి ప్రచారం నిర్వహించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చే కార్యకర్తలను సమన్వయపరచడంతో పాటు ఎన్నికల సమన్వయకర్తగా మురళీధర్‌రావు వ్యవహరిస్తారు. గురువారం నుంచి వచ్చే సోమవారం వరకు వారణాసిలోని తెలుగువారు నివసించే ప్రాంతాల్లో జి.కిషన్‌రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని చేపడతారు. జాతీయ పార్టీ ఆదేశాల మేరకు వారణాసిలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు వారిద్దరు బయలుదేరి వెళ్లారు. -
ఇవి ముగింపు లేని కథలు
అంతరంగం సాహిత్యమంటే పదాల గారడీలు, మాటల చమత్కారాలు కాదు! వాక్యాలను సంక్లిష్ట పరచడం, భావాలను ప్రహేళికల్లా కూర్చడం అంతకన్నా కాదు! రోజు రోజుకూ పతనం వైపు వేగంగా పరుగెడ్తున్న ఆధునిక జీవనంలో, దిగజారిపోతున్న నైతిక ప్రమాణాలని, సున్నితమైన మానవ సంబంధాలను తిరిగి మెరుగుపరిచే సామాజిక బాధ్యతను వహించేది సాహిత్యం. నా కథల విషయానికి వస్తే, నా కథల్లోని మనుషులు నాకు చిరపరిచితులు. వారి కష్టాలూ–కన్నీళ్లూ, బాధలూ– వ్యథలే గాకుండా వారి అరుదైన జీవన నైపుణ్యాలు– అద్భుతమైన సౌందర్యదృష్టీ, ప్రతికూల పరిస్థితుల్లో కూడా జీవితాన్ని ప్రశాంతంగా జీవించే స్థితప్రజ్ఞతా కూడా నాకు చిరపరిచితాలే! పల్లెవాసుల జీవితాల్లోని మానవీయ కోణాలనీ, సహజ మానవ ప్రవర్తనలనీ, నిరాడంబర కల్పనా చాతుర్యాలనీ దగ్గరుండి చూసినపుడు, కొన్నిసార్లు వాటితో మమేకమైపోయినపుడు కలిగిన స్పందనలే నా కథలు. నిజానికి ఇవి ముగింపు లేని కథలు! కాగితం మీద నేను వారి కథలను ముగించినా, కాలం పుస్తకంలో వారి జీవితాల కథలు ఇంకా కొనసాగుతూనే వుంటాయి. ఆధునిక సాహిత్యపు ఆరవ ప్రాణమైన కథాప్రక్రియ– పరిణామక్రమంలో శైలీ, శిల్పం, విషయం, భాషలాంటి అంశాల్లో ఎన్నో ప్రయోగాత్మక మార్పులు చెందుతున్న నేపథ్యంలో, నా కథల్లో శైలీ, శిల్పం, ఎత్తుగడ, ముగింపులాంటివి ఏ మేరకు సాహితీ విలువలను కలిగి ఉన్నాయో, ఉంటే ఏ స్థాయిలో ఉన్నాయో, ఏ స్థాయిలో లేవో కూడా నాకు పెద్దగా తెలియదు. నేను చెప్పదలుచుకున్న విషయానికి సంబంధించి, పాత్రల పరిధి మేరకే సంభాషణలో, సంవాదాలో వ్రాస్తాను తప్ప– శిల్పం లోపించకూడదని, శైలి కొత్తగా వుండాలని, పాత్రల స్థాయికి మించిన సంభాషణలను, లౌక్యాన్నీ వ్రాయలేను. కొన్ని మానవీయమైన వాక్యాలూ, దృశ్యాలూ మాత్రం కథకు ‘అన్నీ తామై’ నిలబడతాయని మాత్రం తెలుసు. 1987లో మొదటి కథ ‘అడవి పువ్వు’ వ్రాసినప్పటి నుండీ ఇప్పటిదాకా– అంటే దాదాపుగా 28 సంవత్సరాలుగా 18 కథలు మాత్రమే వ్రాయడం నాకు తీవ్ర అసంతృప్తిగా ఉంది. కానీ రాసిన వాటికి తగిన గుర్తింపు (11 బహుమతులు కాకుండా) లభించడం ఎంతో సంతృప్తిగా ఉంది. నెమలినార(కథలు); రచన: బి.మురళీధర్ పేజీలు: 220; వెల: 150; ప్రతులకు: బి–85, హౌసింగ్ బోర్డ్ కాలనీ, ఆదిలాబాద్–504001. బి.మురళీధర్ 9440229728 -
టీడీపీని వీడే ప్రసక్తి లేదు..
జెడ్పీ వైస్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్ ‘రేవూరి’ కార్యక్రమాల్లో పాల్గొనేది లేదన్న శ్రేణులు నల్లబెల్లి : టీడీపీ ప్రారంభం నుంచి క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగుతున్న తాను పార్టీని వీడేది లేదని జెడ్పీ వైస్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్ స్పష్టం చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాశ్‌రెడ్డి, మురళీధర్ నడుమ కొంతకాలంగా విబేధాలు నెలకొన్న నేపథ్యంలో శనివారం స్థానికంగా ఆయన టీడీపీ శ్రేణుల తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మురళీధర్ మాట్లాడుతూ ప్రకాశ్‌రెడ్డి మండలంలో అన్నదమ్ముల్లా కలిసి ఉన్న టీడీపీ కార్యకర్తలు నడుమ విబేధాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. అయినప్పటికీ తాను టీడీపీ వీడేది లేదని పేర్కొంటూ కార్యకర్తలతో కలిసి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా కార్యకర్త లు పలువురు మురళీధర్ వెంటే ఉంటామని స్పష్టం చేయడంతో పాటు ప్రకాశ్‌రెడ్డి కార్యక్రమాల్లో పాల్గొనమ ని తేల్చిచెప్పారు. సమావేశానికి టీడీపీ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హాజరుకాకపోగా.. సుమారు 400 మంది కార్యకర్తలు హాజరుకావడం గమనార్హం. -
ఊరూరా ఇంటర్నెట్
* బీఎస్ఎన్ఎల్ ఏపీ సర్కిల్ సీజీఎం మురళీధర్ సాక్షి, హైదరాబాద్: ఊరూరా ఇంటర్నెట్ ఏర్పాటు చేసేందుకు బీఎస్ఎన్ఎల్ నడుం బిగించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 21,265 గ్రామాలను హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్‌తో అనుసంధానించేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా మక్లూర్ బీఎస్ఎన్ఎల్ బ్లాక్ పరిధిలో 5 గ్రామ పంచాయతీలకు, ఏపీలోని పరవాడ బ్లాక్ పరిధిలో హైస్పీడ్ బ్రాడ్ బ్యాండ్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ మిగతా పంచాయతీల కోసం ప్రత్యేకంగా ఆప్టికల్ ఫైబర్ లైన్లను ఏర్పాటు చేయబోతోంది. దీనికి సంబంధించిన వివరాలను బీఎస్ఎన్ఎల్ ఏపీ సర్కిల్ సీజీఎం మురళీధర్ మంగళవారమిక్కడ మీడియాకు వెల్లడించారు. కేంద్రం ప్రతిపాదించిన డిజిటల్ ఇండియాలో భాగంగా తెలంగాణ పరిధిలో 8,779 పంచాయతీలు, ఏపీ పరిధిలో 12,876 పంచాయతీలకు హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం కలగనుందని తెలిపారు. ల్యాండ్‌లైన్ వ్యవస్థను ఆధునికీకరించేందుకు చర్యలు ప్రారంభించినట్లు చెప్పారు. అలాగే, రెండు రాష్ట్రాల్లో రూ.198 కోట్లతో కొత్త ప్రాజెక్టును చేపట్టనున్నట్లు వివరించారు. 3 జీ టవర్లను 1,450కు పెంచనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 79 పర్యాటక ప్రాంతాల్లో 5జీ వైఫ్ సేవలు అందుబాటులో ఉంచామన్నారు. వీటిని మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి వైఫై హాట్స్పాట్లుగా మరో 93 ప్రాంతాలను గుర్తిం చామన్నారు. కాగా, అమూల్య పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించిన్నట్లు వెల్లడించారు. ఈ పథకంలో భాగంగా ఏ నెట్‌వర్క్‌కైనా లోకల్/ఎస్టీడీల కాల్ రేటు సెకనుకు ఒక పైసాగా ఉంటుందని, రాత్రి 9 నుంచి ఉదయం ఏడు వరకు నిమిషానికి 20 పైసలుగా ఉంటుందని చెప్పారు. అలాగే, రూ.200 పైబడిన విలువైన టాప్ అప్ ఓచర్లకు ఫుల్ టాక్‌టైం ఇస్తామని ప్రకటించారు. -
ఈఎన్సీ మురళీధర్ పదవీకాలం పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: ఇరిగేషన్ ఇంజనీర్ ఇన్ చీఫ్(ఈఎన్సీ) సి.మురళీధర్ పదవీకాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ శైలేంద్ర కుమార్ జోషి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పాటు సెంట్రల్ డిజైన్ ఆర్గైనె జేషన్ (సీడీఓ) చీఫ్ ఇంజనీర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఎస్.ప్రదీప్‌కుమార్, పదవీ విరమణ చేసిన కారణంగా ఆయన స్థానంలో క్వాలిటీ కంట్రోల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎ.నరేందర్‌రెడ్డికి చీఫ్ ఇంజనీర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ మరో ఉత్తర్వు కూడా జారీ చేశారు. -
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శికి గుండెపోటు
తిరుమల కాలిబాటలో ఘటన మెరుగైన వైద్యంతో కోలుకుంటున్న మురళీధర్‌రావు తిరుపతి: శ్రీవారి దర్శనార్థం కాలిబాటలో తిరుమలకు వెళుతున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి. మురళీధర్‌రావుకు ఆదివారం అర్ధరాత్రి గుండెపోటు వచ్చింది. కార్యకర్తలు తక్షణమే స్పందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం ఉదయం మురళీధరరావు బెంగళూరు నుంచి రోడ్డు మార్గం ద్వారా తిరుపతికి చేరుకున్నారు. సాయంత్రం వరకు వరుసగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం శ్రీవారి దర్శనం కోసం రాత్రి 10 గంటకు అలిపిరి నుంచి కాలిబాటలో బయలుదేరారు. 11.30 గంటల ప్రాంతంలో గాలిగోపురం వద్దకు చేరుకోవడానికి మరో 500 మెట్లు ఉండగా పడిపోయారు. పార్టీ నాయకులు తక్షణమే అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అంబులెన్స్ గాలిగోపురం వద్దకు మాత్రమే రాగలిగింది. దీంతో కొందరు నాయకులు మురళీధర్‌రావును చేతులపై ఎత్తుకుని గాలిగోపురం వరకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో తిరుమల అశ్వని ఆస్పత్రికి తరలించగా వైద్యులు గుండెపోటుగా గుర్తించారు. అనంతరం అతడ్ని మెరుగైన చికిత్స కోసం అపోలోకు, తర్వాత స్విమ్స్‌కు తరలించారు.