వచ్చే ఎన్నికల్లో బీజేపీదే గెలుపు    | BJP wins in the next election says muralidhar goud | Sakshi
Sakshi News home page

వచ్చే ఎన్నికల్లో బీజేపీదే గెలుపు   

May 23 2018 2:11 PM | Updated on Oct 17 2018 6:10 PM

BJP wins in the next election says muralidhar goud - Sakshi

పార్టీలో చేరిన వారికి కండువా కప్పి ఆహ్వానిస్తున్న మురళీధర్‌గౌడ్, వెంకటరమణారెడ్డి తదితరులు

దోమకొండ : వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ గెలుపు కోసం కార్యకర్తలు తీవ్రంగా కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అభివృద్ధి కమిటీ చైర్మన్‌ మురళీధర్‌గౌడ్‌ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని పైడి మర్రి ఫంక్షన్‌ హాల్‌లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రతి రాష్ట్రంలో విజయం సాధిస్తుందని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ గెలుపు కోసం బూత్‌ స్థాయిలో కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాలు ఉంటాయన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ఇంటింటికీ తిరిగి ప్రజలకు వివరిస్తామని పేర్కొన్నారు. 

కామారెడ్డి అభ్యర్థిగా వెంకటరమణారెడ్డి 

కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థిగా జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ వెంకటరమణారెడ్డిని ఎన్నికల్లో పోటీకి నిలుపుతున్నట్లు మురళీధర్‌గౌడ్‌ వెల్లడించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా ఎర్పడిన బీజేపీని కాదని.. కాంగ్రెస్, జేడీఎస్‌ పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చాయన్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేయగా జేడీఎస్‌తో పోత్తుతో తిరిగి అధికారంలోకి రావడానికి ప్రయత్నించడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు.

బీజేపీ నేతలు వెంకటరమణారెడ్డి, అసెంబ్లీ ఇన్‌చార్జి తేలు శ్రీను, ప్రభాకర్‌యాదవ్, పార్టీ మండల అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి చింతల రాజేష్, బీజేవై ఎం జిల్లా ప్రధాన కార్యదర్శి బుర్రి రవికుమార్, నాయకులు గంగాజమున, నేతుల శ్రీనివాస్, బత్తిని సిద్దరాములు, అనుమాల శ్రీనివాస్, లక్ష్మణ్, బాపురెడ్డి, రవీందర్‌రెడ్డి, శేఖర్, నవీన్, సజ్జన్, బాల్‌రాజ్‌ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement