టీడీపీ ప్రారంభం నుంచి క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగుతున్న తాను పార్టీని వీడేది లేదని జెడ్పీ వైస్ చైర్మన్ చెట్టుపల్లి
జెడ్పీ వైస్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్
‘రేవూరి’ కార్యక్రమాల్లో పాల్గొనేది లేదన్న శ్రేణులు
నల్లబెల్లి : టీడీపీ ప్రారంభం నుంచి క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగుతున్న తాను పార్టీని వీడేది లేదని జెడ్పీ వైస్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్ స్పష్టం చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాశ్‌రెడ్డి, మురళీధర్ నడుమ కొంతకాలంగా విబేధాలు నెలకొన్న నేపథ్యంలో శనివారం స్థానికంగా ఆయన టీడీపీ శ్రేణుల తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మురళీధర్ మాట్లాడుతూ ప్రకాశ్‌రెడ్డి మండలంలో అన్నదమ్ముల్లా కలిసి ఉన్న టీడీపీ కార్యకర్తలు నడుమ విబేధాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు.
అయినప్పటికీ తాను టీడీపీ వీడేది లేదని పేర్కొంటూ కార్యకర్తలతో కలిసి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా కార్యకర్త లు పలువురు మురళీధర్ వెంటే ఉంటామని స్పష్టం చేయడంతో పాటు ప్రకాశ్‌రెడ్డి కార్యక్రమాల్లో పాల్గొనమ ని తేల్చిచెప్పారు. సమావేశానికి టీడీపీ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హాజరుకాకపోగా.. సుమారు 400 మంది కార్యకర్తలు హాజరుకావడం గమనార్హం.