
యూపీ ప్రచారానికి మురళీధర్, కిషన్‌రెడ్డి
ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు...
సాక్షి, హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు, బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి ప్రచారం నిర్వహించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చే కార్యకర్తలను సమన్వయపరచడంతో పాటు ఎన్నికల సమన్వయకర్తగా మురళీధర్‌రావు వ్యవహరిస్తారు.
గురువారం నుంచి వచ్చే సోమవారం వరకు వారణాసిలోని తెలుగువారు నివసించే ప్రాంతాల్లో జి.కిషన్‌రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని చేపడతారు. జాతీయ పార్టీ ఆదేశాల మేరకు వారణాసిలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు వారిద్దరు బయలుదేరి వెళ్లారు.