ప్రియురాలిని పెళ్లాడిన బాలీవుడ్‌ నటుడు, ఫోటోలు వైరల్‌ | Randeep Hooda Ties Knot With Lin Laishram, Wedding Pics Out | Sakshi
Sakshi News home page

Randeep Hooda: 47 ఏళ్ల వయసులో ప్రియురాలిని పెళ్లి చేసుకున్న నటుడు

Nov 30 2023 11:07 AM | Updated on Nov 30 2023 11:23 AM

Randeep Hooda Ties Knot with Lin Laishram, Wedding Pics Out - Sakshi

ఒంటి నిండా నగలు ధరించి పుత్తడి బొమ్మలా మండపానికి నడుచుకుంటూ వచ్చిన వధువు మొదటగా వరుడికి నమస్కరించి అతడి మెడలో మల్లెపూల మాల వేసింది. తర్వా

బాలీవుడ్‌ నటుడు రణ్‌దీప్‌ హుడా పెళ్లిపీటలెక్కాడు. ప్రియురాలు, నటి లిన్‌ లైస్రామ్‌ను వివాహం చేసుకున్నాడు. మణిపూర్‌లోని ఇంపాల్‌లో బుధవారం (నవంబర్‌ 29న) నాడు ఇరు కుటుంబాలు, బంధుమిత్రుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. మైటీ సాంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

వరుడు రణ్‌దీప్‌ తెల్ల దుస్తులు ధరించగా, వధువు లిన్‌ మణిపురి సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయింది. ఒంటి నిండా నగలు ధరించి పుత్తడి బొమ్మలా మండపానికి నడుచుకుంటూ వచ్చిన వధువు మొదటగా వరుడికి నమస్కరించి అతడి మెడలో మల్లెపూల మాల వేసింది. తర్వాత రణ్‌దీప్‌ భార్య మెడలో మల్లెపూల మాల వేశాడు. వీరి సాంప్రదాయాన్ని చూసి నెటిజన్లు ముచ్చటపడుతున్నారు. కాగా రణ్‌దీప్‌ కంటే లిన్‌ పదేళ్లు చిన్నది. ప్రస్తుతం రణ్‌దీప్‌ వయసు 47 ఏళ్లు కాగా లిన్‌ వయసు 37 ఏళ్లు.

సినిమాల విషయానికి వస్తే..
రణ్‌దీప్‌ 'మాన్‌సూన్‌ వెడ్డింగ్‌' చిత్రంతో సిల్వర్‌ స్క్రీన్‌పై రంగప్రవేశం చేశాడు. 'వన్స్‌ అపాన్‌ ఎ టైమ్‌ ఇన్‌ ముంబై', 'సాహెబ్‌, బివి ఔర్‌ గ్యాంగ్‌స్టర్‌', సల్మాన్‌ ఖాన్‌ 'కిక్‌', 'రంగ్‌ రాసియ', 'జిస్మ్‌ 2' వంటి పలు చిత్రాలతో పాపులారిటీ సంపాదించాడు. ప్రస్తుతం 'స్వతంత్ర వీర్‌ సావర్కర్‌', 'లాల్‌ రంగ్‌ 2: ఖూన్‌ చుస్వా' సినిమాలు చేస్తున్నాడు. లిన్‌ విషయానికి వస్తే.. 2007లో 'ఓం శాంతి ఓం' చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. 'మేరీ కోమ్‌', 'మాతృ కి బిజిలీ కా మండోలా', 'రంగూన్‌', 'ఆక్సోన్‌', 'ఉమ్రిక', 'ఖైదీ బంద్‌' వంటి చిత్రాల్లో నటించింది. ఈమె చివరిసారిగా జానే జాన్‌ సినిమాలో కనిపించింది.

చదవండి: విజయ్‌ ఆంటోని గొప్పదనాన్ని వివరించిన బాహుబలి నటుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement