ఎన్నో సినిమాలు చేస్తే కానీ కొందరికి గుర్తింపు లభించదు. మరికొందరికి మాత్రం తొలి చిత్రంతోనే పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. నటుడు సూర్య రెండో కోవలోకి వస్తాడు. ఇతడు రాజమౌళి సై సినిమాతో నటుడిగా క్లిక్ అయ్యాడు. ఆ నలుగురు చిత్రంతో పాటు పలు హిట్ సినిమాల్లో నటించాడు. ఆ మధ్య ఓ హత్య కేసులోనూ అతడి పేరు వినిపించడంతో మానసికంగా చాలా డిస్టర్బ్ అయ్యాడు.
పాతిక లక్షల కోసం వెళ్లి..
తాజాగా సదరు ఘటన గురించి సూర్యంగా వివరంగా చెప్పుకొచ్చాడు. 'నేను కలియుగ అనే సినిమా తీశాను. దానికోసం నా దగ్గరున్న డబ్బులన్నీ పెట్టేశాను. రిలీజ్‌కు రూ.25 లక్షలు అవసరమయ్యాయి. ఓ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాకేశ్ రెడ్డి అనే వ్యక్తిని పరిచయం చేశాడు. అతడు చిన్న చిన్న సినిమాలకు డబ్బు అప్పుగా ఇస్తుంటాడు. నా సినిమా చూపించి డబ్బు అడిగాను. ఇక్కడేమైందంటే డబ్బులు అవసరమై చిగురుపాటి జయరాం అనే వ్యక్తిని కూడా కలిశాను.
ఆ మరునాడే హత్య.. మీడియాలో నా పేరు
పది రోజుల్లో డబ్బు సర్దుతానన్నాడు, సరేనని అక్కడి నుంచి వెళ్లిపోయాను. ఆ మరునాడే ఆయన హత్య జరిగింది. ముందు రోజు నేను ఆయనను కలవడంతో నామీద అనుమానపడ్డారు. సినిమా వాళ్ల గురించి ఎలా రాస్తారో తెలిసిందే! ఆ హత్యతో నాకసలు సంబంధమే లేదని రుజువైంది. కానీ అప్పటికే మీడియాలో నా గురించి ఏదిపడితే అది రాశారు. చాలా ఇబ్బందులు పడ్డాను. ఇకపోతే కలియుగ సినిమా కోసం నా ఇల్లు కూడా ఇమ్మేశాను. ఈ మూవీ వచ్చే నెలలో ఓటీటీలోకి రాబోతోంది' అని చెప్పుకొచ్చాడు సూర్య.
చదవండి: మహాలక్ష్మిని, నన్ను ఎవరూ వేరు చేయలేరు.. ఎంతైనా తిట్టుకోండి..
Comments
Please login to add a commentAdd a comment