బాబీ, రోటి కపడా ఔర్ మకాన్, రాకీ, లవ్ స్టోరీ, బేటా, కర్తవ్య.. ఇలా పలు హిందీ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించింది అరుణ ఇరానీ. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలు పెట్టిన ఆమె తర్వాతి కాలంలో సహాయక పాత్రలతో ఫేమస్ అయింది. సినిమాలే కాకుండా సీరియల్స్ కూడా చేసింది. తాజాగా ఆమె అరుణ ఇరానీ ఓ ఇంటర్వ్యూలో వ్యక్తిగత విషయాలను పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. 'కోహ్రాం సినిమా షూటింగ్‌లో తొలిసారి డైరెక్టర్ కుకును కలిశాను. అప్పటికే నా ఇల్లు గడవడం కోసం చాలా సినిమాలు చేస్తున్నాను. కానీ అవేమీ పెద్దగా గుర్తింపు ఉన్న పాత్రలు కావు.
ఒకరంటే ఒకరికి కోపం
చెన్నైలో సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో కుకు ఓ నెలరోజులపాటు నా డేట్స్ అడిగారు. సరేనని సినిమాలో భాగమయ్యాను. అయితే బిజీ షెడ్యూల్స్ వల్ల అన్నీ మేనేజ్ చేయలేకపోయాను. నా వల్ల కావడం లేదని, వేరే ఆప్షన్ చూసుకోమని చెప్పాను. అప్పుడు కుకుకి విపరీతమైన కోపం వచ్చింది. నాపై సీన్లు ఉన్నా, లేకపోయినా నాకు కొన్ని డేట్స్ ఇచ్చి రమ్మనేవారు. నాపై సీన్ షూట్ లేనప్పుడు ఎందుకు రమ్మంటున్నారని కోపమొచ్చింది. ఒక్కోసారైతే రోజంతా కూర్చోబెట్టి ఒక చిన్న షాట్ తీసేవారు. ఆయనను చూస్తేనే ఒళ్లు మండిపోయింది. తనకు కూడా నేనంటే అంతే కోపం ఏర్పడింది.
ప్రేమలో పడిపోయాం
ఏమైందో తెలీదు కానీ ఉన్నట్లుండి సాఫ్ట్‌గా మారిపోయాడు. కూల్‌గా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం. అప్పుడు తనే నా డేట్లు అడ్జస్ట్ చేశాడు. అలా మేము ప్రేమలో పడ్డాం.. పెళ్లి చేసుకున్నాం. కానీ ఎవరికీ ఆ విషయం చెప్పలేదు. ఎందుకంటే అతడికి ఆల్‌రెడీ పెళ్లయింది. నాకు ఆ విషయం తెలియదని అంతా అనుకున్నారు. అతడి భార్య, పిల్లలు సెట్స్‌కు వచ్చేవారు.. కాబట్టి తనకు ఇదివరకే ఓ కుటుంబం ఉందని నాకు ముందే తెలుసు. అయినా సరే కలిసుండాలనుకున్నాం. అందరితో పోరాడి మరీ అతడు నన్ను పెళ్లి చేసుకున్నాడు. అయితే పిల్లల్ని వద్దనుకున్నాం.. ఈ నిర్ణయం తీసుకోవడమే మేము చేసిన పెద్ద తప్పు' అని చెప్పుకొచ్చింది.
చదవండి: పాతికేండ్లుగా సినిమాలకు దూరం.. రీఎంట్రీపై తెలుగు హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment