
బాలీవుడ్ నటుడు, సీఐడీ షో ద్వారా పాపులర్ అయిన దినేశ్ ఫడ్నీస్ తీవ్ర అనారోగ్యంతో ముంబైలోని ఓ ఆస్పత్రిలో చేరాడు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత రెండు రోజులుగా ఆయన వెంటిలేటర్‌పై చికిత్స అందుకుంటున్నాడు. ఈ విషయం తెలిసిన పలువురు నటులు ఆస్పత్రికి చేరుకుని ఆయన్ను పరామర్శిస్తున్నారు. గుండెపోటు వల్లే ఆయన ఆస్పత్రిపాలైనట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ క్రమంలో సీఐడీ సహనటుడు దయానంద్ శెట్టి సదరు వార్తలపై స్పందిస్తూ.. దినేశ్ అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నమాట వాస్తవమే! ఆయన వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్నాడు. అయితే ఆయనకు గుండెపోటు రాలేదు. ఇతర అనారోగ్య సమస్యల కారణంగా ఆస్పత్రిపాలయ్యాడు. దాని గురించి ఇప్పుడు మాట్లాడాలనుకోవడం లేదు అని తెలిపాడు.
కాగా దినేశ్.. సీఐడీ షోలో ఫ్రెడరిక్స్ అనే పాత్రను పోషించాడు. 20 ఏళ్లపాటు ఈ షోలో భాగమయ్యాడు. 1998లో మొదలైన సీఐడీ షో దాదాపు 20 ఏళ్లు బుల్లితెరపై విజయవంతంగా ప్రసారమైన సంగతి తెలిసిందే! సీఐడీతో పాటు హిట్ సీరియల్ తారక్ మెహతాకా ఉల్టా చష్మా సీరియల్‌లోనూ అతిథి పాత్రలో నటించాడు దినేశ్. సర్ఫరోష్, సూపర్ 30 సహా పలు హిందీ చిత్రాల్లో యాక్ట్ చేశాడు.
చదవండి: ప్రముఖ నటి కన్నుమూత... బెడ్‌పై లేవలేని స్థితిలో ఉన్నప్పటికీ... చివరి వీడియో