
బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ ఈ నెల 1న గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 14 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. వీరికి వారం చొప్పున రెమ్యునరేషన్ అందిస్తారు. సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న సమాచారం మేరకు ఒక్కొక్కరి రెమ్యునరేషన్ వివరాలు ఇలా ఉన్నాయి.

యాంకర్ విష్ణుప్రియకి వారానికి అత్యధికంగా రూ. 3.70 లక్షలు తీసుకుంటున్నారట.

హీరో ఆదిత్య ఓం వారానికి రూ.3 లక్షలు పారితోషికంగా పుచ్చకుంటున్నాడు.

టీవీ నటుడు నిఖిల్ వారానికి రూ. 3 లక్షలు తీసుకుంటున్నాడు.

టీవీ నటి యష్మి గౌడ వారానికి రూ.2.50 లక్షల పారితోషికంగా తీసుకుంటుంది.

టీవీ నటి ప్రేరణకి వారానికి రూ.2.50 లక్షలు ఇస్తున్నారట.

ఆర్జే శేఖర్ బాషా వారానికి రూ.2.30 లక్షలు తీసుకుంటున్నాడు

డ్యాన్సర్ నైనిక వారానికి రూ.2.30 లక్షల పారితోషికం పుచ్చుకుంటుంది

సినీ నటి, యూట్యూబర్ కిర్రాక్ సీత వారానికి రూ.2.20 లక్షలు తీసుకుంటుంది

సీనీ నటుడు అభయ్ నవీన్ వారానికి రూ. 2 లక్షలు తీసుకుంటున్నాడు.

యూట్యూబర్ నబీల్ ఆఫ్రిదికి వారానికి రూ. 1.70 లక్షలు ఇస్తున్నారట.

సీనీ నటి సోనియా ఆకుల వారానికి రూ.1.70లక్షలు పారితోషికంగా అందుకుంటుంది

టీవీ నటుడు పృథ్విరాజ్ వారానికి రూ.1.50లక్షలు తీసుకుంటుంది

యూట్యూబర్ బెజవాడ బేబక్క వారానికి రూ.1.30లక్షలు తీసుకుంటుంది

టీవీ నటుడు నాగ మణికంఠ - వారానికి రూ.1.25 లక్షలు తీసుకుంటున్నాడు.