
మాల్వీ మల్హోత్రా.. ఈమె పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది.

కారణం లావణ్య. రాజ్ తరుణ్ తనన నమ్మించి మోసం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తిరగబడరా సామి హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో ప్రేమలో పడి తనను దూరం పెడుతున్నాడని వాపోయింది.

రాజ్ తరుణ్‌తో 11 ఏళ్లుగా కలిసుంటున్నానని, గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామంది. మాల్వీ వల్ల తన నెంబర్ బ్లాక్‌లిస్టులో పెట్టాడని వాపోయింది.

రాజ్ తరుణ్ తనక్కావాలని డిమాండ్ చేస్తోంది. మాల్వీ తనతో మాట్లాడిన సంభాషణలను సైతం మీడియాకు రిలీజ్ చేసింది.

మరోవైపు రాజ్ తరుణ్.. లావణ్యతో రెండుమూడేళ్లు మాత్రమే కలిసున్నట్లు పేర్కొన్నాడు.

ప్రస్తుతం ఆమె వేరొకరితో రిలేషన్‌లో ఉందన్నాడు.

డబ్బుకోసం తన స్నేహితులను బెదిరిస్తూ వేధింపులకు గురి చేస్తోందన్నాడు.

అందులో భాగంగానే మాల్వీని సైతం బెదిరించిందన్నాడు.

ఈ క్రమంలో నెట్టింట మాల్వీ ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి.









