
ఆ నటుడు కోపంతో తల మీద ఒక్కటిచ్చాడు. అక్కడున్న సెక్యూరిటీ కూడా అతడిని మెడ పట్టుకుని అవతలకు తోశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో
అభిమాన తారలు కనిపిస్తే చాలు ఫోటో దిగాలని, షేక్ హ్యాండ్ ఇవ్వాలని ఉవ్విళ్లూరుతుంటారు జనాలు. కొందరు సెలబ్రిటీలు ఓపికగా చిరునవ్వుతో వారికి సెల్ఫీ ఇవ్వడానికి ముందుకొస్తే మరికొందరు మాత్రం అభిమానులను పట్టించుకోకుండా హడావుడిగా వెళ్లిపోతుంటారు. అయితే ప్రముఖ నటుడు నానా పటేకర్ మాత్రం తనతో సెల్ఫీ దిగాలని ప్రయత్నించిన అభిమానిని ఫట్‌మని కొట్టాడు.
మెడ పట్టి గెంటేశారు
ఓ అభిమాని నానా పటేకర్ కనిపించగానే ఫోన్ పట్టుకుని సెల్ఫీ కోసం ఆయన దగ్గరకు వెళ్లాడు. అంతే.. ఆ నటుడు కోపంతో తల మీద ఒక్కటిచ్చాడు. అక్కడున్న సెక్యూరిటీ కూడా అతడిని మెడ పట్టుకుని అవతలకు తోశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు నానా పటేకర్ దురుసు ప్రవర్తనను ఎండగడుతున్నారు. సెల్ఫీ ఇవ్వడం ఇష్టం లేకపోతే కుదరదని సౌమ్యంగా చెప్పొచ్చుగా, ఎందుకలా కొట్టడం అని విమర్శిస్తున్నారు. ఆయన చేసింది ముమ్మాటికీ తప్పేనని కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ ఘటన వారణాసిలో జరిగినట్లు తెలుస్తోంది.
సినిమాల సంగతి..
కాగా మీటూ ఉద్యమం సమయంలో నానా పటేకర్‌పై ఆరోపణలు వెల్లువెత్తాయి. తనుశ్రీ దత్తా ఫిర్యాదుతో ఎఫ్‌ఐఆర్ కూడా నమోదైంది. కానీ విచారణలో తనపై ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేశారని తేలింది. ఏదేమైనా మీటూ వివాదం ఆయన కెరీర్‌కు మచ్చ తెచ్చింది. దీంతో కొంతకాలం మీడియాకు, సినిమాలకు దూరగా ఉన్న ఆయన అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు. ఆయన చివరగా వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ద వ్యాక్సిన్ వార్ సినిమాలో నటించాడు.
वाराणसी - नाना पाटेकर ने अपने फैंस को जड़ा थप्पड़ , फिल्म की शूटिंग के दौरान सेल्फी लेने पहुंचा था फैंस
— Dinesh Kumar (@DineshKumarLive) November 15, 2023
➡नाना पाटेकर ने थप्पड़ जड़कर फैंस को भगाया
➡सोशल मीडिया पर वायरल हुआ थप्पड़ मारने का वीडियो
➡वाराणसी में नाना पाटेकर कर रहे हैं फिल्म जर्नी की शूटिंग. #Varanasi pic.twitter.com/tlPS1QX9g9
చదవండి: చైతూ తొలి వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడు?