హిందూ పద్ధతిలో సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాం: నటుడు | Zayed Khan Secret Marriage with Malaika Parekh in Hindu Rituals | Sakshi
Sakshi News home page

రెండుసార్లు నటుడి పెళ్లి.. అంతా నా భార్యే చూసుకుంది!

Published Thu, Oct 24 2024 5:28 PM | Last Updated on Thu, Oct 24 2024 5:43 PM

Zayed Khan Secret Marriage with Malaika Parekh in Hindu Rituals

ప్రేమకు హద్దుల్లేవు, కులమతభాష పట్టింపులు అంతకన్నా లేవని నిరూపించిన జంటలు కోకొల్లలు. బాలీవుడ్‌ నటుడు జాయేద్‌ ఖాన్‌- మలైకా పరేఖ్‌ ఆ కోవలోకే వస్తారు. వీరిద్దరూ ఎంతో ఆర్భాటంగా పెళ్లి చేసుకున్నారు. అయితే దానికంటే ముందు సీక్రెట్‌గా హిందూ పద్ధతిలో వివాహం చేసుకున్నామంటున్నాడు జాయేద్‌ ఖాన్‌.

సర్‌ప్రైజ్‌ ప్లాన్‌
జాయేద్‌ దంపతులు ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మేము మా పెళ్లికి దాదాపు రెండువేల మంది అతిథుల్ని పిలవాలనుకున్నాం. కానీ అప్పుడిది పెళ్లికి బదులు సర్కస్‌గా మారిపోతుందని భావించాం. అందుకే, ఆ గ్రాండ్‌ వెడ్డింగ్‌ కంటే ముందు ఇంకేదైనా చేయాలనుకున్నాం. 30 మంది ఫ్రెండ్స్‌కు ఫోన్‌ చేశాం.. 

రహస్య వివాహం
గోవాలో తాజ్‌ గ్రామానికి వెళ్తున్నాం. అక్కడ మీ అందరికీ ఓ సర్‌ప్రైజ్‌ ఉంటుందని చెప్పాం. అలా రహస్యంగా పెళ్లి చేసుకున్నాం. పండితుడిని మాట్లాడటం, పెళ్లిలో పాటించే ఆచారాలు వంటివన్నీ మలైకా చూసుకుంది. తను ఏం చెప్తే అది ఫాలో అయిపోయాను. మేము అగ్నిగుండం చుట్టూ ఏడడుగులు వేశాం. ఎంత అందంగా గడిచిందో ఆ రోజు!

అన్ని పండగలు సెలబ్రేట్‌ చేస్తాం
అలా అఫీషియల్‌ పెళ్లికంటే ముందే మేము భార్యాభర్తలమయ్యాం. మా ఇంట్లో అన్నిరకాల పండగలు సెలబ్రేట్‌ చేసుకుంటాం. ప్రతి దేవుడిని పూజిస్తాం అని చెప్పుకొచ్చాడు. కాగా ప్రముఖ దర్శకుడు సంజయ్‌ ఖాన్‌ తనయుడే జాయేద్‌. ఇతడు 2005లో మలైకాను పెళ్లి చేసుకున్నాడు. వీరికి జిడాన్‌, అరిజ్‌ అని ఇద్దరు సంతానం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement