Pushpa 2 Release: పుష్ప 2 రిలీజ్‌ డేట్‌ మారింది.. ముందే వచ్చేస్తున్న ‘పుష్ప’రాజ్‌ | Allu Arjun Pushpa 2 The Rule Movie Release Date Changed, New Date With PushpaRaj Poster Goes Viral | Sakshi
Sakshi News home page

Pushpa 2 New Release Date: పుష్ప 2 రిలీజ్‌ డేట్‌ మారింది.. ముందే వచ్చేస్తున్న ‘పుష్ప’రాజ్‌

Published Thu, Oct 24 2024 2:36 PM | Last Updated on Thu, Oct 24 2024 3:09 PM

Pushpa 2 Movie Release Date Changed

రూమర్సే నిజమయ్యాయి. అంతా ఊహించినట్లుగానే పుష్పరాజ్‌ ఒక రోజు ముందే వచ్చేస్తున్నారు. అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ తెరకెక్కిస్తున్న మూవీ పుష్ప 2. రష్మిక హీరోయిన్‌గా నటించగా, ఫహద్‌ పాజిల్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌ 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. అయితే ఒక రోజు ముందే అంటే డిసెంబర్‌ 5న పుష్ప 2 విడుదల కాబోతుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు.

అంతకు మించి
అల్లు అర్జున్, రష్మికా మందన్నా జంటగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప: ది రైజ్‌’. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించిన ఈ చిత్రం 2021 డిసెంబరు 17న విడుదలై ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘పుష్ప: ది రూల్‌’ తెరకెక్కుతోంది. అయితే పార్ట్‌ 1 సూపర్‌ హిట్‌ కావడంతో పార్ట్‌ 2పై భారీ అంచనాలు పెరిగాయి. దానికి తగ్గట్లుగానే సుకుమార్‌ కూడా కథలో భారీ మార్పులు చేసి.. పార్ట్‌ 1కి మించేలా చిత్రాన్ని తీర్చిదిద్దారట. 

1000 కోట్ల బిజినెస్‌
ఇండియన్‌ సినిమాల్లో ప్రస్తుతం ఏ మూవీకి లేని క్రేజ్‌ పుష్ప 2కి ఉంది. అందుకు నిదర్శనం ఈ చిత్రానికి జరిగిన ప్రీరిలీజ్‌ బిజినెస్‌ అని ట్రేండ్‌ వర్గాలు చెబుతున్నాయి. ట్రేండ్‌ వర్గాల అంచనా ప్రకారం ఈ చిత్రానికి మొత్తంగా రూ. 1000 కోట్ల ప్రీరిలీజ్‌ బిజినెస్‌ జరిగిందట. గతంలో బహుబలి చిత్రానికి మాత్రమే ఇలాంటి బిజినెస్‌ జరిగిందట. ఆ తర్వాత చాలా పాన్‌ ఇండియా సినిమాలు వచ్చినా..రిలీజ్‌కి ముందే రూ. 1000 కోట్ల బిజినెస్‌ మాత్రం కాలేదు. పుష్పరాజ్‌ మాత్రమే బాహుబలితో పోటీ పడ్డాడు. మరి రిలీజ్‌ తర్వాత పుష్ప 2 ఎలాంటి రికార్డులు క్రియేట్‌ చేస్తుందో చూడాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement