విడాకులపై ఎట్టకేలకు నోరు విప్పిన బుల్లితెర నటి.. రాగద్వేషాల వల్లే! | Actress Nidhi Seth Confirms Divorce with Karan Veer Mehra | Sakshi
Sakshi News home page

Karan Veer Mehra- Nidhi Seth Divorce: రెండో భార్యకు నటుడు విడాకులు.. తొలిసారి స్పందించిన నటి!

Oct 25 2023 12:16 PM | Updated on Oct 25 2023 12:47 PM

Actress Nidhi Seth Confirms Divorce with Karan Veer Mehra - Sakshi

మూడు నెలల కిందటే విడాకులు కూడా తీసుకున్నాం.  ఏ బంధంలోనైనా రాగద్వేషాలు, విషపూరిత వాతావరణం ఉండకూడదు. పరస్పర గౌరవం, మానసిక ప్రశాంతత, నిజాయితీ,

రంగుల ప్రపంచంలో రాణించే సెలబ్రటీలు వ్యక్తిగత విషయాల్లో మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరీ ముఖ్యం ప్రేమ-పెళ్లి విషయాల్లో ఎంతోమంది తారలు ఒడిదుడుకులకు లోనవుతున్నారు. ప్రేమించినవారి చేయి పట్టుకుని నడిచినా కొంతకాలానికే మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకుంటున్నారు. ఈ కోవలోకే వస్తుంది బుల్లితెర జంట కరణ్‌ వీర్‌ మెహ్రా- నిధి సేత్‌.

ఏడాది క్రితమే విడిపోయిన జంట
2021 జనవరిలో పెళ్లి చేసుకున్న వీరిద్దరు కొంతకాలానికే తమ దారులు వేరని తెలుసుకున్నారు. ఏడాది కిందటే విడిపోయారు. మూడు నెలల కిందట విడాకులు తీసుకున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. కరణ్‌ వీర్‌ ముంబైలోనే ఉండగా నిధి బెంగళూరులో ఉన్న తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయినట్లు తెలిసింది. తాజాగా తమ విడాకుల విషయాన్ని ఎట్టకేలకు ధృవీకరించింది నిధి సేత్‌.

పెళ్లి చేసుకునేటప్పుడు అవన్నీ తప్పనిసరి
తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'అవును, మేము విడిపోయి దాదాపు ఏడాదవుతోంది. మూడు నెలల కిందటే విడాకులు కూడా తీసుకున్నాం.  ఏ బంధంలోనైనా రాగద్వేషాలు, విషపూరిత వాతావరణం ఉండకూడదు. పరస్పర గౌరవం, మానసిక ప్రశాంతత, నిజాయితీ, ఆర్థిక స్థిరత్వం అనేది వివాహ బంధానికి తప్పనిసరిగా అవసరం' అని చెప్పుకొచ్చింది.

బుల్లితెర నుంచి బాలీవుడ్‌కు
కరణ్‌ వీర్‌ మెహ్రా 2005లో 'రీమిక్స్‌' షోతో బుల్లితెరపై అడుగు పెట్టాడు. 'పవిత్ర రిష్తా' సీరియల్‌లో నటనకుగానూ ప్రశంసలు దక్కించుకున్నాడు. స్మాల్‌ స్క్రీన్‌కే పరిమితం కాకుండా వెండితెరపైనా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. రాగిని ఎమ్‌ఎమ్‌ఎస్‌ 2, మేరే డాడ్‌కీ మారుతి, బ్లడ్‌ మనీ, బద్మాషీయాన్‌, ఆమెన్‌ వంటి పలు చిత్రాల్లో నటించాడు. 

ఆ సీరియల్స్‌తో ఫేమస్‌
ఆయన తన చిన్ననాటి స్నేహితురాలు దేవిక మెహ్రాను ఇదివరకే పెళ్లి చేసుకున్నప్పటికీ 2009లో వీరు విడిపోయారు. తర్వాత తన సహనటి నిధి సేత్‌తో ప్రేమలో పడ్డ ఆయన ఆమెను పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాడు, కానీ ఈ వివాహం కూడా ఎంతో కాలం నిలవలేదు. ఇక నిధి సేత్‌ శ్రీమద్‌ భగ్వత్‌ మహాపురాణ్‌, మేరే డాడ్‌ కీ దుల్హాన్‌, కిస్మత్‌ కా ఖేల్‌ వంటి పలు సీరియల్స్‌లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

చదవండి: ఎవరో ఒకర్ని కొట్టేసి పోతానన్న శివాజీ.. చేతులు కట్టుకుని చూస్తారు మరి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement