మాజీ భార్యతో డేటింగ్‌.. నేను మారిపోయా: నటుడు | Gulshan Devaiah Dating With Ex Wife Kallirroi Tziafeta Says Its A Second Chance, Deets Inside - Sakshi
Sakshi News home page

Gulshan Devaiah: అప్పుడు విడాకులు.. ఇప్పుడు డేటింగ్‌.. 45 ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లి!

Published Fri, Jan 26 2024 1:35 PM | Last Updated on Fri, Jan 26 2024 4:06 PM

Gulshan Devaiah Dating with Ex Wife Kallirroi Tziafeta Says Its a Second Chance - Sakshi

కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి, మేము ఒకరినొకరం ప్రేమించుకుంటున్నాం. మా అనుబంధం ఇప్పటికీ చెక్కు చెదరలేదు.ఇంకా బెటర్‌గా తయారయ్యాం. ఆ విడాకులే మమ్మల్ని ఇలా మెరుగ్గా మార్చిం

2024.. ఈ ఏడాది ప్రారంభమైన రోజు ఎంతోమంది ఎన్నో కలలు కన్నారు. వంట నేర్చుకోవాలి, జిమ్‌కు వెళ్లాలి, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలి, జంక్‌ ఫుడ్‌ మానేయాలి, ధ్యానం చేయాలి, చెడు వ్యసనాలు మానేయాలి.. ఇలా ఎన్నో అనుకుంటారు. కానీ అందులో ఒక్కటంటే ఒక్కటీ సరిగా పాటించరు. అయితే ఈ నటుడు మాత్రం పెద్ద నిర్ణయమే తీసుకున్నాడు. ఈ ఏడాది తన భార్యకు సెకండ్‌ ఛాన్స్‌ ఇద్దామనుకుంటున్నాడు. అదేంటో చదివేయండి..


 

విడాకులిచ్చిన తర్వాత మళ్లీ చిగురించిన ప్రేమ
బాలీవుడ్‌ నటుడు గుల్షాన్‌ దేవయ్య- నటి కలిరోయ్‌ జియాఫెటా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2012లో వైవాహిక జీవితాన్ని ఆరంభించిన వీరు 2020లో విడిపోయారు. అయితే దూరమైన కొంతకాలానికిగానీ వీరి మధ్య ఎంత ప్రేముందో వారికి తెలిసిరాలేదు. అందుకే తమ ప్రేమకు మరో ఛాన్స్‌ ఇచ్చి చూద్దామని భావించారు. విడిపోయిన మూడేళ్లకు మళ్లీ కలిశారు. గతేడాది చివర్లో డేటింగ్‌ మొదలుపెట్టారు. దీని గురించి దేవయ్య మాట్లాడుతూ.. 'ఇప్పటికీ మా అనుబంధం చెక్కు చెదరలేదు. మేము ఒకరినొకరం ప్రేమించుకుంటున్నాం.

ఇప్పుడు మారిపోయాం..
గతంలో ఉన్న పరిస్థితుల వల్ల మేము కలిసి ఉండలేకపోయాం. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి, మేమూ మారిపోయాం. ఇంకా బెటర్‌గా తయారయ్యాం. ఆ విడాకులే మమ్మల్ని ఇలా మెరుగ్గా మార్చింది. ఇప్పుడు నన్ను నేను అర్థం చేసుకున్నాను. ఏది జరిగినా స్వీకరిస్తున్నాను. ఓపికను అలవర్చుకున్నాను. పరిస్థితులను అర్థం చేసుకుని చక్కదిద్దుకుంటున్నాను. అనవసరంగా ఏదేదో ఆలోచించుకుని ఆందోళన చెందడం లేదు. ఇప్పుడు మేము కలిసి రెస్టారెంట్లకు, హాలీడే ట్రిప్పులకు వెళ్తున్నాం' అని చెప్పుకొచ్చాడు. 45 ఏళ్ల వయసున్న ఇతడు కుదిరితే తన మాజీ భార్యను మళ్లీ పెళ్లి చేసుకుంటానని చెప్తున్నాడు.

చదవండి: పెళ్లైన ఏడాదికే విడిపోతామనుకోలేదు.. విడాకులపై తొలిసారి ఓపెన్‌ అయిన నిహారిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement