నెలానెలా అకౌంట్లో డబ్బు పడే ఉద్యోగాన్ని వదిలేసి తనకు ఇష్టమైన నటనను కెరీర్‌గా ఎంచుకున్నాడు హిందీ నటుడు ప్రిన్స్ రోడ్. మొదట్లో బ్యాంక్ ఉద్యోగిగా ఉన్న అతడు రెస్టారెంట్లు పెట్టి బిజినెస్‌మెన్‌గా మారాడు. కానీ నటనవైపు మనసు లాగడంతో అన్నింటికీ ముగింపు పలికి రంగుల ప్రపంచంలోకి రంగప్రవేశం చేశాడు. ఈరోజు(నవంబర్ 24న) ప్రిన్స్ రోడ్ బర్త్‌డే. ఈ సందర్భంగా అతడు తన కెరీర్ ప్రయాణాన్ని వివరించాడు.
ఉద్యోగానికి రాజీనామా
'నా చదువు పూర్తయ్యాక నేను ఢిల్లీలో బ్యాంకు ఉద్యోగం చేశాను. 2009లో ముంబైకు బదిలీ చేశారు. అక్కడకు వెళ్లాక నటుడిని కావాలన్న కోరిక మరింత బలపడింది. ఉద్యోగానికి రాజీనామా చేసి రెండు రెస్టారెంట్లు ప్రారంభించాను. ఓ పక్క ఈ వ్యాపారం చూసుకుంటూ యాక్టింగ్ చేసుకోవచ్చనుకున్నాను. కానీ ఇలా రెండు పడవల ప్రయాణం వర్కవుట్ కాదని తెలుసుకున్నాను. 2018లో రెస్టారెంట్ల బిజినెస్ కూడా వదిలేసి పూర్తిగా సినిమా ఇండస్ట్రీకే పరిమితమయ్యాను. నా వరకు నేను తీసుకుంది మంచి నిర్ణయమే అనుకుంటున్నాను.
ఇతరుల్ని అడుక్కోవాలి..
ఉద్యోగంలోలాగా ఇక్కడ ఇన్ని గంటలు, ఇంతే పని చేయాలి వంటి నియమాలేమీ ఉండవు. రకరకాల పాత్రలు పోషించాలి. ముఖ్యంగా ఈగో పక్కనపెట్టి పని కోసం ఇతరుల్ని అడుక్కోవాలి. వీటన్నింటినీ దాటుకుని వచ్చాను. అయితే నటుడిగా కెరీర్ ఆరంభించాను. కానీ కరోనా విపత్తు సమయంలో రచయితగా మారాను. ఎన్నో కథలు, స్క్రిప్టులు రాశాను. వాటిని ఓటీటీకి ఇచ్చాను' అని చెప్పుకొచ్చాడు. కాగా ప్రిన్స్ రోడ్.. చాన్స్ పే డ్యాన్స్ సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చాడు. దిల్ సే దిల్ తక్ అనే టీవీ షోలోనూ కనిపించాడు. ద షోలే గర్ల్, మంఘదంత్ వంటి ప్రాజెక్టులతో ఓటీటీలోనూ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం అతడి చేతిలో మూడు వెబ్‌సిరీస్‌లు ఉన్నాయి.
చదవండి: సోదర బంధం గొప్పది.. కానీ ఈగో ఉండొద్దు.. ఎవరో ఒకరు తగ్గాలి..
Comments
Please login to add a commentAdd a comment