మూడో పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఏమైనా..? | The Great Indian Kapil Show: Aamir Khan About Settling Down After 2 Marriages | Sakshi
Sakshi News home page

Aamir Khan: మూడో పెళ్లి గురించి ప్రశ్న.. స్టార్‌ హీరో ఆన్సరిదే..!

Published Thu, Apr 25 2024 5:31 PM | Last Updated on Thu, Apr 25 2024 5:35 PM

The Great Indian Kapil Show: Aamir Khan About Settling Down After 2 Marriages - Sakshi

ఇండస్ట్రీలో రెండు పెళ్లిళ్లు అనేవి కామన్‌ అయిపోయాయి. బాలీవుడ్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌ సైతం రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు.. ఇద్దరికీ విడాకులిచ్చాడు. మొదట 1986లో రీనా దత్తాను వివాహం చేసుకున్నాడు. వీరికి జునైద్‌ అనే కుమారుడు, ఇరా ఖాన్‌ అనే కూతురు సంతానం. అంతా బానే ఉందనుకున్న సమయంలో 2002లో ఆమిర్‌ దంపతులు విడాకులు తీసుకున్నారు.

విడాకులు
2005లో ఆమిర్‌.. కిరణ్‌ రావును పెళ్లాడాడు. సరోగసి ద్వారా ఆజాద్‌ రావు అనే కుమారుడికి పేరెంట్స్‌ అయ్యారు. కానీ ఈ బంధమూ ఎంతోకాలం నిలవలేదు. 2021లో విడిపోయారు. ఇద్దరు భార్యలతో వైవాహిక బంధాన్ని తెంచుకున్నప్పటికీ స్నేహ బంధాన్ని మాత్రం కొనసాగిస్తున్నాడు. ఎటువంటి గొడవలు, చికాకులు లేకుండా ఇప్పటికీ ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించుకుంటారు. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న ద గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ షోకి ఆమిర్‌ హాజరయ్యాడు.

షోలో ఆమిర్‌
ఈ మేరకు ఓ ప్రోమో వదిలారు. ఇందులో ఆమిర్‌ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తను నటించిన లాల్‌ సింగ్‌ చద్దా, థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌.. రెండు సినిమాలూ వర్కవుట్‌ కాలేదన్నాడు. అక్కడున్న హోస్ట్‌ కపిల్‌ శర్మ.. అవి పెద్దగా ఆకట్టుకోకపోయినా ఇప్పుడు రిలీజ్‌ చేసే సినిమాల బిజినెస్‌ మాత్రం బాగానే జరుగుతోంది కదా అని పంచ్‌ వేశాడు.

టైం వేస్ట్‌!
ఇంతలో అర్చన పూరన్‌ సింగ్‌ మాట్లాడుతూ.. అవార్డు షోలకు ఎందుకు రారని ప్రశ్నించింది. ఇందుకు ఆమిర్‌.. సమయం చాలా విలువైనది.. ప్రతి ఒక్కరూ దాన్ని కచ్చితంగా వాడుకోవాలి అని చెప్పుకొచ్చాడు. ఇంతలో కపిల్‌.. సెటిల్‌ అవుదామని అనుకోవడం లేదా? అంటూ పరోక్షంగా మూడో పెళ్లి గురించి ప్రస్తావించాడు. అందుకు ఆమిర్‌ పెద్దగా నవ్వేసి ఊరుకున్నాడు. ప్రస్తుతం ఆమిర్‌ లాహోర్‌ 1947 అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

 

 

చదవండి: పెద్ద కూతురి పెళ్లి.. ఫోటోలు షేర్‌ చేసిన దర్శకనటుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement