
బాలీవుడ్ టెలివిజన్ నటుడు రితురాజ్ సింగ్ గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని అతని సన్నిహితుడు నటుడు అమిత్ బెహ్ల్ ధృవీకరించారు. నివేదిక ప్రకారం, రితురాజ్ సోమవారం రాత్రి మరణించాడు. ప్యాంక్రియాటిక్ (కాలేయ క్యాన్సర్) వ్యాధితో బాధపడుతున్న ఆయన ఇటీవల ఆసుపత్రిలో చేరారు.
ప్యాంక్రియాటిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్న రితురాజ్ సింగ్ కొద్దిరోజుల క్రితం ఆసుపత్రిలో చికిత్స తీసుకుని చేరుకున్నాడు. అనంతరం గుండెపోటుతో మరణించాడని ఆయన స్నేహితుడు అమిత్ తెలిపాడు. అప్పటికే ఆయనకు గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆపై ప్యాంక్రియాటిక్ సమస్య కూడా ఉండటంతో ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు ఆయన పేర్కొన్నాడు.
రితురాజ్ బాలీవుడ్‌లో అనేక సీరియల్స్‌తో పాటు సినిమాల్లో కూడా నటించారు. బనేగీ అప్నీ బాత్, జ్యోతి, హిట్లర్ దీదీ, షపత్, వారియర్ హై, ఆహత్, అదాలత్, దియా ఔర్ బాతీ హమ్ వంటి అనేక వాటిలో నటించారు. గతేడాదిలో వచ్చిన అజిత్ (తెగింపు) చిత్రంలో కూడా ఆయన నటించాడు.