పెళ్లి చేసుకున్న బుల్లితెర జంట.. ఇద్దరికీ రెండోదే! | Karan Sharma, Pooja Singh are Married for Second Time | Sakshi
Sakshi News home page

సీరియల్‌ స్టార్స్‌ రెండో పెళ్లి.. ఇది నా అదృష్టమంటూ నటి పోస్ట్‌

Published Mon, Apr 1 2024 6:21 PM | Last Updated on Mon, Apr 1 2024 7:30 PM

Karan Sharma, Pooja Singh are Married for Second Time - Sakshi

పెళ్లి తర్వాత పూజ మాట్లాడుతూ.. కరణ్‌ భర్తగా దొరకడం తన అదృష్టమని ఉప్పొంగిపోయింది.

బుల్లితెర నటుడు కరణ్‌ శర్మ, పూజా సింగ్‌ పెళ్లి పీటలెక్కారు. మార్చి 30న ముంబైలో వివాహం చేసుకున్నారు. ఇరు కుటుంబసభ్యులు సహా బంధుమిత్రుల సమక్షంలో ఈ వివాహం జరిగింది. బుల్లితెర తారలు సైతం పెళ్లిలో తెగ హడావుడి చేశారు. తమ పెళ్లి విషయాన్ని కొత్త జంట ఏప్రిల్‌ 1న సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ శర్మ అంటూ భర్తను ముద్దాడుతున్న ఫోటోలు షేర్‌ చేసింది పూజా సింగ్‌.

ఏళ్ల తరబడి ఒకే సంస్థలో..
ఈ సెలబ్రిటీ జంట పెళ్లి వేడుకలు మార్చి 29 నుంచే మొదలయ్యాయి. హల్దీ, మెహందీ, సంగీత్‌ ఫంక్షన్స్‌ గ్రాండ్‌గా నిర్వహించారు. ఇద్దరూ ఒకే ‍నిర్మాణ సంస్థలో ఏళ్ల తరబడి పని చేస్తున్నా ఎప్పుడూ పెద్దగా మాట్లాడుకుందే లేదు. కానీ ఓ మ్యూచువల్‌ ఫ్రెండ్‌ ద్వారా గతేడాది డిసెంబర్‌లో కలుసుకున్నారు. ఆ పరిచయమే ఏడడుగుల బంధానికి దారి తీసింది. పెళ్లి తర్వాత పూజ మాట్లాడుతూ.. కరణ్‌ భర్తగా దొరకడం తన అదృష్టమని ఉప్పొంగిపోయింది.

అద్భుతంగా సాగాలి
కరణ్‌ మాట్లాడుతూ.. బ్యాచిలర్‌ లైఫ్‌ నుంచి వివాహ బంధంలోకి అడుగుపెట్టాను. ఈ ప్రయాణం అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నానన్నాడు. కాగా ఇతడు సాసురాల్‌ సిమర్‌ కా 2, ఉదారియాన్‌, మోహి, ఏక్‌ నహీ పెంచాన్‌ వంటి సీరియల్స్‌తో పాపులర్‌ అయ్యాడు. పూజ.. దియా ఔర్‌ బాతీ హమ్‌, తేరే ఇష్క్‌ మే ఘాయల్‌, శక్తి: అస్తిత్వ కే ఎసాస్‌ వంటి సీరియల్స్‌తో ప్రేక్షకులకు దగ్గరైంది. ఈమె గతంలో కపిల్‌ చట్టానీని పెళ్లి చేసుకుంది. 2017లో ఆమె పెళ్లి జరగ్గా 2021లో విడిపోయారు. కరణ్‌ కూడా గతంలో టియారా ఖర్‌ను పెళ్లాడాడు. కానీ ఈ బంధం ఎంతోకాలం నిలవలేదు. 2016లో పెళ్లవగా నాలుగేళ్లకే విడిపోయారు.

చదవండి: బాడీ షేమింగ్‌.. ఎంత క్షోభ అనుభవించానో నాకు మాత్రమే తెలుసు: హీరోయిన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement