Karan Sharma
-
పెళ్లి చేసుకున్న బుల్లితెర జంట.. ఇద్దరికీ రెండోదే!
బుల్లితెర నటుడు కరణ్ శర్మ, పూజా సింగ్ పెళ్లి పీటలెక్కారు. మార్చి 30న ముంబైలో వివాహం చేసుకున్నారు. ఇరు కుటుంబసభ్యులు సహా బంధుమిత్రుల సమక్షంలో ఈ వివాహం జరిగింది. బుల్లితెర తారలు సైతం పెళ్లిలో తెగ హడావుడి చేశారు. తమ పెళ్లి విషయాన్ని కొత్త జంట ఏప్రిల్ 1న సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. మిస్టర్ అండ్ మిసెస్ శర్మ అంటూ భర్తను ముద్దాడుతున్న ఫోటోలు షేర్ చేసింది పూజా సింగ్. ఏళ్ల తరబడి ఒకే సంస్థలో.. ఈ సెలబ్రిటీ జంట పెళ్లి వేడుకలు మార్చి 29 నుంచే మొదలయ్యాయి. హల్దీ, మెహందీ, సంగీత్ ఫంక్షన్స్ గ్రాండ్‌గా నిర్వహించారు. ఇద్దరూ ఒకే నిర్మాణ సంస్థలో ఏళ్ల తరబడి పని చేస్తున్నా ఎప్పుడూ పెద్దగా మాట్లాడుకుందే లేదు. కానీ ఓ మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా గతేడాది డిసెంబర్లో కలుసుకున్నారు. ఆ పరిచయమే ఏడడుగుల బంధానికి దారి తీసింది. పెళ్లి తర్వాత పూజ మాట్లాడుతూ.. కరణ్ భర్తగా దొరకడం తన అదృష్టమని ఉప్పొంగిపోయింది. అద్భుతంగా సాగాలి కరణ్ మాట్లాడుతూ.. బ్యాచిలర్ లైఫ్ నుంచి వివాహ బంధంలోకి అడుగుపెట్టాను. ఈ ప్రయాణం అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నానన్నాడు. కాగా ఇతడు సాసురాల్ సిమర్ కా 2, ఉదారియాన్, మోహి, ఏక్ నహీ పెంచాన్ వంటి సీరియల్స్‌తో పాపులర్ అయ్యాడు. పూజ.. దియా ఔర్ బాతీ హమ్, తేరే ఇష్క్ మే ఘాయల్, శక్తి: అస్తిత్వ కే ఎసాస్ వంటి సీరియల్స్‌తో ప్రేక్షకులకు దగ్గరైంది. ఈమె గతంలో కపిల్ చట్టానీని పెళ్లి చేసుకుంది. 2017లో ఆమె పెళ్లి జరగ్గా 2021లో విడిపోయారు. కరణ్ కూడా గతంలో టియారా ఖర్ను పెళ్లాడాడు. కానీ ఈ బంధం ఎంతోకాలం నిలవలేదు. 2016లో పెళ్లవగా నాలుగేళ్లకే విడిపోయారు. View this post on Instagram A post shared by Pooja Singh (@poojaa_singh_) View this post on Instagram A post shared by Jigyasa Singh (@jigyasa_07) చదవండి: బాడీ షేమింగ్.. ఎంత క్షోభ అనుభవించానో నాకు మాత్రమే తెలుసు: హీరోయిన్ -
Surbhi Chandna: పెళ్లి ఫోటోలు షేర్ చేసిన నాగిన్ నటి (ఫోటోలు)
-
ప్రియుడిని పెళ్లాడిన నటి సురభి చందన (ఫొటోలు)
-
13 ఏళ్ల ప్రేమ.. మూడుముళ్ల బంధంగా మారిన వేళ..
బుల్లితెర నటి సురభి చందన పెళ్లిపీటలెక్కింది. ప్రియుడు కరణ్ శర్మతో ఏడడుగులు వేసింది. 13 ఏళ్ల ప్రేమ బంధాన్ని పెళ్లితో పదిలపర్చుకుంది. జైపూర్‌లో ఎంతో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. జనవరిలో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ వేడుకకు కొత్త జంట సిల్వర్ కలర్ డ్రెస్సులను ఎంచుకున్నారు. డ్యాన్స్ చేస్తూ స్టేజీపైకి.. పెళ్లిలో ఓ రొమాంటిక్ పాట ప్లే అవుతుండగా తను కూడా ఆ పాట పాడుతూ, డ్యాన్స్ చేస్తూ వరుడివైపు తన్మయత్వంతో అడుగులు వేసింది సురభి. పెళ్లికి ముందు తన స్నేహితులకు బ్యాచిలరేట్ పార్టీ కూడా ఇచ్చిందీ బ్యూటీ. కాగా సురభి 'తారక్ మెహతా కా ఉల్టా చష్మా'లో అతిథి పాత్రలో మెరిసింది. 'ఖుబూల్ హై' సీరియల్లో ప్రధాన పాత్రలో నటించింది. సీరియల్స్ ద్వారా గుర్తింపు 'ఇష్క్బాజ్', 'సంజీవని', 'నాగిన్ 5', 'హునర్బాజ్: దేశ్ కీ షాన్' ఇలా పలు ధారావాహికల్లో నటించింది. బాబీ జాసూస్ చిత్రంతో వెండితెరపై తళుక్కుమని మెరిసింది. కరణ్ శర్మ విషయానికి వస్తే 'యే రిష్తా క్యా కెహ్లాతా హై', 'పవిత్ర రిష్తా' వంటి సీరియల్స్‌తో గుర్తింపు పొందాడు. ప్రస్తుతం 'ఉదారియన్' అనే సీరియల్ చేస్తున్నాడు. View this post on Instagram A post shared by SURBHI CHANDNA & KARAN SHARMA❤️😍🧿 (@sukarlove_) View this post on Instagram A post shared by SURBHI CHANDNA & KARAN SHARMA❤️😍🧿 (@sukarlove_) -
పండక్కి గుడ్‌న్యూస్ చెప్పిన బుల్లితెర బ్యూటీ
బుల్లితెర నటి సురభి చందన గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్లు ప్రకటించింది. 13 ఏళ్లుగా ప్రియుడు, నటుడు కరణ్ శర్మతో డేటింగ్లో ఉన్న ఆమె అతడితో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నట్లు వెల్లడించింది. సంక్రాంతి సందర్భంగా ఈ శుభవార్తను అభిమానులతో పంచుకుంది. పెళ్లెప్పుడు? ఎక్కడ? అనే వివరాలను పూర్తిగా ప్రకటించలేదు. పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు అయితే ఆమెకు పెళ్లవబోతున్న విషయాన్ని సురభి పెంపుడు కుక్క చెప్తున్నట్లుగా మై హ్యూమన్స్ ఆర్ గెటింగ్ మారీడ్ (నా మనుషులు పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు) అని రాసి ఉన్న బోర్డు ముందు దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. 13 ఏళ్ల ప్రేమను పెళ్లి బంధంతో పదిలం చేసుకోబోతున్న ఈ ప్రేమజంటకు అభిమానులు శుభాకాంక్షలు చెప్తున్నారు. కాగా సురభి హిందీ సూపర్ హిట్ సీరియల్ 'తారక్ మెహతా కా ఉల్టా చష్మా'లో అతిథి పాత్రలో మెరిసింది. 'ఖుబూల్ హై' సీరియల్లో ప్రధాన పాత్రలో నటించింది. ఇద్దరికీ సీరియల్స్ ద్వారానే క్రేజ్ 'ఇష్క్బాజ్', 'సంజీవని', 'నాగిన్ 5', 'హునర్బాజ్: దేశ్ కీ షాన్', 'షెర్డిల్ షెర్గిల్' సీరియల్స్‌లో నటించింది. 'బాబీ జాసూస్' అనే హిందీ మూవీలో అతిథి పాత్రలో మెరిసింది. ఇది ఆమె వెండితెరపై నటించిన ఏకైక సినిమా! కరణ్ శర్మ విషయానికి వస్తే ఇతడు కూడా చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో నటుడిగా రాణిస్తున్నాడు. 'యే రిష్తా క్యా కెహ్లాతా హై', 'పవిత్ర రిష్తా' వంటి సీరియల్స్‌తో గుర్తింపు పొందాడు. ప్రస్తుతం 'ఉదారియన్' అనే సీరియల్ చేస్తున్నాడు. View this post on Instagram A post shared by Surbhi Chandna (@officialsurbhic) చదవండి: సంక్రాంతి రేసులో ఏడుసార్లు.. ఎన్ని హిట్సో తెలుసా? -
వారెవ్వా గిల్ ఆవిషయంలో ధోని తరువాత ఇతనే..
-
ఈసారి కప్ RCB డే ఎందుకంటే?
-
ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడలేదు.. కానీ రెండు టైటిల్స్.. ఐపీఎల్లో మోస్ట్ లక్కీ ప్లేయర్..!
టీమిండియా స్పిన్నర్ కరణ్ శర్మకు ఐపీఎల్లో అత్యంత అదృష్టవంతమైన ఆటగాడిగా పేరుంది. అతడు ఏ జట్టులో ఉంటే ఆ జట్టుదే టైటిల్ అని అంతా భావిస్తారు. గత ఐదు సీజన్లలో మూడు సార్లు ఛాంపియన్స్‌గా నిలిచిన జట్టులో సభ్యుడిగా కరణ్ శర్మ ఉన్నాడు. అయితే ఈ సారి మాత్రం అతడి అదృష్టం ఆర్సీబీకి కలిసి రాలేదు. ఐపీఎల్-2022లలో ఆర్సీబీకి కరణ్ ప్రాతినిధ్యం వహించాడు. ఈ ఏడాది సీజన్లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌లోనే ఇంటిముఖం పట్టింది. ఇది ఇలా ఉండగా.. ఐపీఎల్లో కరణ్ శర్మ కంటే అదృష్టవంతమైన మరో ఆటగాడు ఉన్నాడు. అతడే వెస్టిండీస్ యువ పేసర్ డొమినిక్ డ్రాక్స్. కరణ్ శర్మ కనీసం ఒకటో,రెండో మ్యాచ్‌లు ఆడి టైటిల్స్ గెలిస్తే.. డ్రాక్స్ మాత్రం ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడకుండా రెండు సార్లు ఛాంపియన్స్‌గా నిలిచిన జట్టులో భాగమయ్యాడు. ఐపీఎల్-2021లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన డ్రాక్స్కు ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం రాలేదు. అయితే గతేడాది ఛాంపియన్స్‌గా సీఎస్కే నిలిచింది. అదే విధంగా ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడిన డ్రాక్స్.. అన్నీ మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ ఏడాది సీజన్లో గుజరాత్ టైటాన్స్ విజేతగా నిలిచింది. చదవండి: Sachin Tendulkar Best XI Of IPL 2022: ఐపీఎల్ అత్యుత్తమ జట్టు ప్రకటన.. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మకు నో ఛాన్స్..! -
వచ్చే ఏడాది ఈ ఆటగాళ్లకు ఆర్సీబీ గుడ్‌బై..!
ఐపీఎల్-2022లో రాయల్ ఛాలంజెర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్‌లో ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది సీజన్లో ఫాఫ్ డుప్లెసిస్ నూతన సారథ్యంలో ఆర్సీబీ అద్భుతంగా రాణించింది. ఇది ఇలా ఉండగా.. వచ్చే ఏడాది సీజన్‌కు ముందు ఆర్సీబీ మేనేజ్మెంట్ కొంతమంది ఆటగాళ్లను విడుదల చేసే అవకాశం ఉంది. ఆర్సీబీ విడుదల చేసే ఛాన్స్ ఉన్న ఆటగాళ్లను ఓ సారి పరిశీలిద్దాం. సిద్దార్థ్ కౌల్ ఐపీఎల్-2022 మెగా వేలంలో సిద్దార్థ్ కౌల్‌ను రూ. 75 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే ఈ ఏడాది సీజన్లో కౌల్ ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన కౌల్.. వికెట్లు ఏమి సాధించకుండా 43 పరుగులు ఇచ్చాడు. కాబట్టి వచ్చే ఏడాది సీజన్‌కు ముందు సిద్దార్థ్ కౌల్‌ను ఆర్సీబీ విడిచి పెట్టే అవకాశం ఉంది. కాగా ఆర్సీబీ పేస్ అటాక్‌లో జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్,హర్షల్ పటేల్ వంటి బౌలర్లు ఉండటంతో కౌల్ చోటు దక్కలేదు. డేవిడ్ విల్లీ ఐపీఎల్-2022 మెగా వేలంలో డేవిడ్ విల్లీని ఆర్సీబీ రూ. 2 కోట్లకు దక్కించుకుంది. కాగా టోర్నీ ఆరంభ మ్యాచ్‌లకు గ్లెన్ మాక్స్వెల్ అందుబాటులో లేకపోవడంతో విల్లీకి తుది జట్టులో చోటు దక్కింది. అయితే అతడు ఆ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోలేకపోయాడు. నాలుగు మ్యాచ్‌లు ఆడిన విల్లీ 18 పరుగులతో పాటు ఒకే ఒక్క వికెట్ సాధించాడు. ఇక మాక్స్వెల్ వచ్చాక విల్లీకి తుది జట్టులో చోటు దక్కలేదు. కాగా ప్లేయింగ్ ఎలెవన్‌లో నాలుగురు విదేశీ ఆటగాళ్లు మాత్రమే అవకాశం ఉన్నందున.. తదుపరి సీజన్‌కు ముందు ఆర్సీబీ విడుదల చేసే అవకాశం ఉంది. కరణ్ శర్మ ఐపీఎల్-2022 మెగా వేలంలో కరణ్ శర్మను రూ. 50 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే ఈ ఏడాది సీజన్లో ఒక్క మ్యాచ్‌లో కూడా కరణ్ శర్మకు తుది జట్టులో చోటు దక్కలేదు. ఈ సీజన్లో అన్ని మ్యాచ్‌లకు శ్రీలంక యువ స్పిన్నర్ వనిందు హసరంగాకే ఆర్సీబీ ఛాన్స్ ఇచ్చింది. అదే విధంగా పార్ట్‌టైమ్ స్పిన్నర్స్‌గా మాక్స్వెల్, షబాజ్ ఆహ్మద్ ఉన్నారు. కాబట్టి అతడిని వచ్చే ఏడాది సీజన్ ముందు ఆర్సీబీ విడిచి పెట్టనుంది. చదవండి: Hardik Pandya: 'ఫైనల్ మ్యాచ్‌లు నాకు కలిసొచ్చాయి.. గుజరాత్ టైటాన్స్‌దే కప్' -
రికీ భుయ్ అజేయ సెంచరీ
సాక్షి, విశాఖపట్నం: మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ పట్టుదలతో పోరాడటంతో... పంజాబ్‌తో జరుగుతోన్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు పుంజుకుంది. రికీ భుయ్ (291 బంతుల్లో 151 బ్యాటింగ్; 13 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ సెంచరీకి తోడు... కేఎస్ భరత్ (175 బంతుల్లో 76; 6 ఫోర్లు, 1 సిక్స్), సుమంత్ (124 బంతుల్లో 54; 5 ఫోర్లు, 1 సిక్స్) కూడా బాధ్యతాయుతంగా ఆడటంతో శనివారం ఆట ముగిసే సమయానికి ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది. రోజంతా బౌలింగ్ చేసిన పంజాబ్ కేవలం 2 వికెట్లు మాత్రమే పడగొట్టింది. ఓవర్‌నైట్ స్కోరు 54/3తో మూడో రోజు ఆట కొనసాగించిన ఆంధ్ర జట్టును కేఎస్ భరత్‌తో కలిసి భుయ్ ఆదుకున్నాడు. ఈ జోడీ కుదురుకునే వరకు జాగ్రత్తగా ఆడి ఆ తర్వాత ఎదురుదాడి చేసింది. ఈ క్రమంలో నాలుగో వికెట్‌కు 151 పరుగులు జోడించాక మయాంక్ మార్కండే (3/96) బౌలింగ్‌లో భరత్ ఔటయ్యాడు. ఆ తర్వాత సుమంత్‌తో కలిసి భుయ్ ఐదో వికెట్‌కు 132 పరుగులు జోడించాడు. ప్రస్తుతం అతని పాటు కరణ్ శర్మ (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. పంజాబ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు (414)కు ఆంధ్ర ఇంకా 86 పరుగుల దూరంలో ఉంది. మ్యాచ్‌కు ఆదివారం చివరి రోజు. హైదరాబాద్ 30/1 కేరళ, హైదరాబాద్ జట్ల మధ్య తిరువనంతపురంలో జరుగుతోన్న మరో మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించింది. దీంతో మూడో రోజు 20 ఓవర్లు మాత్రమే సాధ్యమయ్యాయి. ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 30 పరుగులు చేసింది. అక్షత్ రెడ్డి (3) త్వరగా ఔటయ్యాడు. తన్మయ్ (24 బ్యాటింగ్; 4 ఫోర్లు), రోహిత్ రాయుడు (3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. -
ఆంధ్ర తడబాటు
సాక్షి, విశాఖపట్నం: మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ సన్వీర్ సింగ్ (110; 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీకి తోడు మయాంక్ మార్కండే (68 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) అజేయ అర్ధశతకంతో చెలరేగడంతో ఆంధ్రతో జరుగుతోన్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో పంజాబ్ తొలి ఇన్నింగ్స్‌లో 414 పరుగులు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 261/6తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన పంజాబ్ మరో 153 పరుగులు జోడించి మిగిలిన 4 వికెట్లు కోల్పోయింది. ఆంధ్ర బౌలర్లలో బండారు అయ్యప్ప, కరణ్ శర్మ మూడేసి వికెట్లు పడగొట్టగా... విజయ్ కుమార్, షోయబ్ ఖాన్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆంధ్ర జట్టు తడబడింది. కెప్టెన్ హనుమ విహారి (19), ప్రశాంత్ (1), అశ్విన్ హెబర్ (17) త్వరగా ఔట్ కావడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర 26 ఓవర్లలో 3 వికెట్లకు 54 పరుగులు చేసింది. ప్రస్తుతం రికీ భుయ్ (12 బ్యాటింగ్), కేఎస్ భరత్ (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. సచిన్ బేబీ, జగదీశ్ సెంచరీలు... తిరువనంతపురం: పేసర్ సిరాజ్ గైర్హాజరీలో హైదరాబాద్ బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో కేరళ భారీ స్కోరు చేసింది. సచిన్ బేబీ (147; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), జగదీశ్ (113 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) శతకాలతో చెలరేగడంతో కేరళ 495/6 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 231/4తో శుక్రవారం ఇన్నింగ్స్ కొనసాగించిన కేరళ సచిన్, జగదీశ్ సెంచరీలకు తోడు అక్షయ్ చంద్రన్ (48 నాటౌట్; 5 ఫోర్లు) రాణించడంతో భారీ స్కోరు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో సాకేత్ సాయిరామ్ 3, మెహదీ హసన్ 2, రవితేజ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన హైదరాబాద్ శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఒక ఓవర్లో వికెట్ నష్టపోకుండా 1 పరుగు చేసింది. తన్మయ్ (1 బ్యా టింగ్), అక్షత్‌రెడ్డి (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. -
ఆంధ్రను గెలిపించిన కరణ్ శర్మ
న్యూఢిల్లీ: విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్లో ఆంధ్ర జట్టు ఖాతాలో మూడో విజయం చేరింది. మధ్యప్రదేశ్‌తో బుధవారం జరిగిన ఎలైట్ గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర రెండు వికెట్ల తేడాతో గెలిచింది. ఆంధ్ర జట్టుకు ఆడుతోన్న భారత క్రికెటర్ కరణ్ శర్మ (29 బంతుల్లో 55; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. తొలుత మధ్యప్రదేశ్ 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 248 పరుగులు సాధించింది. అశుతోష్ సింగ్ (110; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ... మనోజ్ సింగ్ (62; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించారు. ఆంధ్ర బౌలర్లలో శివ, షోయబ్, కరణ్ శర్మ రెండేసి వికెట్లు తీశారు. 249 పరుగుల లక్ష్యాన్ని ఆంధ్ర జట్టు సరిగ్గా 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి అధిగమించింది. ఓపెనర్లు అశ్విన్ హెబర్ (53; 8 ఫోర్లు, సిక్స్), కోన శ్రీకర్ భరత్ (30) తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించారు. మిడిల్ ఆర్డర్లో డీబీ రవితేజ (53; 4 ఫోర్లు, సిక్స్) రాణించాడు. ఒకదశలో ఆంధ్ర 160 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడినా... రవితేజ, కరణ్ శర్మ ఏడో వికెట్‌కు 74 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దారు. విజయానికి 4 పరుగుల దూరంలో... మూడు బంతులు మిగిలి ఉండగా కరణ్ ఔటైనా... శివ (3 నాటౌట్) ఆఖరి బంతికి జట్టును విజయతీరానికి చేర్చాడు. -
కరణ్ శర్మ 5/22
సాక్షి, విశాఖపట్నం: న్యూజిలాండ్ ‘ఎ’తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భారత్ ‘ఎ’ 1–0తో ముందంజ వేసింది. బుధవారం జరిగిన మూడో డే నైట్ వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్ జట్టు 37.1 ఓవర్లలో 143 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ నికోల్స్ (35) టాప్ స్కోరర్ కాగా... మున్రో (29) కొద్దిగా పోరాడాడు. భారత లెగ్‌స్పిన్నర్ కరణ్ శర్మ 22 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టడం విశేషం. అనంతరం భారత్ 24.4 ఓవర్లలో 4 వికెట్లకు 144 పరుగులు చేసి విజయాన్నందుకుంది. పృథ్వీ షా (6), మయాంక్ (8), శ్రీవత్స్ (9) విఫలం కావడంతో ఒక దశలో భారత్ 23 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అయితే విజయ్ శంకర్ (47 నాటౌట్), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (37), దీపక్ హుడా (35 నాటౌట్) కలిసి జట్టును గెలిపించారు. అయ్య ర్తో నాలుగో వికెట్‌కు 64 పరుగులు జోడించిన విజయ్ శంకర్, ఐదో వికెట్‌కు హుడాతో 57 పరుగులు జత చేశాడు. ఇరు జట్ల మధ్య తొలి వన్డే రద్దు కాగా, రెండో మ్యాచ్ ‘టై’గా ముగిసింది. నాలుగో వన్డే శుక్రవారం జరుగుతుంది. -
భారత్ ‘ఎ’ మరో ఇన్నింగ్స్ విజయం
సాక్షి, విజయవాడ: భారత ‘ఎ’ బౌలర్ల ముందు న్యూజిలాండ్ ‘ఎ’ బ్యాట్స్‌మెన్ ఎదురునిలువలేకపోయారు. కనీసం ‘డ్రా’తో గట్టెక్కాలన్నా... కివీస్ బ్యాట్స్‌మెన్ విశేషంగా రాణించాల్సిన చోట చేతులెత్తేశారు. ఫలితంగా రెండో టెస్టులో భారత్ ‘ఎ’ ఇన్నింగ్స్ 26 పరుగుల తేడాతో గెలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 104/1తో ఆట చివరిరోజు మంగళవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ ‘ఎ’ జట్టు 79.3 ఓవర్లలో 210 పరుగులకు ఆలౌటైంది. భారత ‘ఎ’ స్పిన్నర్లు కరణ్ శర్మ (5/78), షాబాజ్ నదీమ్ (4/41) కివీస్ ఇన్నింగ్స్‌ను దెబ్బతీయగా... మరో వికెట్ పేసర్ శార్దుల్ ఠాకూర్‌కు దక్కింది. ఒక దశలో 158/2తో పటిష్టంగానే కనిపించిన కివీస్ ఆ తర్వాత భారత స్పిన్నర్ల ధాటికి మిగతా ఎనిమిది వికెట్లను 52 పరుగుల తేడాతో కోల్పోయింది. కెప్టెన్ హెన్రీ నికోల్స్ (190 బంతుల్లో 94; 11 ఫోర్లు, ఒక సిక్స్) త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఈ విజయంతో భారత్ రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. ఇక్కడే జరిగిన తొలి టెస్టులో భారత్ ‘ఎ’ ఇన్నింగ్స్ 31 పరుగుల తేడాతో గెలిచింది. ఈ రెండు జట్ల మధ్య ఐదు అనధికారిక వన్డే మ్యాచ్‌ల సిరీస్ ఈనెల 6న ఇదే వేదికపై మొదలవుతుంది. సంక్షిప్త స్కోర్లు న్యూజిలాండ్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్: 211; భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్: 447; న్యూజిలాండ్ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్: 210 (జీత్ రావల్ 47, నికోల్స్ 94; నదీమ్ 4/41, కరణ్ శర్మ 5/78). -
72/0 నుంచి 147 ఆలౌట్
సాక్షి, విజయవాడ: స్పిన్నర్లు షాబాజ్ నదీమ్, కరణ్ శర్మ న్యూజిలాండ్ ‘ఎ’ ఇన్నింగ్స్‌ను తొలి రోజే కుప్పకూల్చారు. దీంతో శనివారం మొదలైన తొలి అనధికారిక టెస్టులో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 63 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌటైంది. ఏసీఏ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న ఈ నాలుగు రోజుల టెస్టులో ఒక దశలో 72 పరుగుల వరకు ఒక్క వికెట్ కూడా కోల్పోని కివీస్‌ను భారత్ ‘ఎ’ బౌలర్లు అనూహ్యంగా దెబ్బ మీద దెబ్బతీశారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ నదీమ్ (4/39), లెగ్ స్పిన్నర్ కరణ్ శర్మ (4/58) చెరో నాలుగు వికెట్లు తీయగా, హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ 2 కీలక వికెట్లు పడగొట్టాడు. కివీస్ బ్యాట్స్‌మెన్‌లో జార్జ్ వొర్కర్ 33, జీత్ రావల్ 34 పరుగులు చేశారు. తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆడిన భారత్ ‘ఎ’ మొదటి రోజు ఆట నిలిచే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 71 పరుగులు చేసింది. రవికుమార్ సమర్థ్ (38 బ్యాటింగ్), కరుణ్ నాయర్ (7 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు -
కుర్రాళ్లపైనా... కాసుల వర్షం!
స్పిన్నర్ కరణ్ శర్మకు జాక్‌పాట్ రూ. 3.75 కోట్లకు సన్‌రైజర్స్ సొంతం రిషి ధావన్‌కు రూ. 3 కోట్లు వెచ్చించిన పంజాబ్ టేలర్‌ను కరుణించిన ఢిల్లీ పెద్దగా అనుభవం లేకపోయినా... ఆటలో నైపుణ్యం ఉన్న కుర్రాళ్ల కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించాయి. రెండో రోజు జరిగిన వేలంలోనూ... జాతీయ, అంతర్జాతీయ స్టార్లతో సమానంగా దేశవాళీ ఆటగాళ్ల కోసం మంచినీళ్ల ప్రాయంగా డబ్బును ఖర్చు చేశాయి. దాదాపు తొమ్మిది మంది అన్క్యాప్డ్ ప్లేయర్లకు ఒక్కొక్కరికి కోటి రూపాయలకుపైగా చెల్లించి ఔరా అనిపించాయి. కళ్లు బైర్లుకమ్మే రీతిలో ఆల్‌రౌండర్ కరణ్ శర్మ జాక్‌పాట్ కొట్టేస్తే... రిషి ధావన్ అంచనాలను మించిపోయాడు. మొత్తానికి కుబేరునికి కూడా అసూయ పుట్టేలా నోట్ల కట్టలతో క్రికెట్ ఆడుకున్నారు. బెంగళూరు: అంతర్జాతీయ స్టార్లపై పెద్దగా ఆసక్తి చూపని ఫ్రాంచైజీలు.. దేశవాళీ కుర్రాళ్లపై మాత్రం కాసుల వర్షం కురిపించాయి. ఓ స్థాయి మేరకు ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్ల కోసం పెద్ద మొత్తంలో వెచ్చించేందుకు కూడా వెనుకాడలేదు. దీంతో గురువారం కొనసాగిన ఐపీఎల్-7 వేలంలో రైల్వేస్ లెగ్‌స్పిన్నర్ కరణ్ శర్మ జాక్‌పాట్ కొట్టేశాడు. రూ. 3.75 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు శర్మను సొంతం చేసుకుంది. రంజీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన హిమాచల్ ప్రదేశ్ క్రికెటర్ రిషి ధావన్ కోసం తీవ్రమైన పోటీ నెలకొన్నా... పంజాబ్ రూ. 3 కోట్లకు దక్కించుకుంది. విదేశీ ఆటగాళ్లను రెండోసారి వేలంలో పెట్టినా ఒకరిద్దరిపై మాత్రమే ఫ్రాంచైజీలు ఆసక్తి చూపాయి. హైదరాబాద్ ఆటగాళ్లు తిరుమలశెట్టి సుమన్, విహారి ఈసారి అమ్ముడుపోలేదు. వేలం విశేషాలు వేలంలో మొదటగా ఎస్.అనిరుధ పేరును పిలవగా, ఎలాంటి పోటీ లేకుండా సన్‌రైజర్స్ కనీస ధరకే దక్కించుకుంది. గురుకీరత్ సింగ్ (రూ. 1.3 కోట్లు) కోసం ముంబై, రాజస్థాన్, కోల్‌కతా పోటీపడినా.. పంజాబ్ సొంతమయ్యాడు. మొదట ఉన్ముక్త్ చంద్ (రూ.65 లక్షలు)పై ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. ఢిల్లీ ఆలస్యంగా స్పందిస్తే.. ముంబైతో పోటీపడి రాజస్థాన్ గెలుచుకుంది. మనీష్ పాండే (రూ. 1.70 కోట్లు) కోసం ముంబై, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీల మధ్య చతుర్ముఖ పోటీ నెలకొంది. అయితే కోల్‌కతా అత్యధికంగా చెల్లించింది. రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన కేదార్ జాదవ్ (రూ. 2 కోట్లు)ను సన్‌రైజర్స్ కొనుక్కున్నా.. ఢిల్లీ ‘రైట్ టు మ్యాచ్’ కార్డు ద్వారా ఎగరేసుకుపోయింది. ఆదిత్య తారే (రూ. 1.60 కోట్లు) కోసం ముంబై చివరి వరకు పోరాడి సొంతం చేసుకుంది. గత సీజన్లో కోల్‌కతాకు ఆడిన రజత్ భాటియా (రూ. 1.70 కోట్లు)కు రాజస్థాన్ భారీ మొత్తాన్ని ఇచ్చింది. మన్దీప్ (రూ. 80 లక్షలు)ను సన్‌రైజర్స్ సొంతం చేసుకున్నా... పంజాబ్ ‘రైట్ టు మ్యాచ్’ కార్డు ద్వారా తీసేసుకుంది. పర్వేజ్ రసూల్ (రూ. 95 లక్షలు) కోసం ఢిల్లీ చివరి వరకు పోరాడినా... సన్‌రైజర్స్ ప్రయత్నం సఫలమైంది. టెన్ డస్కెట్ (రూ. 1 కోటి), మిథున్ మన్హాస్ (రూ. 30 లక్షలు)ను వారి కనీస ధరలకే కోల్‌కతా, చెన్నైలు సొంతం చేసుకున్నాయి. ధావల్ కులకర్ణి (రూ. 1.10 కోట్లు) కోసం ఢిల్లీ తీవ్రంగా పోరాడి... రాజస్థాన్ చేతిలో భంగపడింది. గత సీజన్లో తమ జట్టుకు ఆడిన 20 ఏళ్ల జస్ప్రీత్ బుమ్రా (రూ. 1.20 కోట్లు) కోసం ముంబై భారీగా ఖర్చు చేసింది. ప్రవీణ్ తాంబే (రూ. 10 లక్షలు)ను కనీస ధరకే పంజాబ్ కొనుక్కున్నా... రాజస్థాన్ ‘రైట్ టు మ్యాచ్’ కార్డును ఉపయోగించుకుంది. సన్‌రైజర్స్ దక్కించుకున్న షాబాజ్ నదీమ్ (రూ. 85 లక్షలు)ను ఢిల్లీ ‘రైట్ టు మ్యాచ్’ కార్డు ద్వారా ఎగరేసుకుపోయింది. ఇటీవల భారత జట్టుకు ఎంపికైన ఈశ్వర్ పాండే (రూ. 1.50 కోట్లు) కోసం సన్‌రైజర్స్ పోటీపడినా చెన్నై దక్కించుకుంది. హైదరాబాద్ ఆటగాళ్లు విహారి, తిరుమల శెట్టి సుమన్ ఈసారి అమ్ముడుపోలేదు. ఆశిష్ రెడ్డి (రూ. 20 లక్షలు)ని సన్‌రైజర్స్ తీసుకుంది. జలజ్ సక్సేనా (రూ. 90 లక్షలు)ను ముంబై సొంతం చేసుకుంది. రాజస్థాన్ పట్టేసిన హర్షల్ పటేల్ (రూ. 40 లక్షలు)ను ‘రైట్ టు మ్యాచ్’ కార్డు ద్వారా బెంగళూరు దక్కించుకుంది. రెండోసారి వేలంలోకి వచ్చిన రాస్ టేలర్ (రూ. 2 కోట్లు-ఢిల్లీ), దక్షిణాఫ్రికా ఆటగాడు బెరాన్ హెండ్రిక్స్ (రూ. 1.80 కోట్లు-పంజాబ్), క్రిస్ లిన్ (రూ. 1.30 కోట్లు-కోల్‌కతా), ప్యాట్ కమిన్స్ (రూ. 1 కోటి-కోల్‌కతా)లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. జయవర్ధనే, గుప్టిల్, డారెన్ బ్రేవో, మార్లన్ శామ్యూల్స్, వైట్, టిమ్ పైన్, రోంచీ, బెహర్డిన్, హెన్రీ డేవిడ్, పాల్ వాల్తాటీ, డేవిడ్ హస్సీ, అజహర్ మహమూద్, మాథ్యూస్, బద్రీనాథ్‌లను ఎవరూ కొనలేదు. చెన్నై సూపర్ కింగ్స్ మొత్తం ఆటగాళ్లు: 20 విదేశీ ఆటగాళ్లు: 8 ఖర్చు : రూ. 59.40 కోట్లు ఢిల్లీ డేర్‌డెవిల్స్ మొత్తం ఆటగాళ్లు: 23 విదేశీ ఆటగాళ్లు: 7 ఖర్చు : రూ. 60 కోట్లు పంజాబ్ కింగ్స్ ఎలెవన్ మొత్తం ఆటగాళ్లు: 23 విదేశీ ఆటగాళ్లు: 7 ఖర్చు : రూ. 55. 90 కోట్లు కోల్‌కతా నైట్‌రైడర్స్ మొత్తం ఆటగాళ్లు: 21 విదేశీ ఆటగాళ్లు: 8 ఖర్చు : రూ. 59 కోట్లు ముంబై ఇండియన్స్ మొత్తం ఆటగాళ్లు: 21 విదేశీ ఆటగాళ్లు: 8 ఖర్చు : రూ. 59.95 కోట్లు రాజస్థాన్ రాయల్స్ మొత్తం ఆటగాళ్లు: 25 విదేశీ ఆటగాళ్లు: 8 ఖర్చు : రూ. 54.45 కోట్లు బెంగళూరు రాయల్ చాలెంజర్స్ మొత్తం ఆటగాళ్లు: 21 విదేశీ ఆటగాళ్లు: 7 ఖర్చు : రూ. 60 కోట్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ మొత్తం ఆటగాళ్లు: 24 విదేశీ ఆటగాళ్లు: 7 ఖర్చు : రూ. 59 కోట్లు రూ. 467. 70 కోట్లు అన్ని ఫ్రాంచైజీలు కలిపి ఆటగాళ్ల కోసం చేసిన ఖర్చు (రిటైన్ చేసుకున్న వారితో కలిపి) 178 ఐపీఎల్ -7తుది జాబితాలో ఉన్న ఆటగాళ్ల సంఖ్య (రిటైన్ చేసిన ఆటగాళ్లతో కలిపి) ‘ఎవరో ఒకరు నాకోసం బిడ్ వేయాలని కోరుకున్నా. ఒక్కసారి బిడ్ వచ్చాక ఎంత మొత్తం అన్న విషయాన్ని పట్టించుకోలేదు. నాకు భారీ మొత్తం లభించినందుకు సంతోషంగా ఉంది. నా బాధ్యత మరింత పెరగనుంది. ’ - కరణ్ శర్మ -
మరో నలుగురు!
ముంబై: ఐపీఎల్-6 ఫిక్సింగ్ ఉదంతంలో మరో నలుగురు క్రికెటర్ల పేర్లు వెలుగులోకి వచ్చాయి. మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు హైదరాబాద్ సన్‌రైజర్స్ ఆటగాళ్లు హనుమ విహారి, ఆశిష్ రెడ్డి, కరణ్ శర్మ, తిసారా పెరీరా కలిసి రూ. 6 కోట్లు తీసుకున్నారని ఓ బుకీ ముంబై పోలీసులకు చెప్పాడు. గత శనివారం ఫైల్ చేసిన చార్జిషీట్లో ముంబై పోలీసులు ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ ఏడాది ఐపీఎల్ సందర్భంగా ఏప్రిల్ 17న పుణే, సన్‌రైజర్స్ మ్యాచ్ సందర్భంగా ఈ నలుగురు ఆటగాళ్లు తమకు సహకరించారని బుకీ చంద్రేశ్ పటేల్ విచారణలో పోలీసులకు చెప్పాడు. ‘సన్‌రైజర్స్ మ్యాచ్‌ను ఫిక్స్ చేయడానికి రూ. 5 కోట్లు ఆటగాళ్లకు ఇవ్వాలని, ఒక కోటి తమకు కమిషన్ అని యూసుఫ్ అనే వ్యక్తి మమ్మల్ని సంప్రదించాడు. ఏప్రిల్ 16న పుణేలోని ఒక హోటల్లో ఈ నలుగురు ఆటగాళ్లను మాకు పరిచయం చేశాడు. సన్‌రైజర్స్ స్కోరు తొలి 10 ఓవర్లలో 60, మొత్తం 20 ఓవర్లలో 140 పరుగులు దాటకూడదని మాట్లాడుకున్నాం. అలాగే మ్యాచ్ ఓడిపోవాలని కూడా అడిగాం’ అని పటేల్ చెప్పాడు. అయితే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ గెలిచింది. మ్యాచ్ మీద రూ.9 కోట్లు పందెం కాసిన చంద్రేశ్ ఆ మొత్తం ఓడిపోయాడు. స్కోర్ల మీద రూ.3.5 కోట్లు పందెం కాసి గెలిచాడు. ఈ మేరకు హైదరాబాద్ కేంద్రంగా వెలువడే ఓ ఆంగ్ల పత్రిక ఈ కథనాన్ని ప్రచురించింది. ఆటగాడి సోదరుడు సూత్రధారి? చార్జిషీట్లో ముంబై పోలీసులు హైదరాబాద్ ఆటగాడు ఆశిష్ రెడ్డి సోదరుడు ప్రీతమ్ రెడ్డి పేరును ప్రస్తావించారు. ‘బుకీలు ప్రీతమ్తోనే డీల్ కుదుర్చుకున్నారు. రూ. 6 కోట్లు ఇస్తామని ఫిక్సింగ్ చేయాలని బుకీలు అతడిని కోరారు. దీనికి అతను అంగీకరించాడు. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ రెండో ఓవర్లో వికెట్ పడితే డీల్ ఓకే అయినట్లని ప్రీతమ్ బుకీలతో చెప్పాడు. (ఆ మ్యాచ్‌లో డి కాక్ రెండో ఓవర్లో అవుటయ్యాడు) దీంతో బుకీలు పందేలు కాశారు’ అని పోలీసులు చార్జిషీట్లో పేర్కొన్నారు. విచారణకు ఎందుకు పిలవలేదు? పోలీసులు చార్జిషీట్లో ఈ నలుగురు క్రికెటర్ల పేర్లను ప్రస్తావించారు. బుకీ చంద్రేశ్ జూన్ 17న ఈ విషయం చెప్పినట్లు తెలిపారు. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ నలుగురు క్రికెటర్లను పోలీసులు విచారణకు ఎందుకు పిలవలేదనేది పెద్ద ప్రశ్న. అంటే బుకీ చెప్పిన విషయాన్ని పోలీసులు నమ్మలేదా? లేక తగిన సాక్ష్యాలు లభించలేదా? అనేది తేలాల్సి ఉంది. ఏమైనా విహారి, ఆశిష్ రెడ్డి లాంటి వర్ధమాన క్రికెటర్ల భవిష్యత్‌కు ఇది పెద్ద దెబ్బ. ప్రస్తుతం జట్టుతోనే... ఆరోపణలు వచ్చిన నలుగురు క్రికెటర్లు ప్రస్తుతం చాంపియన్స్ లీగ్‌లో సన్‌రైజర్స్ జట్టు తరఫున ఆడుతున్నారు. వీరంతా జట్టుతో పాటే మొహాలీలో ఉన్నారు. ఒకవేళ వీళ్ల మీద అనుమానం ఉంటే కనీసం బీసీసీఐకి గానీ, జట్టుకు గానీ పోలీసులు చెప్పాల్సింది. కానీ ఇప్పటివరకూ జట్టుకు అలాంటి సమాచారం ఏమీ లేదు. మేం నమ్మడం లేదు: లంక బోర్డు తమ ఆటగాడు తిసారా పెరీరా ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు వచ్చిన కథనాలను శ్రీలంక బోర్డు ఖండించింది. పెరీరా మీద తమకు పూర్తిగా నమ్మకం ఉందని పేర్కొంది. ‘ఈ విషయం గురించి భారత్‌లోని అధికారుల నుంచి మాకు ఎలాంటి సమాచారం లేదు. మా క్రికెటర్ మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. అతను అలాంటి పనులకు పాల్పడడు’ అని లంక బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ‘మా అబ్బాయి మీద నమ్మకం ఉంది’ ఫిక్సింగ్ కథనాన్ని విహారి తల్లి విజయలక్ష్మి ఖండించారు. ఇవన్నీ ఆధారం లేని కథనాలని పేర్కొన్నారు. ‘మా అబ్బాయి మీద మాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఎంతో భవిష్యత్ ఉన్న కుర్రాడు ఇలా ఎందుకు చేస్తాడు? ఇవన్నీ నిరాధార కథనాలు. నిజం నిలకడ మీద తెలుస్తుంది. ప్రస్తుతం ఇంతకంటే మాట్లాడటానికేం లేదు’ అని ఆమె ‘సాక్షి’తో చెప్పారు.