టీమిండియా స్పిన్నర్ కరణ్ శర్మకు ఐపీఎల్‌లో అత్యంత అదృష్టవంతమైన ఆటగాడిగా పేరుంది. అతడు ఏ జట్టులో ఉంటే ఆ జట్టుదే టైటిల్ అని అంతా భావిస్తారు. గత ఐదు సీజన్‌లలో మూడు సార్లు ఛాంపియన్స్‌గా నిలిచిన జట్టులో సభ్యుడిగా కరణ్ శర్మ ఉన్నాడు. అయితే ఈ సారి మాత్రం అతడి అదృష్టం ఆర్సీబీకి కలిసి రాలేదు. ఐపీఎల్-2022లలో ఆర్సీబీకి కరణ్ ప్రాతినిధ్యం వహించాడు.
ఈ ఏడాది సీజన్‌లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌లోనే ఇంటిముఖం పట్టింది. ఇది ఇలా ఉండగా.. ఐపీఎల్‌లో కరణ్ శర్మ కంటే అదృష్టవంతమైన మరో ఆటగాడు ఉన్నాడు. అతడే వెస్టిండీస్ యువ పేసర్ డొమినిక్ డ్రాక్స్. కరణ్ శర్మ కనీసం ఒకటో,రెండో మ్యాచ్‌లు ఆడి టైటిల్స్ గెలిస్తే.. డ్రాక్స్ మాత్రం ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడకుండా రెండు సార్లు ఛాంపియన్స్‌గా నిలిచిన జట్టులో భాగమయ్యాడు.
ఐపీఎల్-2021లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన డ్రాక్స్‌కు ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం రాలేదు. అయితే గతేడాది ఛాంపియన్స్‌గా సీఎస్‌కే నిలిచింది. అదే విధంగా ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడిన డ్రాక్స్.. అన్నీ మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ ఏడాది సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ విజేతగా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment