Dominic Drakes
-
తీవ్రంగా గాయపడ్డ వెస్టిండీస్ క్రికెటర్.. స్ట్రెచర్‌పై మైదానం బయటకు!
ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో భాగంగా సోమవారం జరిగిన షార్జా వారియర్స్, గల్ఫ్ జెయింట్స్ సందర్భంగా ఓ దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో గల్ఫ్ జెయింట్స్ ఆటగాడు, వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డొమినిక్ డ్రేక్స్ తీవ్రంగా గాయపడ్డాడు. ఏం జరిగిందంటే? వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డొమినిక్ డ్రేక్స్ ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో గల్ఫ్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో షార్జా వారియర్స్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్ వేసిన బ్రాత్‌వైట్ బౌలింగ్‌లో.. మోయిన్ అలీ భారీ షాట్‌కు ప్రయత్నించాడు. అది మిస్టైమ్ అయ్యి గాల్లోకి లేచింది. అయితే బౌండర్ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న డ్రేక్ పరిగెత్తుకుంటూ వచ్చి అద్భుతమైన డైవింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలో అతడి ముఖం నేలకు బలంగా తాకింది. దీంతో వెంటనే అతడు తీవ్రమైన నొప్పితో విలవిల్లాడు. ఈ క్రమంలో మెడికల్ సిబ్బంది అతడిని స్ట్రెచర్‌పై మైదానం బయటకు తీసుకువెళ్లారు. అయితే అతడిని హూటాహూటిన ఆస్పత్రికి తరిలించారు. ఇక ముఖంకు తీవ్రమైన గాయమైనప్పటికీ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్న అతడిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 7 వికెట్ల తేడాతో గల్ఫ్ జెయింట్స్ విజయం ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. షార్జా వారియర్స్ పై గల్ఫ్ జెయింట్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన షార్జా 107 పరుగులకే కుప్పకూలింది. గల్ఫ్ జెయింట్స్ బౌలర్లలో డేవిడ్ వైస్ ఐదు వికెట్లతో షార్జా వెన్ను విరచగా.. బ్రాత్‌వైట్ రెండు, సంచిత్ శర్మ,హెల్మ్ తలా వికెట్ సాధించారు. అనంతరం 108 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన జెయింట్స్ మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. చదవండి: Nepal Head Coach: నేపాల్ జట్టు హెడ్ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్ Brilliance from Drakes! A #Bawaal catch to dismiss Moeen Ali!#SWvGG #CricketOnZee #DPWorldILT20 #HarBallBawaal pic.twitter.com/mtUDVj4xJm — Zee Cricket (@ilt20onzee) February 6, 2023 -
ఒక్క మ్యాచ్ ఆడలేదు.. కోటికి పైగా వెనకేశారు! టైటిల్ కూడా!
IPL 2022: కొంతమంది ఆటగాళ్లు ఎంత కష్టపడినా ఫలితం ఉండదు. మరికొంత మంది ఒక్కసారి తమ ప్రతిభ నిరూపించుకుంటే చాలు.. అదృష్టం వెంటపడి మరీ వరిస్తుంది. అలా కాలు మీద కాలేసుకుని కూర్చున్నా కనకవర్షం కురిపిస్తుంది. ఇక ఐపీఎల్ వంటి క్యాష్ రిచ్‌లీగ్‌లో ఇలాంటి ఘటనలు జరగడం సహజమే! కొన్ని ఫ్రాంఛైజీలు వేలంలో కోట్లు పోసి కొన్న క్రికెటర్లను కూడా బెంచ్‌కే పరిమితం చేసే పరిస్థితులు ఉంటాయి. జట్టు అత్యుత్తమ కూర్పులో భాగంగా కొందరిని పక్కనపెడతాయి. అయినా సరే వాళ్లకు చెల్లించాల్సిన మొత్తం చెల్లించక తప్పదు కదా! అలా ఐపీఎల్-2022లో బెంచ్‌కే పరిమితమై కోటి రూపాయలకు పైగా సంపాదించిన టాప్-3 క్రికెటర్లను పరిశీలిద్దాం! వీరిలో ఇద్దరు ఆడకుండానే టైటిల్ గెలిచిన జట్టులో భాగం కావడం విశేషం. 1.జయంత్ యాదవ్ ఐపీఎల్ మెగా వేలం-2022లో టీమిండియా ఆల్‌రౌండర్ జయంత్ యాదవ్‌ను 1.7 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది గుజరాత్ టైటాన్స్. కనీస ధర కోటితో ఆక్షన్‌లోకి వచ్చిన అతడిని లక్నో సూపర్ జెయింట్స్‌తో పోటీ పడి మరీ సొంతం చేసుకుంది. రషీద్ ఖాన్‌తో కలిసి అతడిని బరిలోకి దింపుతారనే అంచనాలు ఉన్నా.. అలా జరుగలేదు. సీజన్ ఆసాంతం ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ జయంత్‌కు ఒక్కసారి కూడా తుది జట్టులో చోటు లభించలేదు. రషీద్, సాయి కిషోర్, రాహుల్ తెవాటియాలతో పోటీలో అతడు వెనుకబడిపోయాడు. ఇక ఐపీఎల్-2022తో ఎంట్రీ ఇచ్చిన సీజన్లోనే గుజరాత్ చాంపియన్స్‌గా నిలిచిన విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. View this post on Instagram A post shared by Jayant Yadav (@jyadav19) 2. డొమినిక్ డ్రేక్స్ ఐపీఎల్లో అత్యంత అదృష్టవంతుడైన ప్లేయర్‌గా కరేబియన్ ఆల్‌రౌండర్ డొమినిక్ డ్రేక్స్ పేరొందాడు. కనీసం ఒక్కసారైనా క్యాష్ రిచ్ లీగ్ టైటిల్ గెలిచిన జట్టులో భాగమవ్వాలని ప్రతి ఒక్క ఆటగాడి కల. డొమినిక్ డ్రేక్స్‌కు ఇది రెండుసార్లు నెరవేరింది. అది కూడా ఒక్క మ్యాచ్ ఆడకుండానే. గత సీజన్ రెండో అంచెలో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ అతడిని కొనుగోలు చేసింది. ఇక ఆ 2021 ఎడిషన్‌లో చెన్నై టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2022 మెగావేలంలో ఆర్సీబీతో పోటీ పడి మరీ గుజరాత్ టైటాన్స్ డొమినిక్‌ను దక్కించుకుంది. ఇందుకోసం ఏకంగా 1.1 కోట్లు ఖర్చు చేసింది. అయితే, ఒక్క మ్యాచ్‌లో ఆడే అవకాశం కూడా ఇవ్వలేదు. దీంతో అతడు బెంచ్‌కే పరిమితమైనా కోటితో పాటు మరో ఐపీఎల్ టైటిల్‌ను ఖాతాలో వేసుకున్నాడు. View this post on Instagram A post shared by Filter Cricket ⬇️ (@filtercricket) 3. రాజ్వర్ధన్ హంగర్కర్ భారత అండర్-19 జట్టులో సభ్యుడైన రాజ్వర్ధన్.. వన్డే ప్రపంచకప్‌లో అదరగొట్టి ఐపీఎల్ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో సీఎస్కే ఈ యువ ఆల్‌రౌండర్‌ను 1.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. కానీ.. తుదిజట్టులో చోటు కల్పించలేదు. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బంతిని విసరగల.. జట్టుకు అవసరమైన సమయంలో బ్యాటింగ్ చేయగల రాజ్‌వర్ధన్‌కు అవకాశం ఇవ్వలేదు. చదవండి: IPL: మా వాళ్లంతా సూపర్.. ఏదో ఒకరోజు నేనూ ఐపీఎల్లో ఆడతా: ప్రొటిస్ కెప్టెన్ Hardik Pandya - Kiran More: 'ఆ ఆటగాడు ఇకపై ఫోర్-డి ప్లేయర్'.. టీమిండియా మాజీ క్రికెటర్ -
ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడలేదు.. కానీ రెండు టైటిల్స్.. ఐపీఎల్లో మోస్ట్ లక్కీ ప్లేయర్..!
టీమిండియా స్పిన్నర్ కరణ్ శర్మకు ఐపీఎల్లో అత్యంత అదృష్టవంతమైన ఆటగాడిగా పేరుంది. అతడు ఏ జట్టులో ఉంటే ఆ జట్టుదే టైటిల్ అని అంతా భావిస్తారు. గత ఐదు సీజన్లలో మూడు సార్లు ఛాంపియన్స్‌గా నిలిచిన జట్టులో సభ్యుడిగా కరణ్ శర్మ ఉన్నాడు. అయితే ఈ సారి మాత్రం అతడి అదృష్టం ఆర్సీబీకి కలిసి రాలేదు. ఐపీఎల్-2022లలో ఆర్సీబీకి కరణ్ ప్రాతినిధ్యం వహించాడు. ఈ ఏడాది సీజన్లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌లోనే ఇంటిముఖం పట్టింది. ఇది ఇలా ఉండగా.. ఐపీఎల్లో కరణ్ శర్మ కంటే అదృష్టవంతమైన మరో ఆటగాడు ఉన్నాడు. అతడే వెస్టిండీస్ యువ పేసర్ డొమినిక్ డ్రాక్స్. కరణ్ శర్మ కనీసం ఒకటో,రెండో మ్యాచ్‌లు ఆడి టైటిల్స్ గెలిస్తే.. డ్రాక్స్ మాత్రం ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడకుండా రెండు సార్లు ఛాంపియన్స్‌గా నిలిచిన జట్టులో భాగమయ్యాడు. ఐపీఎల్-2021లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన డ్రాక్స్కు ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం రాలేదు. అయితే గతేడాది ఛాంపియన్స్‌గా సీఎస్కే నిలిచింది. అదే విధంగా ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడిన డ్రాక్స్.. అన్నీ మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ ఏడాది సీజన్లో గుజరాత్ టైటాన్స్ విజేతగా నిలిచింది. చదవండి: Sachin Tendulkar Best XI Of IPL 2022: ఐపీఎల్ అత్యుత్తమ జట్టు ప్రకటన.. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మకు నో ఛాన్స్..!