![third ODI India will have a strong victory - Sakshi](/styles/webp/s3/article_images/2017/10/12/karan.jpg.webp?itok=tD5946oy)
సాక్షి, విశాఖపట్నం: న్యూజిలాండ్ ‘ఎ’తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భారత్ ‘ఎ’ 1–0తో ముందంజ వేసింది. బుధవారం జరిగిన మూడో డే నైట్ వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్ జట్టు 37.1 ఓవర్లలో 143 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ నికోల్స్ (35) టాప్ స్కోరర్ కాగా... మున్రో (29) కొద్దిగా పోరాడాడు. భారత లెగ్‌స్పిన్నర్ కరణ్ శర్మ 22 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టడం విశేషం.
అనంతరం భారత్ 24.4 ఓవర్లలో 4 వికెట్లకు 144 పరుగులు చేసి విజయాన్నందుకుంది. పృథ్వీ షా (6), మయాంక్ (8), శ్రీవత్స్ (9) విఫలం కావడంతో ఒక దశలో భారత్ 23 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అయితే విజయ్ శంకర్ (47 నాటౌట్), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (37), దీపక్ హుడా (35 నాటౌట్) కలిసి జట్టును గెలిపించారు. అయ్య ర్‌తో నాలుగో వికెట్‌కు 64 పరుగులు జోడించిన విజయ్ శంకర్, ఐదో వికెట్‌కు హుడాతో 57 పరుగులు జత చేశాడు. ఇరు జట్ల మధ్య తొలి వన్డే రద్దు కాగా, రెండో మ్యాచ్ ‘టై’గా ముగిసింది. నాలుగో వన్డే శుక్రవారం జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment