ఐపీఎల్-2022లో రాయల్ ఛాలంజెర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్‌లో ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది సీజన్‌లో ఫాఫ్ డుప్లెసిస్ నూతన సారథ్యంలో ఆర్సీబీ అద్భుతంగా రాణించింది. ఇది ఇలా ఉండగా.. వచ్చే ఏడాది సీజన్‌కు ముందు ఆర్సీబీ మేనేజ్‌మెంట్ కొంతమంది ఆటగాళ్లను విడుదల చేసే అవకాశం ఉంది. ఆర్సీబీ విడుదల చేసే ఛాన్స్ ఉన్న ఆటగాళ్లను ఓ సారి పరిశీలిద్దాం.
సిద్దార్థ్ కౌల్
ఐపీఎల్-2022 మెగా వేలంలో సిద్దార్థ్ కౌల్‌ను రూ. 75 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే ఈ ఏడాది సీజన్‌లో కౌల్ ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన కౌల్.. వికెట్లు ఏమి సాధించకుండా 43 పరుగులు ఇచ్చాడు. కాబట్టి వచ్చే ఏడాది సీజన్‌కు ముందు సిద్దార్థ్ కౌల్‌ను ఆర్సీబీ విడిచి పెట్టే అవకాశం ఉంది. కాగా ఆర్సీబీ పేస్ అటాక్‌లో జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్,హర్షల్ పటేల్ వంటి బౌలర్లు ఉండటంతో కౌల్ చోటు దక్కలేదు.
డేవిడ్ విల్లీ
ఐపీఎల్-2022 మెగా వేలంలో డేవిడ్ విల్లీని ఆర్సీబీ రూ. 2 కోట్లకు దక్కించుకుంది. కాగా టోర్నీ ఆరంభ మ్యాచ్‌లకు గ్లెన్ మాక్స్‌వెల్ అందుబాటులో లేకపోవడంతో విల్లీకి తుది జట్టులో చోటు దక్కింది. అయితే అతడు ఆ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోలేకపోయాడు. నాలుగు మ్యాచ్‌లు ఆడిన విల్లీ 18 పరుగులతో పాటు ఒకే ఒక్క వికెట్ సాధించాడు. ఇక మాక్స్‌వెల్ వచ్చాక విల్లీకి తుది జట్టులో చోటు దక్కలేదు. కాగా ప్లేయింగ్ ఎలెవన్‌లో నాలుగురు విదేశీ ఆటగాళ్లు మాత్రమే అవకాశం ఉన్నందున.. తదుపరి సీజన్‌కు ముందు ఆర్సీబీ విడుదల చేసే అవకాశం ఉంది.
కరణ్ శర్మ
ఐపీఎల్-2022 మెగా వేలంలో కరణ్ శర్మను రూ. 50 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే ఈ ఏడాది సీజన్‌లో ఒక్క మ్యాచ్‌లో కూడా కరణ్ శర్మకు తుది జట్టులో చోటు దక్కలేదు. ఈ సీజన్‌లో అన్ని మ్యాచ్‌లకు శ్రీలంక యువ స్పిన్నర్ వనిందు హసరంగాకే ఆర్సీబీ ఛాన్స్ ఇచ్చింది. అదే విధంగా పార్ట్‌టైమ్ స్పిన్నర్స్‌గా మాక్స్‌వెల్, షబాజ్ ఆహ్మద్ ఉన్నారు. కాబట్టి అతడిని వచ్చే ఏడాది సీజన్ ముందు ఆర్సీబీ విడిచి పెట్టనుంది.
చదవండి: Hardik Pandya: 'ఫైనల్ మ్యాచ్‌లు నాకు కలిసొచ్చాయి.. గుజరాత్ టైటాన్స్‌దే కప్'
Comments
Please login to add a commentAdd a comment