యూట్యూబర్‌ని పెళ్లి చేసుకున్న ప్రముఖ నటి | TV Actress Janani Pradeep Gets Married To YouTuber Eniyan - Sakshi
Sakshi News home page

Janani Pradeep: అతడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న నటి

Published Sun, Aug 27 2023 7:47 PM | Last Updated on Mon, Aug 28 2023 9:20 AM

Actress Janani Pradeep Youtuber Eniyan Wedding - Sakshi

ఇండస్ట్రీలో ప్రేమ-పెళ్లి లాంటివి చాలా కామన్. సినిమా యాక్టర్స్ దగ్గర నుంచి సీరియల్ యాక్టర్స్ వరకు చాలామంది ఇలా లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నవాళ్లే. అయితే ప్రముఖ సీరియల్ నటి మాత్రం కాస్త డిఫరెంట్. ఎందుకంటే యూట్యూబర్ తో ప్రేమలో పడి.. దాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లింది. ఆదివారమే(ఆగస్టు 27) ఈ జంట ఒక్కటయ్యారు.

(ఇదీ చదవండి: తెలుగు సీరియల్ నటుడు ఎంగేజ్‌మెంట్.. డాక్టర్‌బాబు సందడి)

 'శివ మనసులో శక్తి', 'కణ్మని' తదితర సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న నటి జనని ప్రదీప్.. ఎన్నియన్ అనే యూట్యూబర్‌ని పెళ్లి చేసుకుంది. గతంలో ఈమెనే తన లవ్‌స్టోరీ గురించి బయటపెట్టింది. ఓ ఆల్బమ్ సాంగ్ షూటింగ్ కోసం కలిసిన వీళ్లు.. తొలుత ప్రేమలో పడ్డారు. అలా దాదాపు నాలుగేళ్ల గడిచిపోయాయి.

ఈ క్రమంలోనే పెద్దలు కూడా వీళ్లిద్దరికి పెళ్లి నిశ్చయం చేశారు. అలా ఇప్పుడు జనని ప్రదీప్-ఎన్నియన్ కలిసి ఏడడుగులు వేశారు. ఈ వేడుకకు పలువురు సీరియల్ నటీనటులు హాజరై.. కొత్త జంటని ఆశీర్వదించారు. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వాటిపై మీరు ఓ లుక్కేసేయండి.

(ఇదీ చదవండి: పెళ్లికి ముందే పూజలు తెగ చేస్తున్న ఆ హీరోయిన్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement