Navya Swamy About Her Journey From Serials To Movies - Sakshi
Sakshi News home page

Navya Swamy: ఇక నా జీవితం సీరియల్స్‌కే పరిమితం అనుకునే సమయానికి..

Published Sun, May 21 2023 1:35 PM | Last Updated on Sun, May 21 2023 1:51 PM

Navya Swamy about Her Journey From Serials to Movies - Sakshi

ద గర్ల్‌ నెక్ట్స్‌ డోర్‌లా అనిపించే నటి.. నవ్య స్వామి.. బుల్లితెర  కథానాయిక. భాష ఏదైనా సరే హావభావాలతో మెప్పిస్తుంది. అలా ఒకేసారి కన్నడ, తమిళ, తెలుగు బుల్లితెర స్టార్‌గా ఎదిగి వెండి, వెబ్‌ తెరల మీదా వెలుగుతోంది. కర్ణాటకలోని మైసూరుకు చెందిన నవ్య డాక్టర్‌ కావాలనుకుంది.

అయితే, 2011లో ‘తంగలి’ అనే కన్నడ సీరియల్లో నటించే అవకాశం రావడంతో యాక్టర్‌గా మారింది. ఆ సీరియల్‌ మంచి విజయం సాధించటంతో వరుసగా తమిళ, తెలుగు భాషల్లోనూ అవకాశాలు వచ్చాయి. ‘నా పేరు మీనాక్షి’, ‘కంటే కూతురునే కనాలి’, ‘ఆమె కథ’ సీరియల్స్‌తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరై, ఇక్కడే స్థిరపడిపోయింది. అప్పుడప్పుడు రియాలిటీ షోస్‌లోనూ మెరుస్తూ సందడి చేస్తుంది నవ్య.

సోషల్‌మీడియాలోనూ ఎప్పటికప్పుడు పోస్ట్‌లు, ఫొటోలు పెడుతూ చురుగ్గా ఉంటుంది. పలు యూట్యూబ్‌ షార్ట్‌ ఫిల్మ్స్‌లోనూ నటించింది. ఈ మధ్యనే వెండితెర ప్రవేశం కూడా చేసింది. అనికా సురేంద్రన్, అర్జున్‌ దాస్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘బుట్ట బొమ్మ’ సినిమాలో అర్జున్‌ దాస్‌కు జోడీగా నటించి, మెప్పించింది. మరో సినిమా ‘ఇంటింటి రామాయణం’ త్వరలోనే విడుదల కానుంది. 

సీరియల్స్‌ ఒక మారథాన్‌ లాంటివి. అంత ఈజీగా ఆపలేం. ఇక నా జీవితం సీరియల్స్‌కే పరిమితం అని అనుకునే సమయానికి అదృష్టం కొద్ది సినిమా అవకాశం వచ్చింది!
–  నవ్య స్వామి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement