
సీరియల్ నటి కరుణ భూషణ్ ఎక్స్‌పోజ్‌డ్ 24 వెబ్ సిరీస్‌తో ఓటీటీ ప్రేక్షకులకూ దగ్గరైంది. తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటించింది. ఇండస్ట్రీకి వచ్చి 27 ఏళ్లు అయింది. 'అమ్మది బాంబే. నేను పుట్టిపెరిగింది హైదరాబాద్‌లోనే.. తెలుగబ్బాయినే పెళ్లి చేసుకున్నా. అతడు బాలీవుడ్ డైరెక్టర్. 2007లో నేను అతడ్ని లేపుకెళ్లి పెళ్లి చేసుకున్నాను. మాకొక అబ్బాయి. తర్వాత ఒకసారి మిస్‌క్యారేజ్ అయింది. అప్పుడు ఒక సీరియల్ కూడా మానేశాను.
నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నటిస్తున్నాను. నా తొలి సినిమా ఆహా. 30కి పైగా సినిమాల్లో నటించాను. నటించకపోయుంటే డాక్టర్ అయ్యేదాన్ని. నేను బాగా నమ్మిన కొందరు నాకు హ్యాండిచ్చారు. అప్పటినుంచి ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దని అర్థమైంది. ఈ మధ్యకాలంలో స్వీట్ మెమొరీస్ అంటే.. మా ఆయన నాకు ఐఫోన్ 14 ప్రో మాక్స్ గిఫ్టిచ్చాడు. అతడికి ఈ ఫోన్ గిఫ్టిద్దామని హైదరాబాద్ అంతా తిరిగాను. ఎక్కడా దొరకలేదు. చివరికి అతడే నాకది గిఫ్టిచ్చాడు. అది నిజంగా సర్‌ప్రైజ్. ఆ తర్వాత మా పెళ్లిరోజుకు నేను కూడా ఐఫోన్ 14 ప్రో మాక్స్ బహుమతిగా ఇచ్చా' అని చెప్పుకొచ్చింది నటి.
చదవండి: చివరి కోరిక తీరకుండానే కన్నుమూసిన కైకాల
18 పేజీస్ మూవీ రివ్యూ
Comments
Please login to add a commentAdd a comment