TV Actress Tunisha Sharma Commits Suicide On Sets Of Her Show, Details Inside - Sakshi
Sakshi News home page

Tunisha Sharma Suicide Death: చిన్న వయసులో బుల్లితెర నటి ఆత్మహత్య

Published Sat, Dec 24 2022 7:10 PM | Last Updated on Sat, Dec 24 2022 9:50 PM

TV Actress Tunisha Sharma Commits Suicide - Sakshi

ప్రముఖ బుల్లితెర నటి తునీషా శర్మ(20) ఆత్మహత్య చేసుకుంది. శనివారం ముంబైలోని ఓ షూటింగ్‌ సెట్‌ మేకప్‌ రూమ్‌లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు ధృవీకరించారు. నటి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

కాగా భారత్‌ కా వీర పుత్ర- మహారాణ ప్రతాప్‌ అనే సీరియల్‌తో చిన్న వయసులోనే కెరీర్‌ ఆరంభించింది తునీషా. చక్రవర్తి అశోక సామ్రాట్‌, గబ్బర్‌ పూంచ్‌వాలా, షేర్‌ పంజాబీ: మహారాజ రంజిత్‌ సింగ్‌, ఇంటర్నెట్‌ వాలా లవ్‌, ఇష్క్‌ సుభాన్‌ అల్లా, అలీ బాబా: దస్తాన్‌ ఇ కాబుల్‌ వంటి ధారావాహికల్లోనూ ముఖ్య పాత్రలు పోషించింది. సీరియల్స్‌ మాత్రమే కాకుండా ఫితూర్‌, బార్‌ బార్‌ దేఖో, కహానీ 2: దుర్గా రాణి సింగ్‌, దబాంగ్‌ 3 చిత్రాల్లోనూ అలరించింది. ఫితూర్‌, బార్‌ బార్‌ దేఖో సినిమాల్లో బాల కత్రినాగా నటించింది తునీషా.

చదవండి: 2023లో నేను తీసుకుంటున్న నిర్ణయం అదే: అల్లు స్నేహ
అలరించని బీటౌన్‌ స్టార్స్‌, 2022లో దారుణ డిజాస్టర్స్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement