Monika Bhadoriya Reveals About Her Suicide Thoughts Due To Torture On The Sets Of TMKOC - Sakshi
Sakshi News home page

Monika Bhadoriya: ఎంత టార్చర్‌ పెట్టారంటే.. చచ్చిపోదామనుకున్నా

Published Tue, Jun 6 2023 11:21 AM | Last Updated on Tue, Jun 6 2023 12:16 PM

Monika Bhadoriya says she was suicidal issue Taarak Mehta Ka Ooltah Chashmah  - Sakshi

ప్రముఖ టీవీ షో 'తారక్ మెహతా కా ఉల్టా చష్మా' (TMKOC) నిర్మాతలు తనను వేధించారని నటి మోనికా భడోరియా ఇటీవల తెలిపింది. ఆ షో కోసం పనిచేస్తున్నప్పుడు తనను హింసించారని, ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వచ్చినట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. తనతో వెట్టి చాకిరి చేయుంచుకొని చివరకు తనకు రావాల్సిన రెమ్యునేషన్‌ కూడా ఇవ్వలేదని తెలిపింది.

(ఇదీ చదవండి: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రభాస్‌, ఎగబడ్డ ఫ్యాన్స్‌)

తారక్ మెహతా కా ఉల్టా చష్మా (TMKOC)లో మోనికా భడోరియా..  బావ్రీ పాత్రతో మెప్పించింది. మోనికా తన షో సెట్స్‌లోని రోజులను "హెల్" (నరకం) అని పిలిచింది.  చివరకు తన తల్లి క్యాన్సర్ చికిత్స పొందుతున్నప్పుడు షో యూనిట్‌ నుంచి ఎలాంటి మద్ధతు లభించలేదని ఇలా  చెప్పింది.''నేను రాత్రంతా ఆస్పత్రిలో అమ్మ వద్దే ఉండేదాన్ని.. కానీ వారు కావాలనే షూటింగ్ కోసం ఉదయాన్నే పిలిచేవారు. నా మానసిక స్థితి సరిగా లేదని చెప్పినా.. రమ్మని బలవంతం చేసేవారు. ఎదురు ప్రశ్నించలేక షూట్‌ కోసం వెళ్తే అక్కడ కూడా నన్ను వెయిట్‌ చేయించేవారు'' అని కన్నీరు పెట్టుకుంది.

అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనిపించింది

''మా  కుటుంబలో నేనే ఎన్నో విషాదాలను ఎదుర్కొన్నాను. చాలా తక్కువ కాలంలోనే నా తల్లిని, అమ్మమ్మను కోల్పోయాను. వాళ్లిద్దరూ నా జీవితానికి మూలస్తంభాలు,  దీంతో వారు లేరనే బాధను భరించలేక నా జీవితం ముగిసిపోయిందని అనుకున్నాను. అయినా ఈ సమయంలో, నేను తారక్ మెహతా కా ఉల్టా చష్మా కోసం పని చేశాను, అప్పుడు కూడా వారు  హింసించేవారు. కాబట్టి  నేను ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను. మా అమ్మ అనారోగ్యంతో ఉన్నప్పుడు  వైద్యం కోసం  డబ్బులు ఇచ్చాం అని కూడా వారు ప్రచారం చేశారు. ఈ మాటలు నన్ను తీవ్రంగా బాధించాయి.'' అని చెప్పుకొచ్చింది మోనిక.

(ఇదీ చదవండి: CSK: 'సీఎస్‌కే' టైటిల్‌ ఫిక్స్‌ చేయనున్న విజయ్‌?)

దశాబ్ద కాలంగా ఈ షో విజయవంతంగా నడుస్తుండగా ఈ నిర్మాతలపై  జెన్నిఫర్ మిస్త్రీ బన్సీవాల్ లైంగిక  ఆరోపణలు చేసింది. ఆమెతో పాటు దిశా వకాని, ప్రియా అహుజా, శైలేష్ లోధా, ఇప్పుడు మోనికా షో నిర్మాతల తీరును తప్పుబట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement