అమ్మాయి అమ్మాయి పెళ్లి చేసుకోవడం చూశాం. అబ్బాయి అబ్బాయి లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉండటం విన్నాం. ఈ మధ్య కాలంలో అమ్మాయి తనకు తానే పెళ్లి చేసుకోవడం చూసి ఆశ్చర్యపోయాం. గుజరాత్‌లోని వడోదరకు చెందిన క్షమాబిందు తనను తానే వివాహమడిన విషయం తెలిసిందే. ఈమె బాటలోనే తనకు తాను వివాహ బంధంతో ఒక్కటైంది సీరియల్ నటి కనిష్క సోని. 'దియా ఔర్ బాతీ హమ్' సీరియల్‌తో పాపులారిటీ సంపాదించుకుంది కనిష్క సోని. ఈమె ఇటీవల తనను తానే పెళ్లి చేసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
ఒక హిందూ సాంప్రాయదాయ మహిళగా కనిపించేలా నుదుట సింధూరం, మెడలో మంగళసూత్రంతో ఉన్న ఫొటోలను ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్ చేసింది. ఈ ఫొటోలకు 'నా కలలన్నింటినీ నాకు నేనుగా సొంతంగా సాధించుకున్నాను. నేను ప్రేమిస్తున్నా ఏకైక వ్యక్తిని నేనే. అందుకే నన్ను నేను వివాహం చేసుకున్నాను' అంటూ రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అయింది. ఇది చూసిన నెటిజన్లు ఆమెను ద్వేషిస్తూ కామెంట్స్ చేశారు. నెటిజన్ల తనపై చూపించిన ద్వేషంపై స్పందిస్తూ ఓ వీడియో పోస్ట్ చేసింది.
చదవండి: బిగ్‌బాస్ బ్యూటీకి లైంగిక వేధింపులు.. ఆవేదనతో పోస్ట్
''నన్ను నేను పెళ్లి చేసుకున్న అని పెట్టిన పోస్ట్‌పై చాలా మంది చాలా రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు విచిత్రంగా రియాక్ట్ అయితే, మరికొంతమంది నన్ను ద్వేషిస్తున్నారు. అందులో నా లైంగిక జీవితం గురించి అడిగారు. వారందరికి నేను నిజాయితీగా నేను చెప్పేది ఒక్కటే. నేను గుజరాత్‌కు చెందిన చాలా సాంప్రదాయమైన కుటుంబానికి చెందిన యువతిని. పెళ్లి అంటే చిన్నప్పటి నుంచి ఎంతో మంచి అనుభూతి ఉండేది. ఎప్పటినుంచో పెళ్లి చేసుకోవాలని ఉండేది. కానీ మాటలకు విలువ ఇచ్చి కట్టుబడు ఉండే వ్యక్తి నా జీవితంలో నాకు కనపడలేదు. అబ్బాయిలు తమ మాటలకు కట్టుబడు ఉండరని నాకు అర్థమైంది.
చదవండి: నెట్టింట్లో అంజలి అసభ్యకర వీడియో వైరల్.. కన్నీరు పెట్టుకున్న నటి
నేటి సాంకేతికత చాలా అభివృద్ధి చెందింది. మనిషి లేకుండా నా జీవితాంతం సంతోషంగా జీవించగలను అని నేను నమ్మడానికి కారణం అదే. శృంగారం కోసం పురుషుడి అవసరం లేదని నేను కచ్చితంగా చెప్పగలను. వివాహం అంటే కేవలం శృంగారం మాత్రమే కాదు. అది ప్రేమ, నిజాయితీకి సంబంధించినది. అంతేకాకుండా నేను సంపాదిస్తే ఇంకో మనిషి అవసరం నాకు లేదు. నేను నా కలలను స్వేచ్ఛగా నేరవేర్చుకోగలను. ప్రస్తుతం నేను అమెరికాలో ఉన్నాను. హాలీవుడ్ వైపు నా కెరీర్ సాగుతున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది అని తెలిపింది'' కనిష్క సోని.
Comments
Please login to add a commentAdd a comment