self marriage
-
నుదుట సింధూరం, మెడలో మంగళసూత్రం.. నటికి భర్త మాత్రం లేడు!
అమ్మాయి అమ్మాయి పెళ్లి చేసుకోవడం చూశాం. అబ్బాయి అబ్బాయి లివింగ్ రిలేషన్షిప్లో ఉండటం విన్నాం. ఈ మధ్య కాలంలో అమ్మాయి తనకు తానే పెళ్లి చేసుకోవడం చూసి ఆశ్చర్యపోయాం. గుజరాత్‌లోని వడోదరకు చెందిన క్షమాబిందు తనను తానే వివాహమడిన విషయం తెలిసిందే. ఈమె బాటలోనే తనకు తాను వివాహ బంధంతో ఒక్కటైంది సీరియల్ నటి కనిష్క సోని. 'దియా ఔర్ బాతీ హమ్' సీరియల్‌తో పాపులారిటీ సంపాదించుకుంది కనిష్క సోని. ఈమె ఇటీవల తనను తానే పెళ్లి చేసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఒక హిందూ సాంప్రాయదాయ మహిళగా కనిపించేలా నుదుట సింధూరం, మెడలో మంగళసూత్రంతో ఉన్న ఫొటోలను ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్ చేసింది. ఈ ఫొటోలకు 'నా కలలన్నింటినీ నాకు నేనుగా సొంతంగా సాధించుకున్నాను. నేను ప్రేమిస్తున్నా ఏకైక వ్యక్తిని నేనే. అందుకే నన్ను నేను వివాహం చేసుకున్నాను' అంటూ రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అయింది. ఇది చూసిన నెటిజన్లు ఆమెను ద్వేషిస్తూ కామెంట్స్ చేశారు. నెటిజన్ల తనపై చూపించిన ద్వేషంపై స్పందిస్తూ ఓ వీడియో పోస్ట్ చేసింది. చదవండి: బిగ్‌బాస్ బ్యూటీకి లైంగిక వేధింపులు.. ఆవేదనతో పోస్ట్ ''నన్ను నేను పెళ్లి చేసుకున్న అని పెట్టిన పోస్ట్‌పై చాలా మంది చాలా రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు విచిత్రంగా రియాక్ట్ అయితే, మరికొంతమంది నన్ను ద్వేషిస్తున్నారు. అందులో నా లైంగిక జీవితం గురించి అడిగారు. వారందరికి నేను నిజాయితీగా నేను చెప్పేది ఒక్కటే. నేను గుజరాత్‌కు చెందిన చాలా సాంప్రదాయమైన కుటుంబానికి చెందిన యువతిని. పెళ్లి అంటే చిన్నప్పటి నుంచి ఎంతో మంచి అనుభూతి ఉండేది. ఎప్పటినుంచో పెళ్లి చేసుకోవాలని ఉండేది. కానీ మాటలకు విలువ ఇచ్చి కట్టుబడు ఉండే వ్యక్తి నా జీవితంలో నాకు కనపడలేదు. అబ్బాయిలు తమ మాటలకు కట్టుబడు ఉండరని నాకు అర్థమైంది. చదవండి: నెట్టింట్లో అంజలి అసభ్యకర వీడియో వైరల్.. కన్నీరు పెట్టుకున్న నటి నేటి సాంకేతికత చాలా అభివృద్ధి చెందింది. మనిషి లేకుండా నా జీవితాంతం సంతోషంగా జీవించగలను అని నేను నమ్మడానికి కారణం అదే. శృంగారం కోసం పురుషుడి అవసరం లేదని నేను కచ్చితంగా చెప్పగలను. వివాహం అంటే కేవలం శృంగారం మాత్రమే కాదు. అది ప్రేమ, నిజాయితీకి సంబంధించినది. అంతేకాకుండా నేను సంపాదిస్తే ఇంకో మనిషి అవసరం నాకు లేదు. నేను నా కలలను స్వేచ్ఛగా నేరవేర్చుకోగలను. ప్రస్తుతం నేను అమెరికాలో ఉన్నాను. హాలీవుడ్ వైపు నా కెరీర్ సాగుతున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది అని తెలిపింది'' కనిష్క సోని. View this post on Instagram A post shared by Kanishka Soni (@itskanishkasoni) View this post on Instagram A post shared by Kanishka Soni (@itskanishkasoni) -
నా పెళ్లి ఎప్పుడో అయిపోయిందిగా..!!
లులూ జెమియా.. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ విద్యార్థిని... మొన్న ఆగస్టుతో ఈమెకు 32 ఏళ్లు నిండాయి.. అయితే మామూలుగా అందరికీ ఎదురయ్యే ప్రశ్నే లులూకూ, ఆమె తల్లిదండ్రులకు ఎదురైంది. పెళ్లెప్పుడు.. ఈ ప్రశ్న వినీ వినీ విసిగిపోయిన లులూ.. తల్లిదండ్రుల కోసం వధువుగా మారింది. వరుడు లేకుండానే వివాహ తంతు పూర్తి చేసుకుంది. అదేంటి అలా ఎలా అనుకుంటున్నారా? ‘నాకు పదహేరేళ్లు వచ్చిన నాటి నుంచే మా నాన్న నాకోసం వెడ్డింగ్ స్పీచ్ రాయడం మొదలు పెట్టాడు. ఇక మా అమ్మ అయితే నా ప్రతీ పుట్టిన రోజున ప్రార్థనలతో ఆ దేవుడిని ప్రాధేయపడేది. నన్ను ఎంతో జాగ్రత్తగా, ప్రేమగా చూసుకునే భర్త రావాలని మొరపెట్టుకునేది. కానీ నాకు మాత్రం ఇన్నేళ్ల జీవితంలో అలాంటి వ్యక్తి ఒక్కరూ తారసపడలేదు. అలా అని అమ్మానాన్నల ఆశను తీర్చకుండా ఉండలేను. అందుకే ఈ పుట్టిన రోజున(ఆగస్టు 29) నన్ను జాగ్రత్తగా చూసుకునే నా సోల్‌మేట్‌ని వివాహమాడాను. అదెవరో కాదు లులూ జెమియానే. అంటే నేనే’ అంటూ తనను తానే పెళ్లాడిన లులూ చెప్పుకొచ్చింది. గోఫండ్‌మీ అనే పేజీ క్రియేట్ చేసి తన పెళ్లికి ఖర్చులకు డబ్బులు సమకూర్చుకున్న లులూ.. అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో పెళ్లి చేసుకుంది. సోదరుడు తన కోసం తయారు చేసిన కేక్ కట్ చేసి బర్త్‌డేతో పాటుగా వెడ్డింగ్‌ను కూడా సెలబ్రేట్ చేసుకుంది. అయితే తల్లిదండ్రులు తన పెళ్లి చూడలేకపోయారనే లోటు మాత్రం మిగిలిపోయిందట. తమకు చెప్పకుండా లులూ ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో ఆమె తల్లిదండ్రులు షాకయ్యారు. లులూతో మాట్లాడటం మానేశారు. కానీ ఎలాగైతేనేం పెళ్లి చేసుకోవాలనే ఆలోచన అయితే తనకు వచ్చింది. ‘మా కోసం ఇలాంటి వింత నిర్ణయం తీసుకోవడానికి సిద్ధపడింది. కాబట్టి త్వరలోనే మనసు మార్చుకుంటుంది. ఈసారి జరిగే పెళ్లిలో తన పక్కన వరుడు కూడా ఉండాలి దేవుడా’ అంటూ మళ్లీ ప్రార్థించడం మొదలుపెట్టారు. మరి ఆ తల్లిదండ్రుల కోరిక ఎప్పుడు నెరవేరుతుందో!? -
విసుగుపుట్టి.. తనను తానే పెళ్లి చేసేసుకుంది!
ఎన్నాళ్లని ఒంటరిగా ఉంటాం.. పెళ్లి చేసుకుంటే పోలా అనుకుంది. కానీ వాళ్లను, వీళ్లను పెళ్లి చేసుకుంటే మజా ఏముందని అనుకుందో.. ఏమో గానీ తనను తానే పెళ్లి చేసేసుకుంది. అలాగని ఇదేదో ఆషామాషీ పెళ్లి అనుకున్నారా.. కాదు. దాదాపు 50 మంది అతిథులు కూడా ఈ పెళ్లికి హాజరయ్యారు. వృత్తిరీత్యా ఫొటోగ్రాఫర్ అయిన గ్రేస్ గెల్డర్ గత ఆరేళ్లుగా ఒకంటరిగా ఉంటోంది. దాంతో ఆమెకు విసుగుపుట్టింది. చివరకు తనను తానే ప్రేమించుకోవడం మొదలుపెట్టింది. అలా లండన్‌లోని పార్లమెంట్ హిల్ ప్రాంతంలో గల ఓ పార్కు బెంచీమీద కూర్చుని తనకు తానే 'నన్ను పెళ్లి చేసుకుంటావా' అని ప్రపోజ్ చేసుకుంది. దానికి మళ్లీ తానే అంగకరించి, ఓ వెడ్డింగ్ గౌను, ఉంగరం కొనుక్కుంది. పెళ్లినాటి ప్రమాణాలను జాగ్రత్తగా ఒకటికి పదిసార్లు నేర్చుకుంది. డెవన్ ప్రాంతంలో తన సోదరి, కొంతమంది స్నేహితులు హాజరు కాగా బ్రహ్మాండంగా పెళ్లి కూడా చేసుకుంది. అంతా అయ్యాక మరి ముద్దు ఎవరికి ఇవ్వాలి? ఆ తంతు కూడా కానించింది. ఒక అద్దం తీసుకుని, అందులో కనిపించే తన ప్రతిబింబానికి ముద్దు ఇచ్చింది. కొంతమంది తనను విమర్శించారని, అయినా అది స్వయం ప్రేమ కాబట్టి దాని గురించి ఏమీ అనుకోవక్కర్లేదని గ్రేస్ గెల్డర్ చెప్పింది. ఈ పెళ్లికి చట్టబద్ధత లేకపోయినా.. ప్రస్తుతానికి ఆమె మాత్రం 'సింగిల్' అయితే కాదట!!