విసుగుపుట్టి.. తనను తానే పెళ్లి చేసేసుకుంది! | Fed up of being single, woman marries herself! | Sakshi
Sakshi News home page

విసుగుపుట్టి.. తనను తానే పెళ్లి చేసేసుకుంది!

Published Mon, Oct 6 2014 12:38 PM | Last Updated on Sat, Sep 2 2017 2:26 PM

విసుగుపుట్టి.. తనను తానే పెళ్లి చేసేసుకుంది!

విసుగుపుట్టి.. తనను తానే పెళ్లి చేసేసుకుంది!

ఎన్నాళ్లని ఒంటరిగా ఉంటాం.. పెళ్లి చేసుకుంటే పోలా అనుకుంది. కానీ వాళ్లను, వీళ్లను పెళ్లి చేసుకుంటే మజా ఏముందని అనుకుందో.. ఏమో గానీ తనను తానే పెళ్లి చేసేసుకుంది. అలాగని ఇదేదో ఆషామాషీ పెళ్లి అనుకున్నారా.. కాదు. దాదాపు 50 మంది అతిథులు కూడా ఈ పెళ్లికి హాజరయ్యారు. వృత్తిరీత్యా ఫొటోగ్రాఫర్ అయిన గ్రేస్ గెల్డర్ గత ఆరేళ్లుగా ఒకంటరిగా ఉంటోంది. దాంతో ఆమెకు విసుగుపుట్టింది. చివరకు తనను తానే ప్రేమించుకోవడం మొదలుపెట్టింది. అలా లండన్లోని పార్లమెంట్ హిల్ ప్రాంతంలో గల ఓ పార్కు బెంచీమీద కూర్చుని తనకు తానే 'నన్ను పెళ్లి చేసుకుంటావా' అని ప్రపోజ్ చేసుకుంది. దానికి మళ్లీ తానే అంగకరించి, ఓ వెడ్డింగ్ గౌను, ఉంగరం కొనుక్కుంది. పెళ్లినాటి ప్రమాణాలను జాగ్రత్తగా ఒకటికి పదిసార్లు నేర్చుకుంది.

డెవన్ ప్రాంతంలో తన సోదరి, కొంతమంది స్నేహితులు హాజరు కాగా బ్రహ్మాండంగా పెళ్లి కూడా చేసుకుంది. అంతా అయ్యాక మరి ముద్దు ఎవరికి ఇవ్వాలి? ఆ తంతు కూడా కానించింది. ఒక అద్దం తీసుకుని, అందులో కనిపించే తన ప్రతిబింబానికి ముద్దు ఇచ్చింది.  కొంతమంది తనను విమర్శించారని, అయినా అది స్వయం ప్రేమ కాబట్టి దాని గురించి ఏమీ అనుకోవక్కర్లేదని గ్రేస్ గెల్డర్ చెప్పింది. ఈ పెళ్లికి చట్టబద్ధత లేకపోయినా.. ప్రస్తుతానికి ఆమె మాత్రం 'సింగిల్' అయితే కాదట!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement