Guppedantha Manasu Serial Actress Jyothi Rai Film Journey - Sakshi
Sakshi News home page

Guess The Actress: ఈ నటి చూడటానికే యంగ్.. అసలు మేటర్ వేరే!

Published Tue, Jul 18 2023 4:04 PM | Last Updated on Tue, Jul 18 2023 4:50 PM

Guppedantha Manasu Actress Jyothi Rai Full Details - Sakshi

పైన ఫొటో చూడగానే అరే.. ఈమె రామ్‌చరణ్ 'ఆరెంజ్' సినిమా హీరోయిన్ కదా అని అనుకున్నారేమో? అలా అయితే మీరు పప్పులో కాలేసినట్లు. ఎందుకంటే ఈమె ఆమె కాదు. ఈ బ్యూటీ కూడా హీరోయినే కాకపోతే కొన్నాళ్ల ముందు వరకు సొంత భాషలో పలు చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత బుల్లితెరకు షిప్ట్ అయిపోయింది. స్క్రీన్‌పై పద్ధతిగా కనిపిస్తున్నప్పటికీ, సోషల్ మీడియాలో రెచ్చిపోతూ, కుర్రాళ్లని రెచ్చగొడుతోంది.

అలా రెచ్చిపోతూ
సాధారణంగా ఓ వయసు వచ్చాక హీరోయిన్ల గ్లామర్ తగ్గిపోతుంది. ఈమెకి మాత్రం అది రివర్స్ లో జరుగతున‍్నట్లుంది. లేకపోతే ఏంటి ప్రస్తుతం ఈమె వయసు 38 ఏళ్లు. తెలుగులో 'గుప్పెడంత మనసు' సీరియల్‌లో జగతి పాత్రలో హీరో రిషికి తల్లిగా నటిస్తోంది. సీరియల్‌లో చీరకట్టుతో ఈమె సోషల్ మీడియాలో మాత్రం హద్దుల్లేకుండా రెచ్చిపోతోంది. అవును మీరు పైన చూసిన ఫొటోలు అవే.

(ఇదీ చదవండి: నాలుగో రోజు 'బేబీ'కి ఈ రేంజ్ కలెక్షన్స్.. నిజంగా గ్రేట్!)

పదేళ్ల క్రితమే
ఈమె అసలు పేరు జ్యోతిరాయ్. 1985 ఫిబ్రవరి 23న కర్ణాటకలో పుట్టింది. కన్నడలో స్టేషన్ 3, సిల్లీ లిల్లీ, శుభమాంగళ్య, కిన్నెర, జోగుల, జోజో లాలీ తదితర చిత్రాల్లో హీరోయిన్ గా చేసి గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో సీరియల్స్‌కి షిప్ట్ అయింది. కన్నడతో పాటు తుళు సీరియల్స్‌లో చేసింది. అలానే పదేళ్ల క్రితమే 'కన్యదానం' సీరియల్‌తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.

హీరోకి తల్లిగా కానీ
ఆ తర్వాత తెలుగు, కన్నడ సీరియల్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఫుల్ బిజీగా ఉంది.‍ ప్రస్తుతం 'గుప్పెడంత మనసు' సీరియల్ లో హీరో రిషికి తల్లిగా చేస్తోంది. ఈమె పద్మనాభ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ జంటకు ఓ కొడుకు కూడా ఉన్నాడు. అయితే 40 ఏళ్లకి దగ్గరలో ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యంగ్ హీరోయిన్లకు పోటీ ఇచ్చే రేంజులో రెచ్చిపోతోంది. దిగువన ఉన్న ఫొటోలు చూస్తే మీకే అది క్లియర్‌గా అర్థమవుతుంది. ఇంకెందుకు లేటు.. ఫొటోస్ దేఖో!

(ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి సూపర్‌హిట్ సినిమా!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement