తెలుగు సీరియల్ నటి.. ఇంతలా రెచ్చిపోవడానికి కారణం! | Reason Behind Guppedantha Manasu Serial Actress Jagathi's Latest Pics - Sakshi
Sakshi News home page

Jyothi Rai: ఇలా ఉండేది ఇలా మారిపోయింది.. కారణం ఏంటంటే?

Published Tue, Sep 26 2023 5:12 PM | Last Updated on Tue, Sep 26 2023 5:48 PM

Reason Behind Guppedantha Manasu Jagathi Latest Pics - Sakshi

తెలుగు సీరియల్ యాక్టర్స్ అనగానే పద్ధతిగా చీరతో కనిపిస్తారు. ఎమోషనల్ సీన్స్‌తో కంటతడి పెట్టిస్తారు. గత కొన్నేళ్ల నుంచి మనకు తెలిసింది ఇదే. కానీ అప్పుడప్పుడు మనకు బాగా తెలిసిన లేడీ యాక్టర్స్ కళ్లు చెదిరిపోయే రేంజులో షాకిస్తుంటారు. తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన ఓ సీరియల్‌లో జగతి మేడమ్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటి జ్యోతి రాయ్.. కొన్నాళ్ల ముందు వరకు చీరలో కనిపించేది. కానీ ఈ మధ్య గెటప్పే మార్చేసింది. హాట్‌నెస్‌కి కేరాఫ్ అడ్రస్ అయిపోయింది. దీనికి కారణమేంటో తెలుసా?

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 37 సినిమాలు)

లేడీ యాక్టర్స్ గ్లామర్ చూపించడం కొత్తేం కాదు. కానీ సీరియల్ నటి జ్యోతిరాయ్.. 40 ఏళ్లకు దగ్గరవుతోంది. ఆల్రెడీ పెళ్లయి ఓ బాబు కూడా ఉన్నాడు. అంతమాత్రాన గిరి గీసుకుని కూర్చోలేదు. సీరియల్‌లో తల్లిపాత్రలు వేస్తున్నప్పటికీ.. తనలోని గ్లామర్ యాంగిల్‌ని గత కొన్నాళ్ల నుంచి చూపిస్తూనే ఉంది. ఇన్‌స్టాలో రోజు లేదా రెండ్రోజులకు ఓసారైనా హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ నెటిజన్ల్ మతిపోయేలా చేసింది.

ప్రస్తుతం సీరియల్స్ తో పాటు సినిమాల్లో నటిస్తున్న జ్యోతిరాయ్.. ఓటీటీ కోసం 'ప్రెట్టీ గర్ల్' అనే వెబ్ సిరీస్ చేస్తోంది. ఇందులోని పాత్ర కోసం గత కొన్ని నెలలుగా తనని తాను మార్చుకుంటూ కుర్రహీరోయిన్లకు పోటీ ఇచ్చేలా తయారైంది. తాజాగా ఆ సిరీస్ ఫస్ట్ లుక్‍‌ని ఇన్ స్టాలో పోస్ట్ చేయడంతో ఈమె ఇంతలా రెచ్చిపోవడానికి కారణం ఏంటనేది అందరికీ అర్థమైపోయింది. మరోవైపు భర్తకు విడాకులిచ్చి, యువ దర్శకుడితో ఈమె రిలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈమె తన ఇంటి పేరు మార్చుకోవడంతోనే ఇలా మాట్లాడుకుంటున్నారు. ఈ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.

(ఇదీ చదవండి: సాయితేజ్-స్వాతి.. ఆ విషయం ఇప్పుడు బయటపెట్టారు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement