డేటింగ్‌ యాప్‌లో పరిచయం.. పెళ్లి చేసుకున్న నటి | Actress Twinkle Vasisht marries Harsh Tuli, Shares Photos | Sakshi
Sakshi News home page

డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయం.. ప్రియుడిని పెళ్లాడిన బుల్లితెర నటి

Published Wed, Mar 13 2024 8:03 PM | Last Updated on Wed, Mar 13 2024 8:42 PM

Actress Twinkle Vasisht marries Harsh Tuli, Shares Photos - Sakshi

బుల్లితెర నటి ట్వింకిల్‌ వశిష్ట్‌ పెళ్లిపీటలెక్కింది. ప్రియుడు హర్ష్‌ తులిని మంగళవారం పెళ్లి చేసుకుంది. ఈ విషయాన్ని నటి సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. కాగా ట్వింకిల్‌- హర్ష డేటింగ్‌ యాప్‌ ద్వారా కలుసుకున్నారు. ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ ప్రేమను పెళ్లితో పదిలపర్చుకోవాలనుకున్నారు. గతేడాది ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. మార్చి 12న ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. 

మా జర్నీ అంత ఈజీగా సాగలేదు
ఎన్నో హార్ట్‌ ఎటాక్‌లు, బ్రేకప్‌లు, ఎత్తుపల్లాలు, ఇతరుల ఎత్తిపొడుపు మాటల నుంచి ఇక్కడివరకు వచ్చాం. మా ప్రేమ నిజమైనది నిరూపించాం. మాకు ఎదురైన ప్రతీ పరీక్షలో ఒకరికొకరం అండగా నిలబడ్డాం. మాది విడదీయరాని బంధమని నిరూపించాం. మా ప్రయాణం అంత సులువుగా జరగలేదు. కానీ ఈ జర్నీలో ఓపిక, నమ్మకం, కమిట్‌మెంట్‌ అన్న పదాలకు అసలైన అర్థాలు తెలుసుకున్నాం. ఎన్నో ఛాలెంజ్‌లను దాటి ఈరోజు ఒక్కటిగా నిలబడ్డాం.. ప్రేమకు సరిహద్దు లేదని నిరూపించాం. ధృడ సంకల్పం, విధి ఆటలను అన్నింటినీ తట్టుకుని మా ప్రేమను నిర్మించుకున్నాం. ఐ లవ్యూ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ షేర్‌ చేసింది. ఈ పోస్ట్‌ వైరల్‌గా మారగా అభిమానులు, సెలబ్రిటీలు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఎన్నో బ్రేకప్‌లు
తమ పెళ్లి గురించి నటి మాట్లాడుతూ.. ఆరేళ్లలో ఎన్నోసార్లు బ్రేకప్‌ చెప్పుకున్నాం. కానీ మళ్లీ కలిసిపోయేవాళ్లం. మా ఫ్రెండ్స్‌ కూడా మా బంధాన్ని నమ్మలేదు. విడిపోతామనే చూశారు. కానీ మేము ఒకరికొకరం దూరం కాలేకపోయాం. ఎంత పెద్ద గొడవ జరిగినా మళ్లీ కలిసిపోయేవాళ్లం. నేను అరిచినా హర్ష్‌ మాత్రం ఎంతో మెచ్యూర్‌గా ఆలోచిస్తాడు. ఇలాంటి పార్ట్‌నర్‌ దొరికినందుకు సంతోషంగా ఉంది అని చెప్పుకొచ్చింది. కాగా ఈ బ్యూటీ ప్రస్తుతం కుండలీ భాగ్య అనే సీరియల్‌లో నటిస్తోంది.

చదవండి: హీరోయిన్‌ను అమ్మేయాలని చూసిన భర్త.. హనీమూన్‌లో అతడి ఫ్రెండ్స్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement