గర్భాశయ క్యాన్సర్ వల్ల నటి పూనమ్ పాండే మరణించిందంటూ ఆమె టీం ఇటీవల ఓ ప్రాంక్ చేసింది. దానివల్ల ఎంతటి వివాదం చెలరేగిందో అందరికీ తెలిసిందే! గర్భాశయ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించేందుకే బతికుండగానే చనిపోయినట్లు నాటకం ఆడింది పూనమ్. తన ఉద్దేశం బాగానే ఉన్నా, అవగాహన కల్పించాల్సిన తీరు బాగోలేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. అదే సమయంలో గర్భాశయ క్యాన్సర్ అంత ప్రమాదమా? దాని వల్ల మరణిస్తారా? అన్న చర్చ కూడా మొదలైంది.
క్యాన్సర్‌తో ఒకరు..
ఈ క్రమంలో తాజాగా బుల్లితెర నటి డాలీ సోహి (48) ఇదే క్యాన్సర్ బారినపడి కన్నుమూసింది. ఆరు నెలలుగా గర్భాశయ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె ముంబైలోని ఆస్పత్రిలో శుక్రవారం(మార్చి 8న) ఉదయం తుదిశ్వాస విడిచింది. మరింత విషాదం ఏంటంటే.. నటి కన్నుమూయడానికి ముందు రోజు ఆమె సోదరి అమందీప్ సోహి కూడా ప్రాణాలు విడిచింది.
జాండిస్‌తో సోదరి మృతి
పచ్చకామెర్ల వ్యాధి(జాండిస్) తీవ్రం కావడంతో ఆమె మృతి చెందింది. దీంతో ఆమె కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇద్దరు బిడ్డలు తమను వదిలేసి వెళ్లిపోయారంటూ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా బుల్లితెర ప్రేక్షకులకు డాలీ సుపరిచితురాలే! మేరీ ఆషిఖి తుమ్ సే హి, ఖూబ్ లడీ మర్దానీ.. జాన్సీకి రాణి, పరిణీతి వంటి పలు సీరియల్స్ ద్వారా ఆమె ఆడియన్స్‌కు దగ్గరైంది.
చదవండి:'గామి' మూవీ రివ్యూ
Comments
Please login to add a commentAdd a comment