ఈ అమ్మాయి పేరు ప్రతిభా రాంటా. జీటీవీ పాపులర్ సీరియల్ ‘ఖుర్బాన్ హువా’ చూసిన వాళ్లందరికీ ఆమె సుపరిచితురాలు. తనకున్న నాట్య కళను నటనారంగంలో అడుగు మోపడానికి ఊతంగా మలచుకుంది. విజయవంతం అయింది. సినిమా రంగంలోనూ అవకాశాన్ని సాధించి! అంతకుముందే దేశమంతా అభిమానులను సంపాదించికుంది వెబ్ సిరీస్‌లోనూ తన ప్రతిభను చాటి!
► ఆమె పుట్టింది సిమ్లాకు దగ్గర్లోని దరోటీలో. పెరిగింది సిమ్లాలో. తల్లి .. సందేశనా రాంటా, తండ్రి .. రాజేశ్ రాంటా.
► ప్రతిభాకు చిన్నప్పటి నుంచీ డాన్స్ అంటే ఇష్టం. అందుకే నాట్యంలో శిక్షణ తీసుకుంది. ఎన్నో పోటీల్లో పాల్గొంది.. ఫస్ట్ నిలిచింది. సిమ్లా డాన్స్ సెంటర్ నుంచి డిగ్రీ తీసుకుంది.
► నటనారంగంలో తన ప్రతిభను పరీక్షించుకోవడానికి ముంబై చేరింది. అక్కడి ఉషా ప్రవీణ్ గాంధీ కాలేజ్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో ఫిల్మ్‌మేకింగ్‌లో శిక్షణ తీసుకుంది.
► ఆ సమయంలోనే మోడలింగ్‌లో అవకాశాలు రావడం మొదలయ్యాయి. అప్పుడే (2018) మిస్ ముంబై అందాల పోటీల్లోనూ పాల్గొంది.. మిస్ ముంబై కిరీటం గెలుచుకుంది.
► ఆ గెలుపు టీవీ కమర్షియల్స్‌లో ఛాన్సెస్ తెచ్చి పెట్టింది.
► అలా కమర్షియల్స్‌తో బిజీగా ఉన్న టైమ్‌లోనే జీటీవీ ‘ఖుర్బాన్ హువా’ సీరియల్‌లో ప్రధాన భూమిక లభించింది.
► ఆ సీరియల్‌లో ఆమె కనబర్చిన నటనే ‘ఆధా ఇష్క్’ అనే వెబ్‌సిరీస్‌లో అవకాశాన్నిచ్చింది. అది వూట్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆధా ఇష్క్‌తో ప్రతిభా ప్రముఖ దర్శకురాలు కిరణ్ రావు మనసునే దోచేసింది. తన దర్శకత్వంలో రాబోతున్న ఓ సినిమాలో ప్రతిభాకు కథానాయిక వేషం ఇచ్చింది. దాంతో ఆమె ఇప్పుడు టాక్ ఆఫ్ ది బాలీవుడ్ అయింది.
చదవండి: 16 ఏళ్ల తర్వాత వెబ్‌సిరీస్‌తో నటి రీ ఎంట్రీ, స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఏమో, చనిపోతామేమో.. అని వీడియో, కొద్ది గంటలకే మృతి
Comments
Please login to add a commentAdd a comment