Palak Purswani: Avinash Sachdev Cheating Gave her Dad Heart Attack - Sakshi
Sakshi News home page

Palak Purswani: విడాకులైన వ్యక్తిని ప్రేమించా.. వేరే అమ్మాయిలతో తిరుగుతూ మోసం చేశాడంటూ ఏడ్చేసిన నటి

Published Sat, Jul 8 2023 6:08 PM | Last Updated on Sat, Jul 8 2023 6:30 PM

Palak Purswani: Avinash Sachdev Cheating Gave her Dad Heart Attack - Sakshi

ఈ రోజుల్లో ఆకర్షణను కూడా ప్రేమంటున్నారు. ఒకరు నిజంగా ప్రేమించినా మరొకరు మాత్రం టైంపాస్‌ చేస్తున్నారు. వేరొకరికి ఆకర్షితమై నిజంగా ప్రేమించినవారిని మోసం చేస్తున్నారు. అలా తాను కూడా మోసపోయానంటోంది నటి పాలక్‌ పురస్వాని. మాజీ బాయ్‌ఫ్రెండ్‌ అవినాశ్‌ సచ్‌దేవ్‌ చేతిలో దారుణంగా మోసపోయానని కంటతడి పెట్టుకుంది నటి. అప్పటికే పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న వ్యక్తిని ప్రేమించిన పాలక్‌ అతడి నిజ స్వరూపాన్ని ఆలస్యంగా తెలుసుకుంది.

పాలక్‌, అవినాశ్‌.. ఇద్దరూ హిందీ బిగ్‌బాస్‌ ఓటీటీ 2వ సీజన్‌లో పాల్గొన్నారు. పాలక్‌ మొదటివారంలోనే ఎలిమినేట్‌ కాగా అవినాశ్‌ ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నాడు. ఇకపోతే హౌస్‌ నుంచి బయటకు వచ్చేసిన పాలక్‌ తన గతాన్ని తలుచుకుని తీవ్ర భావోద్వేగానికి లోనైంది. 'అవినాశ్‌ వేరొక నటితో క్లోజ్‌గా ఉండగా నేను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నాను. ఈ విషయాన్ని అతడి పేరెంట్స్‌కు కూడా చెప్పాను. ఆంటీ, అంకుల్‌.. మీ కొడుకు ఏం చేస్తున్నాడో చూడండి.

పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న అతడికి దేవుడు రెండో ఛాన్స్‌ ఇచ్చాడు. దాన్ని కనీసం గౌరవించాలి కదా! అని ఆవేదన వ్యక్తం చేశాను. కానీ ఉపయోగం లేకపోయింది. 'అవినాశ్‌ ఒక్క ఛాన్సివ్వు అని వెంటపడేవాడు. ఇచ్చి చూసినా ఫలితం లేదు. మళ్లీ నాకు వేరే అమ్మాయితో పార్టీలో అడ్డంగా దొరికాడు. ఒకేసారి ఇద్దరు అక్కాచెల్లెళ్లతో కూడా ఫ్లర్ట్‌ చేసేవాడు. వారికి అతడు ఎంత గలీజ్‌ మెసేజ్‌లు చేశాడంటే అవి నేను నా నోటితో చెప్పలేను. అంత నీచంగా ఉన్నాయి.

అతడి క్యారెక్టర్‌ తెలిసి మా కుటుంబం చాలా బాధపడింది. అవినాశ్‌ను ఎంతగానో ప్రేమించే మా నాన్నకు ఈ విషయం తెలిసి గుండెపోటు వచ్చింది. అతడు ఆస్పత్రి పాలయ్యాడు. మేము బ్రేకప్‌ చెప్పుకుని చాలాకాలం అవుతోంది. కానీ ఇంతవరకు మా నాన్నకు అసలు పూర్తిగా ఏం జరిగిందనేది కూడా చెప్పలేదు' అంటూ ఏడ్చేసింది పాలక్‌. అవినాశ్‌ గతంలో శల్మాలీ దేశాయ్‌ను పెళ్లి చేసుకున్నాడు. రెండేళ్లు కలిసి ఉన్నారో లేదో విడాకులు తీసుకున్నాడు.

చదవండి: సరిగమప సింగర్‌ కూతురు కన్నుమూత.. ఏడాది కూడా నిండకముందే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement