
కావ్యశ్రీ- నిఖిల్ మళయక్కల్.. స్మాల్ స్క్రీన్‌పై జంటగా నటించిన వీరు రియల్ లైఫ్‌లోనూ ప్రేమించుకున్నారు. కలిసి షాపింగ్‌కు, షికార్లకు వెళ్లేవారు. యూట్యూబ్‌లో కూడా కలిసే వ్లాగ్ వీడియోలు చేసేవారు. తర్వాతేమైందో కానీ ఉన్నట్లుండి విడిపోయారు. నిఖిల్ పేరెత్తితేనే కావ్య ముఖం మాడిపోయేది.
కావ్య.. నిఖిల్ మధ్య దూరం
బిగ్‌బాస్ షోలో నిఖిల్ (Nikhil Maliyakkal).. ఈ జన్మకు నువ్వే నా భార్యవు అని కావ్యనుద్దేశించి పరోక్షంగా కామెంట్స్ చేస్తే చిరాకుపడిపోయింది. ఇలాంటి మోసగాళ్లను నమ్మొద్దంటూ నిఖిల్ పేరెత్తకుండానే అతడిపై సెటైర్లు వేసింది. అలా కావ్య (Actress Kavyashree) అతడిపై పీకలదాకా కోపం పెంచుకుంది. బ్రేకప్‌ను వెనక్కు తీసుకునే ఉద్దేశమే లేదని తన మాటలతో కరాఖండిగా చెప్పేసింది. దీంతో నిఖిల్ కూడా సైలెంటయిపోయాడు. తాజాగా కావ్యశ్రీ పెళ్లిపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.
పెళ్లే చేసుకోను
డ్రీమ్ బాయ్ ఎలా ఉండాలనుకుంటున్నారన్న ప్రశ్నకు.. అతడు నన్ను బాగా చూసుకోవాలి. నాపై ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. అంతకుమించి పెద్దగా ఏమీ లేదు అని తెలిపింది. ప్రేమ పెళ్లి చేసుకుంటారా? పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకుంటారా? అన్న ప్రశ్నకు.. అసలు పెళ్లే చేసుకోనంది. మీకు ఇరిటేషన్ అనిపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అంటే ఇంతకుముందు ఓ వ్యక్తి ఉండేవారు కానీ ఇప్పుడైతే అలా ఎవరూ లేరని తెలిపింది. జీవితంలో నేర్చుకున్న పెద్ద గుణపాఠం ఏంటన్న ప్రశ్నకు.. ఎవరినీ మోసం చేయకూడదు, ఎవరినీ బాధపెట్టకూడదు అని నేర్చుకున్నానంది.
చదవండి: ఆ సినిమా చూస్తుంటే చేదు గతం కళ్లముందుకు..: టాలీవుడ్ హీరోయిన్
Comments
Please login to add a commentAdd a comment