బంజారాహిల్స్ : నా మాట వినకున్నా..నాతో కలవకున్నా..నన్ను పెళ్లి చేసుకోకున్నా..ఈ సంక్రాంతికి నీ ఫొటోలన్నీ బ్యానర్లుగా చేసి ఊరంతా కడతానంటూ టీవీ సీనియర్ నటిని వేధిస్తున్న వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే..వెస్ట్ గోదావరి జిల్లా, కవటం గ్రామానికి చెందిన మహిళ (29) శ్రీకృష్ణానగర్‌లో ఉంటుంది.
ఆమెకు 2012లో కృష్ణమోహన్ అనే వ్యక్తితో పెళ్లి కాగా కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో గత రెండేళ్లుగా భర్తకు దూరంగా పిల్లలతో కలిసి కృష్ణానగర్‌లో ఉంటోంది. గత సెపె్టంబర్ నుంచి శ్రావణ సంధ్య అనే సీరియల్‌లో నటిస్తుంది. ఈ సందర్భంగా బత్తుళ్ల ఫణితేజ అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది.
గత నెలలో పెళ్లి చేసుకుంటానని చెప్పగా, అందుకు ఆమె నిరాకరించింది. అప్పటి నుంచి అసభ్యకరమైన మెసేజ్‌లు, వీడియోలు పెట్టడమే కాకుండా టీవీ ఇండస్ట్రీలో తాను వివిధ వ్యక్తులతో దిగిన ఫొటోలను చెడుగా ప్రచారం చేస్తున్నాడు. తనతో ఉండడానికి ఒప్పుకోకపోతే ఈ ఫోటోలతో సంక్రాంతికి ఆమె స్వ గ్రామంలో బ్యానర్లు కడతానని బెదిరిస్తున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు ఫణితేజపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment